Monday, December 24, 2012

చంద్ర స్పర్శ - II

        రఘుపతి కి ఇంటి నించి ఫోన్ వచ్చింది.

రఘుపతి భార్య: ఏమండి, ఇవాళ మీ పుట్టిన రోజు మరిచిపోయారా?

రఘుపతి: (తల మీద చేతితో రాస్తూ ...) అరె, పని హడావిడిలో మర్చిపోయాను.

భార్య: మీరు మర్చి పోతారని నాకు తెలుసండి. అందుకే ఆంజనేయుడి ప్రసాదం, తాయెత్తు బాగ్ లో ఉంచాను. తీసుకుని, చేతికి కట్టుకొండే? (చెప్పింది)

రఘుపతి: రాజీ, నాకివన్నీ ఇష్టం ఉండవని నీకు తెలుసు కదరా. ఆంజనేయ స్వామి ప్రసాదం అంటే ఒకే, ఇంకా ఈ తాయెత్తు లేమిటి, చిన్న పిల్లల్లాగా?

భార్య: కట్టుకోండి లేదంటే నామీద ఒట్టే. (చెప్పేసింది).

రఘుపతి: నీకు నామీద ఉన్న concern  కి ఒకే అనుకో, కానీ, ఈ జాతకాలు, తాయెత్తులు, నాకు ఇష్టం ఉండవు నీకు తెలిసినదే కదా.

భార్య: మీదంతా వితండ వాదం. అయినా, ఎక్కడెక్కడో ఉంటారు, ఏవేవో కేసులంటారు, మన జాగ్రత్త లో మనం ఉండాలి కదండీ.

రఘుపతి: అంటే ఇప్పుడు ఏమిటి రాజీ, నా revolver నాకు హెల్ప్ చెయ్యదా ఏమిటి, నా ట్రైనింగ్ నా చదువు అన్నీ ... (ఇంకా ఏదో చెప్తున్నాడు).

భార్య: అబ్బ ఊరుకోండి. అయినా చెప్పిన జాతకం లో ఎన్ని జరిగాయి మనకి, అన్నీ మర్చిపోయారా.

రఘుపతి: (నిట్టూరుస్తూ...) అంటే, ఏమిటి, ఈ తాయెత్తు నేను కట్టుకోవాలి, అంతే కదా! ఓకే (కట్టుకుంటూ)

భార్య: Good boy!

రఘుపతి: నీకోసమే కట్టుకున్నాను రా, అయినా మన ఫ్యూచర్ మనకే తెలియదు ఇంకా ఎవడికో ఎలా తెలుస్తుంది చెప్పు!

- 2 - 

Tuesday, December 11, 2012

వల్లి (పిచ్చి, ప్రేమ, కథ)

టీవీ 19 న్యూస్ లో వస్తోంది. Live గా అవార్డ్ ల హాల్ ముందు నించి కవర్ చేస్తున్నారు.

టీవీ 19: జానపద కళా ప్రపూర్ణ, జానపద కథల సామ్రాట్, గోల్డెన్ హాండ్ "సాహితి వర్మ" గారు, ఇప్పుడే వస్తున్నారు. ఆయన కారు బంజారా హిల్స్ దాటిందని ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ శ్రీ అవార్డ్ కి, ఆయన ఎంపిక అవ్వడం ముదావహం. ఈ లోపులోనే ఆయన రాసిన కథకి, ఎనిమిది నంది అవార్డులు రావడం నిజంగా, గొప్ప విషయం. ఈ విషయం పైన మీ కామెంట్స్ ఏమిటి? (స్టూడియో కి కాలు transfer  చేస్తూ అంది ...)

స్టూడియో: నిజంగా, మన తెలుగు కథల్లో మనదనేది, తగ్గిపోతోంది, ఇప్పుడు పరిస్థితి ప్రకారం చూస్తె, అసలు తెలుగు కథలు తెలుగు లాగానే ఉండటం లేదు. అటువంటి సమయం లో, మళ్ళీ ఆ పాత "కత్తి కాంతారావు" ని తెర మీద ఆవిష్కరించడం అనేది, చాలా గొప్ప విషయం. దాంతో పాటుగా, మంచి viewership, మంచి అవార్డులు ఒకే సారి, ఆ..., కొట్టెయ్యడం అనేది, చాలా గొప్ప విషయం. నిజంగా వర్మ గారు, మన తెలుగు వాడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వ పడుతున్నాను.

-- 2 --

టీవీ 19: అలాగే ఇప్పుడు వర్మ గారు వచ్చేసారు. ఆయననే అడుగుదాం. (కారు దిగిన వర్మ తో ...)

టీవీ 19: వర్మ గారు, "what is your secret of success?"

వర్మ: నవ్వుతూ, మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, తెలుగు ప్రజల ఆకాంక్ష, (ఈ మాట వింటూనే అక్కడ ఒక పెద్ద roar  వినిపించింది), నా నిరంతర ఆపేక్ష (ముగించాడు).

టీవీ 19: (ఇంక ముగిస్తూ) చూసారు కదండీ, ఇది మన తెలుగు ముద్దు బిడ్డ వర్మ గారి అంతరంగం. చూస్తూనే ఉండండి టీవీ 19, మీ ఫేవరెట్ న్యూస్ చానల్.

-- 3 --

అవార్డులు అయ్యాక, జనాల హర్ష ధ్వానాల మధ్య, కారు ఎక్కి కూర్చున్నాడు వర్మ. కారులో ఉన్నాడు మామ, తనకి వరసకి మామయ్య అవుతాడు. నేనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అని, అందరితోటి చెబుతాడు వర్మ. కానీ, అవకాశాల కోసమని హైదరాబాద్ వచ్చిన మామని ఒక ఘోస్ట్ రైటరు గా, ఉపయోగించుకుంటున్నాడని ఎవరికీ తెలియదు. ఇందాకా చెప్పిన "ఆ తెలుగు ప్రజల ఆకాంక్ష" డయలాగు కూడా మామ రాసిందే. ఎప్పుడు అదో నవ్వు నవ్వుతూ ఉంటాడు మామ,  టీవీ వాళ్లకి కూడా ఇదే చెప్తాడు వర్మ.

వర్మ: చంపేస్తున్నారు, చూసావు కదా. (చేతి వేళ్ళు దగ్గరగా పెట్టి, అక్షింతలు వేస్తున్నట్టు) అతి చిన్న వయసులోనే పద్మశ్రీ సంపాదించిన వర్మ గారు (నవ్వుతున్నాడు. ఒకింత గొప్పగా నవ్వుతున్నాడు. మామ కూడా అదో రకం గా నవ్వుతున్నాడు)

వర్మ సంపాదించిన ఆస్తి, ఒక 1000 కోట్లు ఉంటుందని తెలిసిన వాళ్ళు అంటారు, కాని నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. అతనికి చాలా మంది ఘోస్ట్ రైటర్స్ ఉన్నారని, అన్నారు కొందరు, కాని ఎవరికీ ఆధారాలు దొరక లేదు.
అతనికి అంత సీను లేదని అన్న వాళ్ళూ ఉన్నారు, వాళ్ళు చివరికి ఇండస్ట్రీ లో బేరాలు లేక ఇంటికి పోవాల్సి వచ్చింది. మొత్తానికి అతని సీక్రెట్ ఏమిటో ఎవరికీ తెలియదనే చెప్పాలి.

-- 4 --

కారు లో అందరూ నవ్వుతున్నారు. వర్మ అయితే చాలా నవ్వుతున్నాడు, మామ నవ్వు షరా మామూలే. ఇంతలో వర్మ ఫోను రింగు అవుతోంది. వర్మ ఫోను తీసాడు.

వర్మ: (నవ్వు గొంతు తోటి) హలో...!

అవతలి వైపు: నాకు నీ సీక్రెట్ తెలుసు.

అది వింటూనే వర్మ మొహంలో రంగులు మారాయి.

వర్మ: (మరొక్క సారి కన్ఫర్మ్ చేసుకుందామని) హలో, హలో!

అవతలి వైపు: నాకు నీ రహస్యం తెలుసు,

వర్మ: ఏమిటి నువ్వు మాట్లాడు తున్నది ఏమి అర్ధం కావటం లే... (పక్కనే ఉన్న మామ కేసి చూస్తూ, ఎవరికీ తెలియకూడదని లో- వాయిస్ లో ...)

వర్మ పూర్తి చేసే ముందే అవతలి వైపు నించి,

అవతలి వైపు: ఒక అమ్మాయి. ఒకే ఒక అమ్మాయి. ఒక అమ్మాయి, పేరు చెప్పనా! ఆ?

వర్మ: (ఈ సారి గట్టి గొంతు తోటి) వద్దు.

అవతలి వైపు: అలా రా దారికి. నేను చెప్పిన చోట, చెప్పినప్పుడు కాలు, అంటే, ఓకేనా!

వర్మ: ఓకే!

అవతలి వైపు: (ఎదో చెప్పాడు)... ఇప్పుడు ఫోన్ పెట్టేయ్, ఒకే!


వర్మ: ఓకే!


మామ ఎప్పటిలా నవ్వుతూనే ఉన్నాడు, వర్మ మొహం లోనే నవ్వు లేదు. ఎలాగో ఇంటికి చేరాడు వర్మ.

(సశేషం)

Monday, December 10, 2012

చంద్ర స్పర్శ - I

    నిశ్శబ్ద నిశీధి లో, ఒక శిల ఆకాశాన్ని చీల్చుకుంటూ నేల మీద పడింది. అది ఆంధ్రప్రదేశ్ లోని దేవరకొండ గ్రామం.  నిశ్శబ్దం గా ఆ శిల ఆ రాత్రి పడటం, ఎవరూ గమనించలేదు. అప్పుడు సమయం అర్ధ రాత్రి  పన్నెండు కావస్తోంది. అది చంద్ర శిల. చంద్రుడి ఉపరితలం నించి వచ్చినది కాదు, చంద్రుని అంతర్భాగం లోనిది, లేత నీలి రంగులో ప్రకాశిస్తోంది అది.

