నిశ్శబ్ద నిశీధి లో, ఒక శిల ఆకాశాన్ని చీల్చుకుంటూ నేల మీద పడింది. అది ఆంధ్రప్రదేశ్ లోని దేవరకొండ గ్రామం. నిశ్శబ్దం గా ఆ శిల ఆ రాత్రి పడటం, ఎవరూ గమనించలేదు. అప్పుడు సమయం అర్ధ రాత్రి పన్నెండు కావస్తోంది. అది చంద్ర శిల. చంద్రుడి ఉపరితలం నించి వచ్చినది కాదు, చంద్రుని అంతర్భాగం లోనిది, లేత నీలి రంగులో ప్రకాశిస్తోంది అది.
ఆ పక్కనే ఒక పూరి గుడిసె ఉంది, అందులో నించి ఒక చిన్న పిల్లవాడు (8 years ఉంటాయి). నిద్ర కళ్ళతో బయటకి వచ్చాడు ఆవులించుకుంటూ. ఇంటి గోడ వైపుగా తిరిగి, ఒంటేలుకి వెళ్తున్నాడు. నిశ్చలమైన ఆ రాత్రిలో, కీచురాళ్ళ అరుపులు తప్ప అక్కడ శబ్దం లేదు. ఒంటేలు, గోడ మీద పడి, వంకరలు తిరుగుతూ, నేల మీద వెళ్తోంది.
సడన్ గా ఆ పిల్లవాడి కళ్ళు ఎర్రబారాయి. ఇతని వెనుక దూరం లో ఉన్న ఆ శిల, గాలిలో కొంచెం ఎత్తులో ఎగురుతున్నట్టు నిలబడి ఉంది. సరిగ్గా ప్రకాశిస్తున్న చంద్రుడు, అటు వైపు కనిపించాడు. ఆ శిల నించి కరెంటు లాగా వస్తోంది, నేల మీదకి. సరిగ్గా ఆ కింద నించే వెళ్తోంది, ఇతని ఒంటేలు.
మారు మాట్లాడకుండా అతడు, జిప్ క్లోజ్ చేసుకుని ఇంట్లోకి దూరాడు. చిన్న నవ్వు కనిపిస్తోంది అతని మొహంలో.
-- 2 --
తెల్లవారింది, ఈ రోజు దశమి, విజయ దశమి, దసరా రోజు. ఈ వూరి వారికి చాలా special ఈ రోజు. ఊళ్ళో సగం మంది ఎవరితోనూ మాట్లాడటం లేదు అట.వాళ్ళందరూ secret గా ఏదో చేస్తున్నారని, కొంతమంది అనుకుంటున్నారు, ఛలోక్తి గా. అయితే వాళ్ళ కళ్ళు ఎర్రబడటం, ఎవరూ గమనించ లేదు అనుకుంటా.
మెల్లగా సాయం సమయం అవుతోంది, ప్రపంచం నిద్ర పోవటానికి సిద్ధం అవుతోంది. ఆ పల్లెలో ఇంకా తెల్లవారినట్లే ఉంది. అందరూ, లేచే ఉన్నారు. అక్కడక్కడా మీటింగులు జరుగుతున్నాయి. వాటిల్లో, కర్రలతో ఎలా కొట్టుకోవాలో ఆలోచిస్తున్నారు. అవును మరి, ఇది దేవరకొండ. ప్రతి సంవత్సరం ఇక్కడ, విజయ దశమి నాడు, ఈ వూరి వాళ్ళు పక్క వూరి జనాలు కర్రలతో కొట్టుకునే ప్రదేశం ఇది.
-- 3 --
అప్పుడు సమయం రాత్రి ఒంటి గంట. అంబులెన్సుల మోతతో ఆ ప్రదేశం మార్మోగి పోతోంది. బుర్రలు పగిలి రక్తాలతో ఉన్నారు, ఆ పక్క ఊరి వాళ్ళు. దేవర కొండ జనాలు, పక్క ఊరి వారిని చితక కొట్టారట. చిన్న పిల్లలూ, పెద్దలూ అందరూ పాల్గోన్నారు, దేవరకొండ తరపున. ఇది విచిత్రమే అయినా ఒక్క పిల్ల వాడికి కూడా దెబ్బలు తగలలేదు, విచిత్రం గా.