    ఆ పక్కనే ఒక పూరి గుడిసె ఉంది, అందులో నించి ఒక  చిన్న పిల్లవాడు (8 years  ఉంటాయి).  నిద్ర కళ్ళతో బయటకి వచ్చాడు ఆవులించుకుంటూ. ఇంటి గోడ వైపుగా తిరిగి, ఒంటేలుకి వెళ్తున్నాడు. నిశ్చలమైన ఆ రాత్రిలో, కీచురాళ్ళ అరుపులు తప్ప అక్కడ శబ్దం లేదు. ఒంటేలు, గోడ  మీద పడి, వంకరలు తిరుగుతూ, నేల మీద వెళ్తోంది.

    సడన్ గా ఆ పిల్లవాడి కళ్ళు ఎర్రబారాయి. ఇతని వెనుక దూరం లో ఉన్న ఆ శిల, గాలిలో కొంచెం ఎత్తులో ఎగురుతున్నట్టు నిలబడి ఉంది. సరిగ్గా ప్రకాశిస్తున్న చంద్రుడు, అటు వైపు కనిపించాడు. ఆ శిల నించి కరెంటు లాగా వస్తోంది, నేల మీదకి. సరిగ్గా ఆ కింద నించే వెళ్తోంది, ఇతని ఒంటేలు.

    మారు మాట్లాడకుండా అతడు, జిప్ క్లోజ్ చేసుకుని ఇంట్లోకి దూరాడు. చిన్న నవ్వు కనిపిస్తోంది అతని మొహంలో.

-- 2 --

    తెల్లవారింది, ఈ రోజు దశమి, విజయ దశమి, దసరా రోజు. ఈ వూరి వారికి చాలా special  ఈ రోజు. ఊళ్ళో సగం మంది ఎవరితోనూ మాట్లాడటం లేదు అట.వాళ్ళందరూ secret  గా ఏదో చేస్తున్నారని, కొంతమంది అనుకుంటున్నారు, ఛలోక్తి గా. అయితే వాళ్ళ కళ్ళు ఎర్రబడటం, ఎవరూ గమనించ లేదు అనుకుంటా.

    మెల్లగా సాయం సమయం అవుతోంది, ప్రపంచం నిద్ర పోవటానికి  సిద్ధం అవుతోంది. ఆ పల్లెలో ఇంకా తెల్లవారినట్లే ఉంది. అందరూ, లేచే ఉన్నారు. అక్కడక్కడా మీటింగులు జరుగుతున్నాయి. వాటిల్లో, కర్రలతో ఎలా కొట్టుకోవాలో ఆలోచిస్తున్నారు. అవును మరి, ఇది దేవరకొండ. ప్రతి సంవత్సరం ఇక్కడ, విజయ దశమి నాడు, ఈ వూరి వాళ్ళు పక్క వూరి జనాలు కర్రలతో కొట్టుకునే ప్రదేశం ఇది.

-- 3 --
అప్పుడు సమయం రాత్రి ఒంటి గంట. అంబులెన్సుల మోతతో ఆ ప్రదేశం మార్మోగి పోతోంది. బుర్రలు పగిలి రక్తాలతో ఉన్నారు, ఆ పక్క ఊరి వాళ్ళు. దేవర కొండ జనాలు, పక్క ఊరి వారిని చితక కొట్టారట. చిన్న పిల్లలూ, పెద్దలూ అందరూ పాల్గోన్నారు, దేవరకొండ తరపున. ఇది విచిత్రమే అయినా ఒక్క పిల్ల వాడికి కూడా దెబ్బలు తగలలేదు, విచిత్రం గా.

పోలీసులు గన్ లతో ఉన్నారు. దేవర కొండ వాళ్ళు అందరినీ, పట్టుకుని, జీపుల్లో ఎక్కిస్తున్నారు. అందరూ స్వచ్చందం గానే ఎక్కుతున్నారు జీపులు. ఈ రాత్రికి, దగ్గరలోని ఒక ఊళ్ళో పోలీసు స్టేషన్ లో పెట్టారు, రేపు పొద్దున్న కర్నూలుకి తరలిస్తారట.

కొంత సేపటికి, అక్కడ చెవిలో నులుముకుంటూ ఒక పోలీసు వచ్చాడు, అతడిని చూసి అందరూ సాల్యూట్ చేస్తున్నారు. కళ్ళతోనే పుచ్చుకుంటూ, నడుస్తున్నాడు అతను. మూడు షర్టు బటన్ల ని తీసేసి, గుట్కా నములుతూ,  చాలా రఫ్ గా ఉన్నాడు. వీళ్ళందరినీ చూస్తూ, పనులని చూస్తున్నాడు అతను.

ఎందుకో నవ్వుతూ జీపు ఎక్కుతున్నఒకడి కాలరు పట్టుకున్నాడు పోలీసు. వాడికి ఎడా పెడా రెండు ఇచ్చాడు, అయినా వాడు నవ్వు ఆపలేదు. ఈ సారి మూతి మీద ఇచ్చాడు, అయినా ఆపలేదు వాడు. "పిచ్చేమో సార్ " వెనకాల కానిస్టేబులు అన్నాడు.

పోలీసు: (నోట్లో రక్తం కారుతున్న వాడిని చూసి) లేదు లేదు, ఉత్త acting. నాలుగు తగిలిస్తే వెంటనే కక్కుతారు నిజం. (హాండ్స్ ఫోల్డు చేసుకుంటూ అన్నాడు).

వాడు మాత్రం, జీపెక్కి నవ్వుతూనే కూర్చున్నాడు. వాడి పళ్ళు, రక్తం తో నిండి ఉన్నాయి, వికృతం గా కనిపిస్తున్నాయి.

-- 4 --

మర్నాడు పొద్దున్న, 3 మినీ బస్సులలో వచ్చారు అక్కడికి. రఘుపతి, CID inspector, ఆన్ స్పెషల్ డ్యూటి, అక్కడికి రావడం జరిగింది. వస్తూనే, మన ఇన్స్పెక్టర్ తో,

రఘు: నాకన్ని డీటైల్స్ కావాలి. అసలీ సంఘటన ఎలా జరిగిందో, ఎవరికీ ఎలా నష్టం జరిగిందో అన్నీ కావాలి. ఇంకోటి, ఆ వూళ్ళో, పేరు ఏమిటి అన్నావు ...

Inspector: దేవర కొండ సార్! (నోట్లో కిళ్ళీ నములుతూ, చేతులు దండ కట్టుకుని అన్నాడు).

రఘు: ఆ కిళ్ళీ ఏమిటి అసహ్యంగా, ఉమ్మేయ్! (కళ్ళు చిట్లించి అన్నాడు. వెంటనే ఉమ్మేశాడు inspector).

రఘు: (మళ్ళీ తనే ...) అదే దేవరకొండ. ఆ వూళ్ళో ఇంత క్రితం ఇలాంటి వేమైనా జరిగాయా, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి వన్నె నాకు కావాలి.

రఘు: (కొంచెం సేపు తర్వాత ...) ఆ, ఒక్కటి మరిచిపోయాను. ఇక్కడ, ఒక మంచి డాక్టరు ఎవరు ఉన్నారు.

Inspector: ఇక్కడంటే కష్టం సార్, కర్నూలు పోవాలి అంతే! (చేతులు కట్టుకుని చెప్పాడు).

(సశేషం ...)

Wednesday, November 7, 2012

"చంద్ర స్పర్శ" (Curtain Raiser)

ఇంక లాభం లేదు, నేను చాలా కాలం నించి అనుకుంటున్న కధ "చంద్ర స్పర్శ" ని present  చెయ్యవలసిందే, ఇంకా ఆగితే, దీన్ని ఎదో దానికి కాపీ అంటారు. మరి six  లాంటి సినిమాలు వస్తున్నాయి కదా. ఓకే.

చంద్ర స్పర్శ, గ్రహాలకి మనుషులకి ఉన్న సంబంధాన్ని ప్రెసెంట్ చేసే కధ. ఇలాంటివి చాలా వచ్చినా, ఒక scientific angle లో కదని చెప్పడం ఇందులో కొత్త విషయం. అసలు జాతకం అంటే ఏమిటి, ఒక జాతకం ఉన్న వాళ్ళు, ఒక రకం ముత్యాలో, రత్నాలో ఎందుకు ధరించాలి, ఇలాంటి విషయాలని కల్పనని జోడించి, ఒక explanation (వివరణ) ఇవ్వడానికి ప్రయత్నించే కదాంశమే "చంద్ర స్పర్శ". ఇలాంటి full-length కథ జాతకాల మీద రాలేదు, ఇప్పటి వరకు. దానికి కాస్త suspense  జోడించి చెప్పే నా సరి కొత్త ప్రయత్నమే "చంద్ర స్పర్శ". మీరంతా enjoy  చేస్తారని ఆశిస్తూ, "మీ సలాహుద్దీన్". 

Tuesday, November 6, 2012

Serial Killers - IV


గురూజీ: కుదరదన్నా నా! (కొంచెం కోపం గా)

తెంబి: యాణ్ (తనూ గట్టిగా)

గురూజీ: (ఏవో లెక్కలు వేస్తూ నోట్లో ఆలోచిస్తూ ఉండి, చెయ్యి అడ్డం గా తిప్పాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు).

తెంబి: (ఏదో ఆలోచించి) ఒణ్ మిణిట్! (తన భుజానికున్న గుడ్డ సంచీ లోంచి, ఇవాల్టి న్యూస్ పేపర్ తీసాడు).

అందులో, ఈ రోజు సుడోకు ఉన్న పేజి తిప్పాడు. మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యడం మొదలు పెట్టాడు.     అయిదు నిమిషాల తర్వాత మొత్తం అంతా అయ్యింది. తర్వాత, ఉన్న తొమ్మిది చదరాల్లోను, మధ్య నంబరు circle  చేసాడు. వాటిల్తో ఏదో జ్యోతిష్యం లాగ గణించడం మొదలు పెట్టాడు. కొంత సేపటికి,

తెంబి: నోర్త్, ఇంద సాటైన్, డిల్లి ఇంద సాటైన్ (Saturn, శని). (Explain చేసాడు). జూపిటేయ్ (Jupiter, గురుడు) ఇంద ... (పెన్ను ఉన్న కుడి చెయ్యి పేపరు నించి పైకి లేపి, కుడి వైపు రెండు సార్లు ఊపాడు, ఈస్ట్ కి  వెళ్లాలన్నట్టు).

గురూజీ, కళ్లార్పి తల ఊపాడు.

ఇది చెప్పి తెంబి, నొసలు చిట్లించాడు, తర్వాత కళ్ళజోడు సవరించి, గురూజీ కళ్ళల్లో చూసిన తన కళ్ళు, కిందకి దించాడు. ఇదంతా చూసిన ముత్యాలకి మాత్రం ఏమి అర్ధం కాలేదు.

- 2 -
మొత్తానికి, హీరో సైకిలు మీద హై-వే మీదుగా హైదరాబాద్ నించి డిల్లీ వెళ్ళడం కాన్సిల్ అయ్యింది. అలా ఉత్తరం వైపు  వెళ్తే శని అట. తూర్పుకి వెళ్ళడం, వాస్తు ప్రకారం భేషని, గురూజీ, అండ్ తెంబి ప్రవచించడం జరిగింది. ఆల్రెడీ హీరోయిన్ను కోసమని డిల్లీ కి సైకిలు మీద వెళ్ళడం, ఒక నెల రోజులు లాగించారు, కాబట్టి, ఇప్పుడు కలకత్తా వెళ్ళడానికి మంచి కారణం కావలసి వచ్చింది. హై-వే మీద diversion పెట్టాలని తెంబి చెప్పిన సలహా అందరికీ నచ్చింది. (హై-వే under repair, ప్లీజ్ టర్న్ రైట్) పెట్టిన బోర్డుని, అక్కడ పెట్టారు. పక్కనే ఉన్న మట్టి రోడ్డు, చెట్ల గుబురు మీదకి మంచి diversion ఇచ్చారు.

జరిగిన ఎపిసోడులు already టీవీ లలోకి వెళ్ళిపోయాయి కాబట్టి, రూటు మార్చి, హీరో కలకత్తా వైపు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాల్సి రావడం జరిగింది.

- 3 -
ఇది జరిగిన తర్వాత, గురూజీ తెంబి అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపించడం మొదలెట్టారు. "సుడోకు లో జ్యోతిష్యం" అనే ఒక గొప్ప ప్రక్రియని తనకి పరిచయం చెయ్యడం తో, తన సహోద్యోగి తెలివి తేటలపై, అపారమైన నమ్మకం వచ్చింది గురూజీకి. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఆనంద భాష్పాలు వచ్చేవి గురూజీకి.

- 4 -
ఈ వార్త మొత్తం ఇంట్లో స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. ముత్యాలు, ఇంట్లో అందరికీ, పెద్ద గొంతికతో ఈ స్టోరీ చెప్పడం, అందరూ, (టీవీ unit తో సహా) తెంబి ని అభినందించడం జరిగాయి.

సత్తి రెడ్డి: సుడోకు తో జాతక మెట్ల చెప్తార్ర బై ...? 

నాయక్: ఏమో, నాకేం దెల్సు రా బై! (కొంచెం సేపాగి, హాలంతా చూస్తూనే ...) అసలు సుడోకంటే ఏంద్ర? (అసలు డవుటు చెప్పాడు)

సత్తి రెడ్డి: అయినా, పేపర్ల పక్కనే జాతకం ఉంటె, సుడోకు ఎందుకురా పూర్తి చెయ్యుడు?

నాయక్: (చిన్నగా నవ్వుతూ ...) ఏది జాతకమెక్కడ? చూపియ్?

సత్తి రెడ్డి: ఇదిగోరా భై! (సుడోకు పేజీలోనే ఉన్న జాతకం చూపించాడు).

నాయక్: ఇవాళేమి రాసిండో, చెప్పించుకోవాల. లాయరు బాబు ఉన్నడా ఏంది?

Saturday, September 22, 2012

అర్జునుడు - IX


  అర్జున్ కి మళ్ళీ ఒక కల వస్తోంది.

    చిమ్మ చీకటి. ఉరుములు, మెరుపుల మధ్య వాన. ఎక్కడా ఏమీ కానరాని ఆ వానలో అప్పుడప్పుడు మెరుపులు మెరిసినప్పుడల్లా ఒక మెరుపులా నేల మీద కనిపిస్తోంది ఒక రధం. ఏడు శ్వేతాశ్వాలు అతి వేగం గా పరిగెడుతున్న ఆ రధం లో ఉన్నది ఒక రాకుమారుడు, వెనుక రధంలో ఉన్నది ఒక నిండు చూలాలు. అయితే ఈ రాకుమారుడు అర్జున్ లాగ లేదు, అర్జున్ కి ఇదంతా తాను బయటినించి చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె సొమ్మసిల్లి పడి ఉంది. శ్వేతాశ్వాలను అతి వేగం గా పరుగు తీయిస్తున్నాడు అతడు. ఆ దారికి అంతం ఎక్కడా అతనికి కనిపించడం లేదు. ద్రష్ట చెప్పింది గుర్తుంది అతనికి, అది ఎంత దుస్సాధ్యమైనా, మానవ ప్రయత్నం చెయ్యక తప్పదు మరి. అతని కళ్ళలోని అశ్రుధారలు, ఆ అఘోరమైన తుఫాను వానలో కలిసిపోయాయి. 

    వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం (మన భాషలో చెప్పాలనుకుంటే), 10 మైళ్ళ దూరంలో ఉన్న రామ దేవాలయం. అక్కడికి వెళ్ళడానికి వాళ్లకి ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే time ఉంది. గుర్రాలు, ఎంత జాతి అశ్వాలు అయినా, పది మైళ్ళు పరిగెత్తడానికి, పది నిముషాలు తీసుకుంటాయి. దైవ సంకల్పం మాత్రమే వాళ్ళని, ఈ పరిస్థితి నించి బయటకు తీసుకువెళ్ళగలదు. "హే కృష్ణా... ముకుందా... పాహి పాహి..." మనసులో ప్రార్ధించాడు అతడు.

   ద్రష్ట వర్తమానం తెలియగానే అతను చెయ్యగలిగినదంతా చేసాడు. అన్ని గండభేరుండ పక్షులు (Genetically Engineered Animals), స్వయంచోదక విద్యుల్లతాశ్వాలు, మహాశ్వేత వరాహాలు యుద్ధంలోనికి నియోగింపబడటం చేత, సామాన్యమైన అశ్వాలతో కూడిన రధాలు మాత్రమే మిగిలాయి అతనికి. వాటితోనే, రాబోయే ముప్పు గురించి నగరమంతా చాటింపు వేయించాడు. అటువంటి ఒక రధాన్ని సమకూర్చుకుని, ద్రష్ట ఆజ్ఞ మీద, అయిష్టంగా తన నగర ప్రజలని వదలి పయనమయ్యాడు అతడు. అతని సేనాని నగర ప్రజలలో వాళ్ళు వీళ్ళని కాకుండా, వృద్ధులు, బాలలు, మహిళలను తీసుకుని, రధాలతో నగరం అవతలకి పంపిస్తున్నాడు. 

     రధాన్ని తీసుకుని నగరాన్ని దాటుతున్నరాకుమారునికి అనేక హృదయ విదారకమైన దృశ్యాలు పొడగాట్టాయి. అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నగర ప్రజానీకం లో ఒక్క పిట్ట కూడా చావు తప్పించుకోలేదు. ఈ విషయం తెలిసి, ప్రయత్నిస్తున్న తన అమాయక ప్రజలను అతడు చూడలేకపోయాడు. కొందరు తల్లిదండ్రులు, పిల్లలను వదిలిపెట్టి, పరుగులు తీస్తున్నారు. కొందరు యువకులు, వృద్ధులైన తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, రధాలలో స్థానం కోసం ఎగబడుతున్నారు. కొందరు భార్యలను విడిచిపెడుతున్నారు. ఈ ఘోరకలి రాబోయే చెడు రోజులకి సంకేతం లాగ ఉంది. తాము బతకమనే విషయం తెలిసిందో ఏమో, కొందరు కుటుంబసమేతం గా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు నగర ప్రజలు, గుళ్ళను, గోపురాలను ఆశ్రయిస్తున్నారు. 

     రాకుమారుడు ఆలోచనల నించి బయటపడ్డాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా అతనికి లీలగా ఒక ఆలయం ఎదురుగా కనిపిస్తోంది. కొంతసేపటికి, ఉరుములు, వాన శబ్దాల మధ్య, ఈదురు గాలికి కొట్టుకుంటున్న ఆ గుడి గంట కూడా అతనికి వినిపించింది. కాని సమయానికి తాను ఎదురీదుతున్నాడని తెలుసు అతనికి. రామాలయానికి చాల దగ్గరిలో ఉండగా, ఆకాశంలో ఒక భయంకరమైన ధ్వని, వెలుగు కనిపించాయి అతనికి. చిన్నగా విరక్తిపూరితమైన నవ్వు నవ్వాడతను. ఆ వెనువెంటనే నగర ప్రజల హాహాకారాలు వినిపి౦చాయి. వెర్రి వాళ్ళు, ఆకాశం నించి ఏదో పడటం చూసి ఉంటారు. 