పోలీసులు గన్ లతో ఉన్నారు. దేవర కొండ వాళ్ళు అందరినీ, పట్టుకుని, జీపుల్లో ఎక్కిస్తున్నారు. అందరూ స్వచ్చందం గానే ఎక్కుతున్నారు జీపులు. ఈ రాత్రికి, దగ్గరలోని ఒక ఊళ్ళో పోలీసు స్టేషన్ లో పెట్టారు, రేపు పొద్దున్న కర్నూలుకి తరలిస్తారట.
కొంత సేపటికి, అక్కడ చెవిలో నులుముకుంటూ ఒక పోలీసు వచ్చాడు, అతడిని చూసి అందరూ సాల్యూట్ చేస్తున్నారు. కళ్ళతోనే పుచ్చుకుంటూ, నడుస్తున్నాడు అతను. మూడు షర్టు బటన్ల ని తీసేసి, గుట్కా నములుతూ, చాలా రఫ్ గా ఉన్నాడు. వీళ్ళందరినీ చూస్తూ, పనులని చూస్తున్నాడు అతను.
ఎందుకో నవ్వుతూ జీపు ఎక్కుతున్నఒకడి కాలరు పట్టుకున్నాడు పోలీసు. వాడికి ఎడా పెడా రెండు ఇచ్చాడు, అయినా వాడు నవ్వు ఆపలేదు. ఈ సారి మూతి మీద ఇచ్చాడు, అయినా ఆపలేదు వాడు. "పిచ్చేమో సార్ " వెనకాల కానిస్టేబులు అన్నాడు.
పోలీసు: (నోట్లో రక్తం కారుతున్న వాడిని చూసి) లేదు లేదు, ఉత్త acting. నాలుగు తగిలిస్తే వెంటనే కక్కుతారు నిజం. (హాండ్స్ ఫోల్డు చేసుకుంటూ అన్నాడు).
వాడు మాత్రం, జీపెక్కి నవ్వుతూనే కూర్చున్నాడు. వాడి పళ్ళు, రక్తం తో నిండి ఉన్నాయి, వికృతం గా కనిపిస్తున్నాయి.
-- 4 --
మర్నాడు పొద్దున్న, 3 మినీ బస్సులలో వచ్చారు అక్కడికి. రఘుపతి, CID inspector, ఆన్ స్పెషల్ డ్యూటి, అక్కడికి రావడం జరిగింది. వస్తూనే, మన ఇన్స్పెక్టర్ తో,
రఘు: నాకన్ని డీటైల్స్ కావాలి. అసలీ సంఘటన ఎలా జరిగిందో, ఎవరికీ ఎలా నష్టం జరిగిందో అన్నీ కావాలి. ఇంకోటి, ఆ వూళ్ళో, పేరు ఏమిటి అన్నావు ...
Inspector: దేవర కొండ సార్! (నోట్లో కిళ్ళీ నములుతూ, చేతులు దండ కట్టుకుని అన్నాడు).
రఘు: ఆ కిళ్ళీ ఏమిటి అసహ్యంగా, ఉమ్మేయ్! (కళ్ళు చిట్లించి అన్నాడు. వెంటనే ఉమ్మేశాడు inspector).
రఘు: (మళ్ళీ తనే ...) అదే దేవరకొండ. ఆ వూళ్ళో ఇంత క్రితం ఇలాంటి వేమైనా జరిగాయా, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి వన్నె నాకు కావాలి.
రఘు: (కొంచెం సేపు తర్వాత ...) ఆ, ఒక్కటి మరిచిపోయాను. ఇక్కడ, ఒక మంచి డాక్టరు ఎవరు ఉన్నారు.
Inspector: ఇక్కడంటే కష్టం సార్, కర్నూలు పోవాలి అంతే! (చేతులు కట్టుకుని చెప్పాడు).
(సశేషం ...)

No comments:
Post a Comment