    ఇక లాభం లేదని,రాకుమారుడు, సొమ్మసిల్లిన ఆమెని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఒక్క ఉదుటన ఆ రధం నించి దూకాడు. నేలపై ఆనుతూనే, తన శక్తినంతా ఉపయోగించి మరొక్క మారు గాలిలోనికి లంఘించాడు. ఈ సారి రామాలయం ముందున్న మంటపం లోనికి పడ్డారు ఇద్దరూ. ఇప్పటికే కూలబడిన అతడు, తన చేతుల్లోని స్త్రీని చాల జాగ్రత్తగా మంటపం మధ్యలో పరు౦డబెట్టాడు. ఏదో అనిపించి, తలెత్తి చూసాడు, పైన రామాలయం గంట మోగుతూనే ఉంది. పర్వాలేదు, తన బాధ్యత నిర్వర్తి౦చాననుకున్నాడు. 

      నిజానికి అతనికి ఏమి వినిపించటం లేదిప్పుడు. నేలపై ఆని మళ్లీ దూకినప్పుడు, అతని పాదం చీరుకుపోయింది. ఇప్పుడా పాదం రెండుగా కొంతవరకు చీలి, రక్తం వస్తోంది. ఎదురుగా స్పృహ తప్పిన ఆమెని చూసి, కళ్ళు మూసుకున్నాడతను. కళ్ళు మూసుకున్నాడు అనటం కంటే, స్పృహ కోల్పోయాడని చెప్పవచ్చు. 

    అది జరిగిన ఉత్తరక్షణం, ఒక పెద్ద వెలుగు, అతని వెనుక కనిపించిది. చెవులు చిల్లులు పడేటటువంటి భయంకరమైన శబ్దం చాల సేపు ఆ పరిసరాల్లో వినిపించింది. ఒక ఈదురు గాలి, ఏదో సందేశాన్ని మోసుకువస్తున్నట్టు, ఎవరికోసమో వెతుకుతున్నట్టు చాలా సేపు తచ్చాడింది. ఆ పక్కగా ప్రవహిస్తున్న గంగానది, ఏడ్చిఏడ్చి కనీళ్ళు ఇంకిపోయినట్టు, ఎండిపోయింది. ఆ ప్రదేశాన్ని కమ్ముకున్న మృత్యు మేఘాలు ఆ పై లోకాలకు దారి ఇస్తున్నట్టు విచ్చుకున్నాయి. అంతా ఐపోయింది. మనుషులే కాదు, నగర ప్రధాన కేంద్రం నించి పది మైళ్ళ దూరం లోని అన్ని ప్రాణులూ దేహం చాలించాయి. చెట్లు రక్తం కారుస్తున్నట్టు, రక్తవర్ణం దాల్చాయి. మనుష్య జాతి చరిత్రలో, ఇదివరకెన్నడూ చూడని విలయం మొదటిసారి పలకరించింది. కన్యాకుబ్జం, ఆ నిండు చూలాలి గర్భం లోని పసికందు కోసమని, శతాబ్దాల శాపాన్ని మోయడానికి సిద్ధమైంది. 

    బయటినించి ఇది చూస్తున్నట్టు అనిపిస్తున్న అర్జున్, మొహం తిప్పుకున్నాడు. ఈ సారి, రాకుమారుడు వేషంలో,  దూరం గా ఉన్న అర్జున్ తనకి కనిపించాడు, ఆ రాకుమారుని కళ్ళలో సన్నటి కన్నీటి పొర.

    అర్జునా..., దూరం గా రాజ గురువు  పిలుస్తున్నట్టు అనిపించింది అర్జున్ కి. వెంటనే కళ్ళు తెరిచాడు అర్జున్, అతని కళ్ళల్లోనూ ఒక సన్నటి కన్నీటి పొర.

(సశేషం)Wednesday, May 23, 2012

అర్జునుడు - VIII

    తెల్లవార కట్ట, కమాండర్ సుబోలిన్ చెప్పిన ప్రాంతం లో గస్తీ తిరుగుతున్న helicopters కి, ఈ బోటు కనిపించింది. రఘునాథ్ instructions మేరకి, చాలా జాగ్రత్త గా, ఒక ice box లోనికి, గ్లోవ్స్ సహాయంతో, సుబోలిన్ భుజాన్న ఉన్న బాగ్ ని మార్చారు సైనికులు. మళ్ళీ helicopter లోనికి చేరిన సైనికులు, philippines లో భాగమైన ఒక చిన్న దీవి వైపు వెళ్లారు. అది, రఘునాథ్ పరిశోధనలు చేసుకునే దీవి.

    రఘునాథ్ దీవిలో హెలిపాడ్ మీద హెలికాప్టర్ దిగింది. అక్కడ ఒక మిలిటరీ స్టైల్ లో ఒక కోట (fortress) ఉంది. ఎత్తైన కాంక్రీటు గోడలు, పెద్ద స్టీల్ door, దానికి రెండు వైపులా సైనికులు. Ice box తీసుకుని లోపలకి వెళ్ళిన వాళ్లకి, shake hand  ఇచ్చి, box తీసుకున్నాడు రఘునాథ్. ఫిలిప్పీన్స్ పంపించిన సైన్యం మొత్తం తన కళ్ళ ముందుగానే, చనిపోవడం అతనికి ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఏ ఫీలింగ్ లేకుండా ఆ box తీసుకున్నాడు రఘునాథ్.

    ఈ మట్టిలో ఏముందో, ఏమిటో తెలుసుకోవడానికి ఇంక చివరలో fight జరుగుతూ ఉండగా, కమాండర్ కి మట్టి, ఇసుక, మొక్కలు, నీళ్ళు, వీలయితే కొన్ని జంతువులూ, ఆ దీవి లోనివి వీలైనన్ని తీసుకురమ్మని (samples) చెప్పాడు రఘునాథ్. అలా తీసుకు వచ్చినవే ఈ box లో ఉన్నాయి. ఇక వీటి మీద ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టాలి రఘునాథ్.

-- 2 --

    ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు కావస్తోంది. ఆ రోజు philippines  అధ్యక్షుడి తో, మిలిటరీ జనరల్స్, ఇంకా రఘునాథ్ అందరూ మీట్ అవుతున్నారు. ఈ attack గురించే ప్రస్తావన వస్తుందని, అందరూ reports రెడీ చేసుకున్నారు. రఘునాథ్ ఆ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు.

రఘునాథ్: Gentlemen, we might have lost the battle, but not the war! In fact, మనం ప్రపంచం లోనే పెద్ద యుద్ధాన్ని గెలవబోతున్నాం. ఈ దీవి లో attack చేసి, మన సైనికులు మరణించడం వాస్తవమే. అయితే, నా పరిశోధనల ప్రకారం ...

ఇంకా ఏదో చెప్పబోతున్న రఘునాథ్ కి అడ్డం వస్తూ,

సోన్వక్: (ఒక కుర్ర మిలిటరీ ఆఫీసర్, ఫిలిప్పీన్స్ కి చెందిన వాడు) మిస్టర్ రఘునాథ్, ముందు అది ఎలా జరిగిందో చెప్తారా? ఎందుకంటే, మీరు scientist  గా చేసే పరిశోధనలకి ఇది అనువైన సమయం కాదేమో (కొంచెం వెటకారం గా అన్నాడు).

అది విన్న రఘునాథ్, మొహం కోపం తో జేవురించింది, ఏమి చెప్పాలో తెలియక ఉన్న రఘునాథ్ పరిస్తితి చూసి,

అధ్యక్షుడు: మిస్టర్ సోన్వక్, మీ వంతు రాక ముందు మాట్లాడటం మంచిది కాదు, పైగా, మన దేశానికి ఎంతో సేవ చేసిన రఘునాథ్ అవసరమే మనకి ఉంది (కోపం గా ఎటో (సోన్వక్ వైపుగా) చూస్తూ, తల ఊపుతూ అంటున్నాడు).

సోన్వక్ silence అయ్యాడు. రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: Gentlemen, lets come to the point. ఆ దీవిలో బంగారం, వజ్రాలు metals/valuables ఉన్నాయని మనం attack చేసాం, అయితే ఇంకా గొప్పది, వెలకట్టలేనిది ఆ దీవిలో ఉంది. (స్క్రీన్ మీద ఆ దీవి తాలూకు ఏరియల్ వ్యూ వస్తోంది). It has antidote for every modern weapon, everything! Even the nu...

చెప్తూ ఆపు చేసాడు, Slides change చేసాడు.

రఘునాథ్: For my younger colleagues, (సోన్వక్ కేసి ఒక సారి చూసి, project అయ్యిన slide కేసి చూపిస్తూ), ఇది 1945 లో హిరోషిమ లో జరిగిన అణు బాంబు విస్ఫోటనం. ఈ విస్ఫోటనం ఒక పెద్ద నగరాన్ని బలికొంది. అంత వరకూ, ప్రపంచం లో ఎవరికీ కూడా, ఒక నగరాన్ని, అందులో ఉండే లక్షలాది ప్రజలని, చంపే ఆయుధం లేదు. అణుబాంబు మాత్రమే అంత విధ్వంసం సృస్టించగలదు.

రఘునాథ్: అణుబాంబు పేలినపుడు, మొదట, అతి ఎక్కువ శక్తి తో ఉన్న కణాలు వేగం గా బయటికి వస్తాయి (Slide change అయ్యింది). ఆ కణాలు, వేగంగా వెళ్తూ, తమ దారిలో ఉన్న అన్నిటినీ  గుద్దుకుంటూ మెల్లగా స్లో అవుతాయి. రెండు కార్లు గుద్దుకుంటే, వేడి ఎలా పుడుతుందో అలాగే, ఇవి గుద్దుకున్న ప్రతి వస్తువూ, చాలా వేడెక్కి పోతుంది, ఇంచు మించు గా, అణుబాంబు పడిన సెకన్లలో, ఆ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఆవిరయి పోతుంది. (Slide change). Imagine, వంద కిలోమీటర్ల వేగం తో వెళ్ళే కారు ఏ గోడనో గుద్దుకుంటేనే, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అదే గంటకి కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగం తో వెళ్ళే కార్లు, ఒకటి కాదు, కొన్ని కోట్లు, ఎక్కడ పడితే అక్కడ, గుద్దుకుంటే, ఎంత ప్రమాదం జరుగుతుందో. That is the destructive ability of an Atom bomb.

రఘునాథ్: అదే అణుబాంబు. The Ultimate of Weapons, the technology that had not met its match, well. at least till now! ఆయుదాలకే ఆయుధం, ప్రపంచ దేశాలన్నీ, ఒక దానికి ఒకటి పడక పోయినా, యుద్ధం అంటే భయ పడేది, ఎందుకంటే, అణుబాంబుకి. ఇంత వరకూ ప్రపంచ దేశాల దగ్గర, దీనికి సమాధానం లేదు. ఒక దేశం దగ్గర అణుబాంబు ఉంది అంటే, అమెరికా అయినా రష్యా అయినా సరే, దాని వైపు కన్నెత్తి చూడదు, కాని అదంతా ఇప్పటి వరకు.

రఘునాథ్: Gentlemen, I present to you, one and only technology, that can nullify atom bombs. ప్రపంచం అంతా భయపడే అణుబాంబుకి విరుగుడు, ఆ దీవిలో ఉంది. (Slide change అయ్యింది. ఫిలిప్పీన్స్ సైనికులు ప్రయోగించిన ఆయుధాలు అన్నీ, దీవి లోపలకి వెళ్ళక పోవడం కనిపిస్తోంది, వీడియో లో). మనం ఇప్పటి వరకూ బుల్లెట్లు వెళ్ళక పోవడం చూసాం, plastic-made  మిస్సైల్ వెళ్లకపోవడం చూసాం, poisonous-gases వెళ్లకపోవడం చూసాం, but, నా పరిశోధనలో తేలింది ఏమిటి అంటే, అణుబాంబులు కూడా ఆ దీవిని ఏమి చెయ్యలేవు.

అధ్యక్షుడు: మిస్టర్ రఘునాథ్, ఎంతవరకు మీరు దీనిని కన్ఫర్మ్ చెయ్యగలరు? (కొంచెం డవుటు గా అడిగాడు).

రఘునాథ్: 100% Mr. President, 100%. నేను చేసిన పరిశోధనల్లో, 100%, ఇట్ వర్క్స్ (చిన్నగా నవ్వాడు).
(ఏమి చెప్పాలో తెలియక, నమ్మలేకుండా చూస్తున్న అందరి కేసి చూసి, రఘునాథ్)

రఘునాథ్: Let me explain! Gentlemen, let me show you. (లేచి నిలబడిన కొందరిని కూర్చోమన్నట్టు సైగ చేసాడు అధ్యక్షుడు. అందరూ కూర్చున్నారు, silence అయ్యింది మీటింగ్ హాల్ అంతా). ఇది యురేనియం, (Remote button నొక్కితే డోర్ ఒపెనయ్యి కనిపించింది). అణుబాంబుల్లో వాడేది, Of course, చాల తక్కువ మొత్తం లో, no danger, it is in very less quantity. దీని పైకి, ఆ దీవి లో ఉన్న, గాలిని పంపిస్తాను చూడండి. (అది ఉన్న గ్యాస్ చాంబర్ లోనికి, గాస్ పంపించాడు. చూస్తుండగానే యురేనియం మాయం అయ్యింది).

రఘునాథ్: Gentlemen, ఆ దీవిలోని మట్టిలో గాలిలో, ఒక బాక్టీరియా (వైరస్) ఉంది. అది, దీవి చుట్టూ, ఒక కనిపించని గొడుగు లాగ ఉంది. ఆ క్రిములు, దేనినైనా లోహాన్ని గాని, ప్లాస్టిక్ ని గాని, యురేనియుం వంటి రేడియో ధార్మిక పదార్ధాలని గాని తిన గలవు. They react with everything in-organic, and release it in the form of gases. ఆ కవచాన్ని (దీవి చుట్టూ, ఒక లేత ఆకుపచ్చ రంగు, పార దర్సకమైన గొడుగు కనిపిస్తోంది ఇప్పుడు), దాటి, లోహం గాని, plastic weaponry గాని లోపలకి వెళ్ళలేవు.

రఘునాథ్: Just imagine, ఈ క్రిముల్ని మనం పెంచి, ఇందులో ఓన్లీ అణ్వాయుదాలు తినే క్రిముల్ని వేరు చేసి, ఫిలిప్పీన్స్ చుట్టూ ఒక గొడుగు లా పెట్టుకొంటే, ఏ అగ్ర రాజ్యం అయినా మనల్ని ఏమి చెయ్యలేదు. (స్వరం మెల్లగా పెంచుతూ) నేల మీద నించి వచ్చినా, నీటిలో నించి వచ్చినా, ఆకాశం నించి వచ్చినా, మన శత్రువుల ఆయుధాలు, మన ముందు నిర్వీర్యం అయ్యిపోతాయి. మన దేశాన్ని ఇంత కాలం, అణిచివేసిన, మిగతా ప్రపంచ దేశాలు, మన శత్రువులూ, మనకి దాసోహం అంటాయి. ఫిలిప్పీన్స్ will be, Number 1.

అధ్యక్షుడితో సహా అందరూ, నిలబడి చప్పట్లు కొట్టారు.


Saturday, March 10, 2012

అర్జునుడు - VII


    ఫిలిప్పీన్స్ తో యుద్ధం ఇంక నేడో, రేపో అన్నట్టుగా ఉంది. దగ్గరగా వచ్చి వెళ్ళే ఫిలిప్పీన్స్ బోట్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అర్జున్ తన తెలివి అంతా ఉపయోగించి, దీవి చుట్టూరా land లో కందకాలు తవ్వించాడు, వాటిల్లో మొసళ్ళని పెట్టారు. దూరంగా పెద్ద పెద్ద రాళ్ళని విసిరే, యంత్రాలు తయారు చేయించాడు అర్జున్. అయితే లోహం తో చేసిన పెద్ద పెద్ద బాణాలు వాటి ద్వారా విసరడానికి రాజ గురువు ఒప్పుకోలేదు. అతను అవి పని చెయ్యవని మొండిగా వాదించడం, అర్జున్ కి ఆశ్చర్యం గా అనిపించింది.

    అక్కడక్కడా దీవిలో, ఫిలిపీన్స్ వైపు, చిన్న చిన్న గొయ్యిలు తవ్వుకుని, అందులో కూర్చున్నారు విలుకాళ్ళు అందరూనూ. ఆ గొయ్యిల ముందు వైపుగా, రాళ్ళు, కర్రలు పేర్చి కొంత ట్రెంచ్/బంకర్ లాగా తయారు చేయించాడు అర్జున్. అందరూ యుద్ధానికి రెడీ గా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్తితి లోను, ఎవ్వరూ దీవి దాటి ముందుకి వెళ్లకూడదని రాజ గురువు, అర్జున్ ద్వారా order వేయించాడు.

     ఎట్టకేలకి అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఫిలిప్పీన్స్ వైపు నించి, తెల్లవారు జాము మూడు గంటలకి, రెండు పెద్ద పెద్ద ఓడలూ, ఆ పైన ఐదు హెలికాప్టర్లూ, కనిపించాయి. గస్తీ వాళ్ళు అనుమానం వచ్చి, కాగడా లాంటి బాణం వేశారు, అందులో అవి కనిపించాయి. దూరానికి మెల్లగా వస్తున్న ఓడలని చూసి, వాళ్ళు signal ఇచ్చారు. వెంటనే కొమ్ము బూరాలతో, మొత్తం దీవి అంతా అప్రమత్తం  అయ్యింది.

     ఫిలిప్పీన్స్ వాళ్ళు ఈ యుద్ధానికి చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పవచ్చు. రఘునాథ్ అవసరం లేదని చెప్పినా, "చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలని" అన్నట్టు, ఈ చిన్న దీవి మీదకి, ఐదు వేలమంది ని పంపించాడు, మిలిటరీ జనరల్ "ఉత్తర ప్రసేర్త్". సైన్యం ఎక్కడ ఉందో, ఎలా ఉందో, వాళ్ళకీ వీళ్ళకీ communication అంతా రేడియోల్లో జరుగుతోంది. చిట్ట చివరిగా తమ జనరల్ ఇచ్చే కమాండ్ కోసం చూస్తున్నారు అందరూ. ఫిలిప్పీన్స్ దీవిలో అందరికీ కనిపించేలా, పొగమంచు లో, భారీ లైట్లతో, సౌన్డ్సు తో.ఉన్నారు ఒడలతో సైన్యం. అక్కడంతా స్మశాన నిశ్శబ్దం ఆవరించింది.

     ఉన్నట్టుండి ఫిలిప్పీన్స్ సైన్యం లో ఏదో అలజడి. తమ కమా౦డర్ ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు, గన్ లని ఇటు వైపు తిప్పుతున్నారు వాళ్ళు. ఉన్నట్టుండి, దీవిలో ఒకడు, తన బల్లెం పట్టుకుని, గట్టి గా అరుస్తూ, దీవి దాటి నీళ్ళల్లోకి వెళ్ళాడు. ఫిలిప్పీన్స్ attack స్టార్ట్ అయ్యింది.

     అటాక్ మొదలయ్యి చాలా సేపయ్యింది. దీవి వాళ్ళ తరపున, ఒకే ఒక్కడు చచ్చాడు, అది కూడా మొదట బల్లెం తీసుకుని అరుచుకుంటూ నీళ్ళల్లోకి వెళ్ళిన వాడే. Philippines వాళ్లకి ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదు. చాలా బుల్లెట్లు ప్రయోగిoచారు. బాంబులు, missiles, ఒకటేమిటి చాలా ప్రయోగించారు. అయినా ఏమి
జరుగుతోందో, దీవి లోని వాళ్లకి గాని, ఇటు philippines వాళ్లకి గాని అర్ధం కావడం లేదు. దీవిలోని వీరులు, మొదట బంకర్లలో నక్కిన వాళ్ళు, మెల్లగా తల పైకెత్తి, చూస్తున్నారు. కొందరైతే బయటికివచ్చారు కూడ. Philippines వాళ్ళ హడావుడి అంతా వినిపిస్తోంది, కనిపిస్తోంది కూడా. కాని ప్రయోగించిన ఆయుధాలు మాత్రం జాడ లేకుండా దీవి లోనికి enter అయ్యే చోట, మాయం అవుతున్నాయి.

    ఇక లాభం లేదని, philippines కమాండర్, ఒక helicopter ని దీవి మీదుగా వెళ్లవలసినదిగా ఆదేశిoచాడు. పెద్దగా శబ్దం చేసుకుంటూ, అది దీవికి దగ్గరగా వచ్చింది. Radio communications లో, అందులోని వాళ్ళు కమాండర్ తో మాట్లాడటం, దీవి వాళ్లకి వినిపిస్తూనే ఉంది. శత్రువు రక్షణ కోసం ఎలాంటి పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదని, వాళ్ళు కమాండర్ తో చెప్తూ ఉండగానే, జరిగిoది, ఒక విచిత్రo. దీవికి కొంచెం ఎత్తుగా ఎగురుతున్న ఆ Helicopter, అమాంతం ఏదో మాయం అవుతున్నట్టుగా, దాని body అంతా కనుమరుగు అవ్వడం కనిపిoచింది. చివరికి అందులోని మనుషులు, వాళ్ళ బట్టలు, బాగ్స్, మాత్రం మిగిలాయి. అంత ఎత్తు నించి, helicopter లోని మనుషులు దీవి లోనికి పడటం కనిపించింది. 

    విరిగిపోయిన Helicopter propellor ముక్క ఒకటి, తిరుగుతూ, దూరాన్న Binoculars తో చూస్తున్న కమాండర్ దగ్గరికి వెళ్లి పడింది. అంత రాత్రిలో కూడా, అది పడిన బోట్ల మీద, మంటలు చెలరేగడం తో, వాటి మీదనించి నీటిలోకి దూకుతున్న Philippines సైనికులు, స్పష్టం గా కనిపించారు. Binoculars పక్కకి తీసిన  కమాండర్ కళ్ళల్లో విస్మయం, కొద్దిపాటి భయం స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం దీవి లోని వాళ్లకి స్పష్టం గా కనిపించింది. ఎక్కడి నించి వచ్చాడో తెలియదు గాని, రాజ గురువు, హటాత్తు గా తన దండం తో అక్కడికి వచ్చాడు. రెండు చేతులూ పైకి ఎత్తి (దండం తో సహా), విజయ నాదం అన్నట్టు, ఒక బొబ్బ పెట్టాడు. మిగిలిన సైన్యం అంతా అతనితో శృతి కలిపింది, జయజయ ధ్వానాలతో ఆ దీవి మారు మ్రోగింది. అర్జున్ కి ఒక్కడికీ ఏమి చేయాలో, ఏమి అనాలో తెలియడం లేదు. 

    దీనితో ఆ philippines సరిపెట్టుకోదని అర్జున్ కి తెలుసు. ఏదో తెలియనిది జరుగుతోంది, కాని ఇంకా నమ్మకం కలగడం లేదు అతనికి. అర్జున్ రెండో వైపు తిరిగి, నిట్టూరుస్తున్నప్పుడు, Philippines నించి ఒక పెద్ద horn వినిపించింది. అది direct attack కి సంబంధించినది. ఓడలమీద నించి, తాళ్ళ సహాయంతో దిగుతున్నారు, philippines సైనికులు. జయజయ ధ్వానాలు ఆపి దీవిలో అందరూ అటు వైపుగా చూడటం మొదలు పెట్టారు. అశేషం గా వస్తున్న ఆ సైనికులని చూసి, దీవిలో అందరూ రాజ గురువు కేసి తిరిగారు. రాజ గురువు మ, అందరినీ వాళ్ళ వాళ్ళ places లో ఉండమని చెప్పాడు అంతే.

    ఈ సారి, కమాండర్ కి పైనించి ఆర్డర్స్ వచ్చాయి. రఘునాథ్, గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చెయ్యమన్నాడు.
వీలు కాకపొతే ఆ దీవిలోని మట్టి, రాళ్ళు, ఇసుక, కొంచెం కొంచెం గా తీసుకు రమ్మన్నాడు రఘునాథ్.
పువ్వులు, ఆకులూ, జంతువుల చర్మం లేదా రక్తం కూడా తీసుకు రమ్మన్నాడు. రాజ గురువు ని, రాజుని
దొరికితే చంపకుండా తీసుకు రమ్మని కూడా చెప్పారు philippines వాళ్ళు. అతి కష్టం మీద, విలుకాల్ల చెక్క/రాతి బాణాల బారిన పడకుండా, ఎలాగో దీవి దగ్గరికి వచ్చారు సైనికులు. కమాండర్ signal  మీద అందరూ, దీవి లోపలి వెళ్ళడానికి రెడీ గా ఉన్నారు.

    దీవి లోపలి సైనికులు, బయటికి రావడం లేదు. కమాండర్ signal  మీద, లోపలి వెళ్తున్న సైనికుల ఆశ్చర్యానికి అవధులు లేవు. ఎందుకంటే, ఎవరో తినేసినట్టు, తమ తుపాకులు, గ్రనేడ్లు, మాగజిన్ లూ, మాయం అయ్యి పోవడం కళ్ళార చూస్తున్నారు. చివరికి చేతిమీద ఉన్న రిస్ట్ వాచ్, మెడలో బంగారు నగలూ, ఉంగరాలతో సహా అన్నీ మాయం అవుతున్నాయి. చివరికి సైనికులు అంతా నిరాయుధులై లోపలి వచ్చారు. అయోమయం గా చూస్తున్న వారిపైన, ఇనుప గొడ్డళ్ళతో/కత్తులతో దాడి చేసారు, దీవిలోని వాళ్ళు. మొత్తానికి అతి సులువుగా, దీవి వాళ్ళు గెలవడం జరిగింది.

     దీవి లోని వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. నవ్వుతూ అందరి మధ్యా ఉన్న అర్జున్ సడన్ గా, సీరియస్ అయ్యాడు. అందరి మధ్యలోనించి పరిగెత్తిన అర్జున్, దూరంగా beach వైపు వెళ్ళాడు. అక్కడ దూరంగా, రొప్పుతూ, beach ఇసుకని బాగ్ లో పోస్తున్న కమాండర్ కనిపించాడు. అర్జున్ ని చూసి పరుగు
లంకించాడు కమాండర్. సముద్రం దిశగా పారిపోతున్న అతని పైకి, పక్కనే ఉన్న ఒక బల్లెం విసిరాడు అర్జున్.
పొగమంచులో కలిసిపోయిన కమాండర్ గురించి, ఇంక పట్టించుకోకుండా మళ్ళీ దీవి లోనికి వెళ్ళాడు అర్జున్. 

    మంచు లో పరిగెడుతున్న కమాండర్ కి బల్లెం గుచ్చుకుంది, అయినా పరిగెడుతున్నాడు అతను. ఆ పొగమంచు లో కొంత దూరం వెళ్ళాక, కొంచెం లోతు నీళ్ళలోకి వెళ్లి, ఒక philippines కి చెందిన బోటు మీదకి  ఎక్కాడు అతను. బోటులో ఎవరూ లేరు. అతి కష్టం మీద, అక్కడ ఉన్న engine room లోకి వెళ్లి, ఆ బోటు ని ఫిలిప్పీన్స్ వైపుగా start  చేసాడు. Head Quarters కి తన చివరి Radio communication, మొదలు పెట్టాడు."You will find my dead-body in the same boat" తో end చేసాడు.

-- (సశేషం) --

Tuesday, January 17, 2012

అర్జునుడు - VI

అది ఫిలిప్పీన్స్ లోని మనిలా లో Military district. ఒక పెద్ద భవంతిలో, మిలిటరీ దుస్తుల్లో కొంతమంది. వాళ్ళంతా ఒక meeting hall లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక presentation జరుగుతోంది. Presentation ఇస్తున్నది, ఫిలిప్పీన్స్ King's Scientific advisor, భారతీయ సంతతి కి చెందిన Dr. రఘునాథ్. 

రఘునాథ్: Gentlemen! I will make it brief. (బటన్ నొక్కాడు, తెర మీద ఒక ద్వీపం యొక్క aerial view కనిపిస్తోంది). ఈ ద్వీపం మన దేశానికి 100 మైళ్ళ దూరం లో ఉంది. ఇంత కాలం ఎందుకో మన satellite images లో ఇది కనిపించలేదు. ఇప్పుడు కనిపించిన data ప్రకారం దీన్లో చాలా విలువైన ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. దీన్ని సొంతం చేసుకోవడం వల్ల, మన దేశానికి ఆర్ధికం గా బలం చేకూరుతుంది. 

రఘునాథ్: (తనే మళ్ళీ కంటిన్యూ చేసాడు). మనకు తెలిసిన సమాచారం బట్టి, ఈ దీవి ఇంకా ఆటవికుల చేతిలో ఉంది. వాళ్లకి సముద్రం మీద ప్రయాణించడం, ఇంకా తెలియదు. వాళ్ళ technology కూడా మన ముందు నిలబడదు (Slides change చేసాడు). వాళ్ళని గాని, వాళ్ళ రాజుని గాని ఏదో మాయ మాటలు చెప్పి convince చెయ్యచ్చు. (ఏదో పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు). ఒక వేళ మనల్ని రానివ్వకపొతే, వాళ్ళ దీవిని వశపరచుకోవడం చాలా ఈజీ, ప్రపంచ దేశాల ద్రుష్టి లో పడకుండా పని కానివ్వాలి అంతే (ఈ మాటని ఫిలిప్పీన్స్ ప్రస్తుత అధ్యక్షుడి కేసి చూస్తూ అన్నాడు రఘునాథ్).

మీటింగ్ చాలా success అయ్యింది. అందరూ ఆ దీవిని నయానో, భయానో ఫిలిప్పీన్స్ లో కలిపెయ్యలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ దీవికి కొంతమంది దౌత్యవేత్తలని పంపారు, అందులో రఘునాథ్ కూడా ఉన్నాడు. వాళ్ళంతా ఆటవికులే కాబట్టి రఘునాథ్ పెద్దగా ఏమి prepare అవ్వలేదు, రాజు తో మాట్లాడటానికి.

వీళ్ళు దీవిలో అడుగుపెట్టగానే ఆటవికులు వీళ్ళని బంధించారు. రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఎత్తైన సింహాసనం లో కూర్చున్న అర్జున్ ని చూసి కొంచెం disappoint అయ్యాడు రఘునాథ్. అర్జున్ చెప్పిన మీద, వీళ్ళ చేతుల కట్లు విప్పారు ఆటవికులు.

రఘునాథ్: హలో, నా పేరు రఘునాథ్! (చెయ్యి ముందుకి చాపాడు). (ఇది చూసిన ఆటవికులు, attack చేస్తున్నాడనుకుని బల్లేలతో ముందుకి వచ్చారు. వారిని వారించి అర్జున్ సింహాసనం దిగి కిందకి వచ్చాడు).

Shake-hand అయ్యాక, రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: మీ దీవిలో, మంచి వన మూలికలు ఉన్నాయని మాకు తెలిసింది, వాటిని ... ఇక్కడ నించి ... తవ్వి తీసుకునేందుకు మా ప్రభుత్వం ... నన్ను ఇక్కడికి ... పంపించింది (పూర్తి చేసాడు).

అతను మాట్లాడుతున్నంతసేపు, అర్జున్ అతని మొహం కేసి చూడలేదు. అతని వేషాన్ని, మిలిటరీ డ్రెస్ ని కింద నించి పై దాకా చూస్తున్నాడు. అలా చూస్తున్న అర్జున్ కి అతని identity card కనిపించింది.

అర్జున్: రఘునాథ్! (కార్డు లో పేరు చదువుతూ). ఇండియన్నా? (అడిగాడు, కొద్దిగా నవ్వుతూ)

రఘునాథ్: I am from Philippines! నేను పుట్టింది ఇండియాలో, కాని ఇప్పుడు ఉన్నది మటుకూ ఫిలిప్పీన్స్, I am a citizen of Philippines, not an Indian. (ఎలాగో పూర్తి చేసాడు రఘునాథ్. పూర్తి కాగానే, జేబు లోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. కొంచెం tension గా ఉంది అతనికి. ఎవడో ఆటవికుడు ఉంటాడనుకుంటే, ఒక నాగరికుడు రాజుగా ఉండటం, తనని అన్ని ప్రశ్నలు వెయ్యడం, పైగా తను చెప్పింది వినకుండా, అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది).

అర్జున్ మొహం లోని చిరునవ్వు మాయం అయ్యింది.

అర్జున్: (ID కార్డు ని వదిలేస్తూ) ఏ మూలికలు?
రఘునాథ్: ఆ ...!
అర్జున్: అదే, ఏమి వన మూలికలు అని?
రఘునాథ్: మూలికలంటే, చాలా ఉన్నాయి, many of them are here! ప్రపంచానికి కావలసిన ఎన్నో మంచి మూలికలు ఇక్కడే ఈ ద్వీపం లోనే ఉన్నాయి. అందుకే మేము ఇక్కడికి (ఇంకా చెప్తూ పోతున్నాడు, మధ్యలో అర్జున్)

అర్జున్: నన్ను చెప్పమంటారా? ఈ దీవిలో ఏ పెట్రోలో, డయమండ్సో, బంగారమో మీకు కనిపించాయి, అందుకే ఇక్కడ అవన్నీ తవ్వి తీసుకుపోవడానికి ఇక్కడకి వచ్చారు. (రఘునాథ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు).

రఘునాథ్ తో ఇవి చెప్పడానికి ముందు రాజగురువు కేసి ఒక సారి చూసాడు అర్జున్. అతడు అనుమానం గా వద్దన్నట్టు తలాడించడంతో, తన మనసులోమాట బయటికి చెప్పాడు.

రఘునాథ్ ఇంకేమి మాట్లాడలేకపోయాడు. తిరిగి అర్జున్,

అర్జున్: (రఘునాథ్ కేసి తిరిగి) చూడండి, ఇక్కడి ప్రజలు ప్రకృతి ని తల్లి గా భావిస్తారు. ఆ తల్లిని ఏదో లోహాల కోసమో, ఖనిజాల కోసమో తవ్వడం వీళ్ళ దృష్టి లో మాతృ హత్య. వీళ్ళకి రాజు గా నేను చెప్పేది ఒకటే, ఈ విషయం వీళ్ళల్లో ఎవరికీ తెలియక ముందే ... వెళ్ళిపొండి! ఇంకొక్క క్షణం ఉంటె, నేనే ఏమి చేస్తానో తెలియదు. (కోపంగా రఘునాథ్ కేసి చూసాడు అర్జున్).

రఘునాథ్, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫిలిప్పీన్స్ తమ మీదకి యుద్ధానికి వస్తుందని, అందరికీ తెలుసు. ఇవాళో రేపో, ఆ ఆధునిక మారణాయుధాలతో తాము ఎలా పోరాడతామో, అర్జున్ కి తెలియడం లేదు.

-- 2 --
అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. దశాణి  ... నవాణి ... (సంస్కృతం లో అనుకుంటా, countdown జరుగుతోంది) ...  షష్టీహి ... ... శూన్యం 

వెంటనే తెల్లటి వెలుగు కళ్ళముందు కనిపించింది. భయంకరమైన ధ్వని, కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగు కనిపించాయి అతనికి. ఆ తెల్లటి వెలుగు మెల్లగా దుమ్ము తెరగా మారింది. ఆ దుమ్ము లోనించి వస్తున్నాయి రెండు రదాశ్వాలు. రధం పైన నించుని చూస్తున్నాడు, ఒక ఆజానుబాహుడు. చూస్తే అచ్చు అర్జున్ లాగానే ఉన్నాడు. రాజరికపు దుస్తులలో ఉన్న అతని మొహం తేజోవంతం గా ఉంది. స్ఫురద్రూపి ఐన అతని కళ్ళలో మాత్రం ఒక సన్నటి కన్నీటి తెర.

రధం అతి వేగం గా పయనిస్తోంది. రధం వెళ్తున్న ప్రదేశం పేరు గాండీవ క్షేత్రం. అది పాండవుల తాలూకు అమ్ముల పొది, శస్త్రాలను భద్రపరిచే చోటు. మోడరన్ భాషలో చెప్పాలంటే "Missile Silo". పాండవుల తాలూకు అస్త్రాలైన "పాశుపతం", "వారుణాస్త్రం", "బ్రహ్మాస్త్రాదులు" అక్కడ భద్రపరచబడి ఉంటాయి. దారికి ఇరు వైపులా ఉన్న సైనికులు అతనికి వందనం చేస్తున్నారు.

రథం ఒక సువిశాలమైన భవంతి ముందు ఆగింది. ఈ నాటి Military style లో ఎత్తైన గోడలు, ఒక ఇనుము తో చేసిన మందమైన ఎత్తైన ద్వారం ఉన్నాయ్ ఆ భవనం చుట్టూ. రథం దిగి రాకుమారుడు ఒంటరిగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఏదో Identification/Password అడిగింది ఆ ద్వారం సంస్కృతం లో, ఇతను చెప్పాడు. ద్వారం పైకి లేచింది, లోపలికి వెళ్ళాడు, అతని వెంట ఒక నలుగురు సైనికులు మాత్రమే లోపలికి వెళ్ళారు. అతని రాకని, కొన్ని పెద్ద పెద్ద చిలకలు ఆటోమాటిక్ గా చెప్తూ ఆ భవనం లోపలి దారులలోనికి వెళ్ళాయి. చిలుకలు చెప్తున్నవి గాని, ద్వారం వద్ద identification అతడు ఏమి చెప్పాడో, అర్జున్ కి తెలియడం లేదు.

రాజు వేషంలో ఉన్న అర్జున్ దగ్గరికి రాగానే అన్ని తలుపులూ వాటంతట అవే తెరుచుకోసాగాయి (face recognition అనుకోవచ్చు). సంస్కృతం లో అవి అతనికి సైనిక వందనం చెప్పడం కూడా మొదలు పెట్టాయి. అర్జున్ ఒక A/C chamber లోనికి ప్రవేశించాడు. అతని వెనుక వచ్చిన సైనికులు ద్వారం దగ్గరే ఆగిపోయారు. ఆ A/C chamber లో temperature maintain చేస్తున్నవి పువ్వులు. ఒక గోడ అంటా creepers లాగ పెరిగిన కొన్ని పెద్ద పూల మొక్కలు, వేడి ని control చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఒకొక పువ్వు అందులోంచి రాలి పోతోంది కూడా.

అక్కడ అనేకమైన Computer లు, ఆ chamber కి సంబంధించిన temperature etc... వివరాలు సంస్కృతం లో చెప్తున్నాయి. ఒక పక్కగా ఐదుగురు ఋషులు (తెల్లటి dress ల్లో, పెద్ద గెడ్డాలతో) ఉన్నారు. Chamber మధ్యలో ఉన్న అర్జున్ దగ్గరికి వాళ్ళల్లో ఒక ముని వచ్చాడు. వణుకుతున్న చేతులతో, అతనొక Glass box (గాజు పెట్టి), అర్జున్ కి అందించాడు. అది అందుకొంటూ ఆ ముని కేసి చూసాడు అర్జున్. ఆ ముని కళ్ళు దించుకొన్నాడు. ఆ ముని తిరిగి తన స్థానానికి వెళ్ళాడు.

తర్వాత ఆ రాకుమారుడు ఆ గది లోనే ఉన్న ఒక Glass Chamber లోనికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఆ chamber తలుపులు మూసుకున్నాయి. అతని ఎదురుగా ఉన్న పెద్ద buttons panel లో ఏవో buttons నొక్కాడు. తర్వాత బ్రహ్మ దేవుడు తనకు ఇచ్చిన మంత్రాన్ని password గా enter చేసాడు. ఆ తరువాత గాజు పెట్టె లోని crystal ని తీసి panel లోనికి key లాగ పెట్టాడు. Count down సంస్కృతం లో start అయ్యింది. ఎందుకో తెలీదు అతని కళ్ళల్లో నీళ్ళు, అర్జున్ కి తానె ఏడుస్తున్నట్టు అనిపించింది. ఒక వీరుడికి ఉండవలసిన గర్వం అతని కళ్ళల్లో ఇప్పుడు మాయమయ్యింది.

Countdown start అయ్యింది, శూన్యం (Zero) అంటూనే, అర్జున్ కి మెలకువ వచ్చింది. నిద్ర లేచిన అర్జున్ కళ్ళలో నీళ్ళు, ఎందుకు వచ్చాయో తనకి తెలియడం లేదు.

తెలతెల వారుతున్న ఆ సమయం లో, కోట దిగి కిందకి వచ్చాడు అర్జున్. అక్కడే చలిమంట చుట్టూ, కొంతమంది వీరులతో కూర్చున్నాడు రాజ గురువు. తన వైపే చూస్తున్న రాజ గురువు పక్కగా కూర్చున్నాడు అర్జున్. అర్జున్ కేసి మెరుపు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు రాజ గురువు.

రాజ గురువు: భారతం చెప్పుకుంటున్నాము, వింటావా అర్జునా! (ఎంతో ప్రేమగా అడిగాడు రాజ గురువు. అర్జున్ తల ఊపాడు). మనుషుల బుర్రలపైన యుద్ధమనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చరిత్ర ఎన్ని చెప్పినా, ఎంత వీరత్వాన్ని ప్రబోధించినా యుద్ధం చేసిన ప్రతి వీరునికి అంతః కరణ లో ఏదో ఒక బాధ, తప్పు చేసిన భావన ఇంచుమించు తప్పదు.

సాదివూ: (ఈ మధ్యలో తన సందేహాన్ని వెల్లడించాడు సాదివూ) మంచి కి చెడు కి మధ్య జరిగే యుద్ధానికైనా రెండువైపులా నష్టాలు తప్పవు. చెడ్డ వాని వైపు కూడా మంచి వాడు ఉంటాడు, అలాంటప్పుడు యుద్ధం ఎలా చెయ్యడం?

రాజ గురువు: నిజమే, భారతం లో శల్యుడు చావలేదా? ఎం, శల్య సారధ్యం వల్లనే కదా, కర్ణుడి ఆత్మ విశ్వాసం క్షీణించింది? భీష్ముడు, ద్రోణుడు, కొంతవరకు కర్ణుడు చెడ్డవాళ్ళంటే నమ్మడం కష్టం. ఒక మంచి కోసమని ఇంతమందిని చంపడానికి, ఇంత చెడు చెయ్యడానికి మనిషన్న వాడికి బాధే కదా? (రాజ గురువు చెప్పుకు పోతున్నాడు). అయితే శ్రీ కృష్ణుడు ఏమి బోధించాడు? మనుషులం, మనమెవరం? మంచి చెడ్డలు ఎంచడానికి మనమెవరం, అంతా ఆ పరమాత్ముడే చూస్తాడు, మన పని అల్లా దేవుడు మనకిచ్చిన గమ్యాన్ని చేరుకోవడమే! (అర్జున్ కేసి తిరిగి నవ్వుతూ అన్నాడు).

అర్జున్ కళ్ళలో ఎందుకో నీళ్ళు, అతనికి అర్ధం కావడం లేదు, బాధ ఎక్కడినించి వస్తోందో? అలాగని యుద్ధం అంటే భయం లేదు అతనికి, జరగబోయేది తలచుకుంటే, అందరి ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేద్దాం అనిపిస్తోంది, కాని పని జరగదే?

తెల్లవారుతూండగానే, గస్తీ కి కూర్చున్న సాదివూ తదితర వీరులు వెళ్ళిపోయారు. తనకి వచ్చిన కల గురించి చెప్దామనుకున్నాడు అర్జున్. అతని కేసి తిరిగి, నవ్వుతూ తను ఇందాక చెప్తున్నది continue చేస్తున్నట్టుగా అన్నాడు రాజ గురువు.

రాజ గురువు: (అర్జున్ భుజం మీద చెయ్యి వేసి) సత్యానికి ధర్మానికి నిలబడే ధర్మరాజు అంతటి వాడే "అశ్వద్ధామ హతః, (కుంజరః)" అని అబద్ధం చెప్పాడు. ఇంద్రుడు, అర్జునుడి తండ్రి (చిన్నగా నవ్వుతూ...) కర్ణుడి వద్ద, మాయోపాయం తో యాచించవలసి వచ్చింది. మంచి యందు నమ్మకం తో బ్రతికేది మనుషులే, వాళ్ళనే ఈ యుద్ధాలు బాధిస్తాయి. దేవుడైన శ్రీ కృష్ణుడు, తత్వాన్ని చెప్పాడు కాని, మనుషుల బాధను నివారించలేడు గా?!
(కళ్ళు మూసుకుని కృష్ణుడికి నమస్కరించాడు రాజ గురువు).

రాజ గురువు: (కొంత సేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి..., మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న అర్జున్ కేసి క్రీగంట చూసి, గమనించి) నువ్వు ప్రయోగించినది బ్రహ్మశిరో నామకాస్త్రం, నాలుగు బ్రహ్మాస్త్రాల పెట్టు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చోట, అప్పటి జన నష్టం మాత్రమె కాకుండా, ఎన్నో దీర్ఘ కాలిక ప్రభావాలు ఉంటాయని, ముఖ్యంగా అక్కడ కొంత కాలం వరకు పంటలు పండవని, భూమి నిస్సారమౌతుందని, పిల్లలు పుట్టరని, పుట్టిన వాళ్ళు వికారంగా పుడతారని చెబుతారు.

అర్జున్ కి ముందు పూర్తిగా అర్ధం కాలేదు, ఆతర్వాత తన కల గురించే చెప్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాజ గురువు, అదేమీ పట్టించుకోకుండా చెప్తున్నాడు.

రాజ గురువు: ప్రస్తుతం ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అటువంటి నాలుగు బ్రహ్మాస్త్రాలని తీసుకు వెళుతోంది. కౌరవుల ఆధీనం లో ఉన్న నాలుగు చిట్టచివరి నగరాల పైకి ఆ అస్త్రాలని సంధించారు పాండవులు. అవే గనుక ఆ నగరాల మీద పడితే, కౌరవులతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా భయంకరంగా చస్తారు. అన్ని తెలిసి, అన్న గారు యుధిష్ఠిరుని ఆజ్ఞ మీద, ఈ పని చెయ్యక తప్పలేదు నీకు. ఐతే, ఇదే సమయంలో దుర్యోధనుడి ప్రోద్బలం మీద, అశ్వత్థామ అదే అస్త్రాన్ని తమపై సందిస్తున్నాడని తెలియదు పాండవులకి.

రాజ గురువు: నిజానికి కౌరవులు ఈ అస్త్రాన్ని ముందే ప్రయోగించారు. ఈ రెండు అస్త్రాలని ప్రయోగించినట్టు దివ్య దృష్టి (prediction technology అనుకోవచ్చు, మన భాషలో) ద్వారా తెలుసుకొన్న వశిష్టుడు, ఇద్దరికీ ఆ అస్త్రాలని ఆపమని వర్తమానం పంపించాడు.

అది విన్నాక నీవు వెంటనే, ఆ నాలుగు అస్త్రాలని ఉపసంహరింపచేసావు. ఐతే, తన గర్వం కోసం సమస్త ప్రపంచాన్ని నిర్లక్ష్యం చెయ్యగల సుయోధనుడు మాత్రం, అంత త్వరగా ఇది పడనివ్వలేదు. అశ్వత్థామ చేత మూడే ఉపసంహరింప చేయించాడు అతడు. నాలుగో అస్త్రాన్ని మటుకు, బభ్రువాహనుడు ఉన్న కన్యాకుబ్జం వైపు సంధించాడు మానధనుడు, దుర్యోధనుడు. అతనికి తన చావు సమీపించిందని తెలుస్తూనే ఉంది, కాని పాండవుల వంశోద్దారకుని హత్య చెయ్యదలిచాడతడు. అందుకే నీ కుమారుడు అభిమన్యుని విధవ (Widow), ఉత్తర, కడుపులో పెరుగుతున్న భ్రూణాన్ని చంపదలిచాడతడు. అతనే ప్రస్తుత పాండవ వారసుడు కాబట్టి, ఆ పసి కందుని చంపడం ద్వారా పాండవ వంశాన్ని చెయ్యగలిగినంత మట్టు పెట్టాలన్నదే అతని ధ్యేయ౦. ప్రస్తుతం, నెలలు నిండిన ఉత్తర తన బావగారైన బభ్రువాహనుని సంరక్షణలో ఉంది. సరిగ్గా ఆమె ఉన్న కన్యాకుబ్జం వైపు వెళ్తోందా అస్త్రం.

ఏదో తెలిసినట్టు, తెలియనట్టు అనిపిస్తోంది అర్జున్ కి. చూసినట్టుగా అనిపిస్తోంది, కాని పూర్తిగా గుర్తుకిరావడం లేదు. నమ్మాలనే ఉంది, కాని నమ్మబుద్ది వెయ్యడం లేదతనికి. చెప్పింది సగం విని సగం వదిలేసానా అనిపించింది అతనికి, కాని మొత్తం అంతా ఏదో చూసినట్టు, గుర్తుగా ఉంది. ఆ సందిగ్ధం లో ఎలాగో అక్కడినించి కదిలాడు అతను.

-- (సశేషం) --