Tuesday, January 17, 2012

అర్జునుడు - VI

అది ఫిలిప్పీన్స్ లోని మనిలా లో Military district. ఒక పెద్ద భవంతిలో, మిలిటరీ దుస్తుల్లో కొంతమంది. వాళ్ళంతా ఒక meeting hall లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక presentation జరుగుతోంది. Presentation ఇస్తున్నది, ఫిలిప్పీన్స్ King's Scientific advisor, భారతీయ సంతతి కి చెందిన Dr. రఘునాథ్. 

రఘునాథ్: Gentlemen! I will make it brief. (బటన్ నొక్కాడు, తెర మీద ఒక ద్వీపం యొక్క aerial view కనిపిస్తోంది). ఈ ద్వీపం మన దేశానికి 100 మైళ్ళ దూరం లో ఉంది. ఇంత కాలం ఎందుకో మన satellite images లో ఇది కనిపించలేదు. ఇప్పుడు కనిపించిన data ప్రకారం దీన్లో చాలా విలువైన ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. దీన్ని సొంతం చేసుకోవడం వల్ల, మన దేశానికి ఆర్ధికం గా బలం చేకూరుతుంది. 

రఘునాథ్: (తనే మళ్ళీ కంటిన్యూ చేసాడు). మనకు తెలిసిన సమాచారం బట్టి, ఈ దీవి ఇంకా ఆటవికుల చేతిలో ఉంది. వాళ్లకి సముద్రం మీద ప్రయాణించడం, ఇంకా తెలియదు. వాళ్ళ technology కూడా మన ముందు నిలబడదు (Slides change చేసాడు). వాళ్ళని గాని, వాళ్ళ రాజుని గాని ఏదో మాయ మాటలు చెప్పి convince చెయ్యచ్చు. (ఏదో పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు). ఒక వేళ మనల్ని రానివ్వకపొతే, వాళ్ళ దీవిని వశపరచుకోవడం చాలా ఈజీ, ప్రపంచ దేశాల ద్రుష్టి లో పడకుండా పని కానివ్వాలి అంతే (ఈ మాటని ఫిలిప్పీన్స్ ప్రస్తుత అధ్యక్షుడి కేసి చూస్తూ అన్నాడు రఘునాథ్).

మీటింగ్ చాలా success అయ్యింది. అందరూ ఆ దీవిని నయానో, భయానో ఫిలిప్పీన్స్ లో కలిపెయ్యలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ దీవికి కొంతమంది దౌత్యవేత్తలని పంపారు, అందులో రఘునాథ్ కూడా ఉన్నాడు. వాళ్ళంతా ఆటవికులే కాబట్టి రఘునాథ్ పెద్దగా ఏమి prepare అవ్వలేదు, రాజు తో మాట్లాడటానికి.

వీళ్ళు దీవిలో అడుగుపెట్టగానే ఆటవికులు వీళ్ళని బంధించారు. రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఎత్తైన సింహాసనం లో కూర్చున్న అర్జున్ ని చూసి కొంచెం disappoint అయ్యాడు రఘునాథ్. అర్జున్ చెప్పిన మీద, వీళ్ళ చేతుల కట్లు విప్పారు ఆటవికులు.

రఘునాథ్: హలో, నా పేరు రఘునాథ్! (చెయ్యి ముందుకి చాపాడు). (ఇది చూసిన ఆటవికులు, attack చేస్తున్నాడనుకుని బల్లేలతో ముందుకి వచ్చారు. వారిని వారించి అర్జున్ సింహాసనం దిగి కిందకి వచ్చాడు).

Shake-hand అయ్యాక, రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: మీ దీవిలో, మంచి వన మూలికలు ఉన్నాయని మాకు తెలిసింది, వాటిని ... ఇక్కడ నించి ... తవ్వి తీసుకునేందుకు మా ప్రభుత్వం ... నన్ను ఇక్కడికి ... పంపించింది (పూర్తి చేసాడు).

అతను మాట్లాడుతున్నంతసేపు, అర్జున్ అతని మొహం కేసి చూడలేదు. అతని వేషాన్ని, మిలిటరీ డ్రెస్ ని కింద నించి పై దాకా చూస్తున్నాడు. అలా చూస్తున్న అర్జున్ కి అతని identity card కనిపించింది.

అర్జున్: రఘునాథ్! (కార్డు లో పేరు చదువుతూ). ఇండియన్నా? (అడిగాడు, కొద్దిగా నవ్వుతూ)

రఘునాథ్: I am from Philippines! నేను పుట్టింది ఇండియాలో, కాని ఇప్పుడు ఉన్నది మటుకూ ఫిలిప్పీన్స్, I am a citizen of Philippines, not an Indian. (ఎలాగో పూర్తి చేసాడు రఘునాథ్. పూర్తి కాగానే, జేబు లోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. కొంచెం tension గా ఉంది అతనికి. ఎవడో ఆటవికుడు ఉంటాడనుకుంటే, ఒక నాగరికుడు రాజుగా ఉండటం, తనని అన్ని ప్రశ్నలు వెయ్యడం, పైగా తను చెప్పింది వినకుండా, అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది).

అర్జున్ మొహం లోని చిరునవ్వు మాయం అయ్యింది.

అర్జున్: (ID కార్డు ని వదిలేస్తూ) ఏ మూలికలు?
రఘునాథ్: ఆ ...!
అర్జున్: అదే, ఏమి వన మూలికలు అని?
రఘునాథ్: మూలికలంటే, చాలా ఉన్నాయి, many of them are here! ప్రపంచానికి కావలసిన ఎన్నో మంచి మూలికలు ఇక్కడే ఈ ద్వీపం లోనే ఉన్నాయి. అందుకే మేము ఇక్కడికి (ఇంకా చెప్తూ పోతున్నాడు, మధ్యలో అర్జున్)

అర్జున్: నన్ను చెప్పమంటారా? ఈ దీవిలో ఏ పెట్రోలో, డయమండ్సో, బంగారమో మీకు కనిపించాయి, అందుకే ఇక్కడ అవన్నీ తవ్వి తీసుకుపోవడానికి ఇక్కడకి వచ్చారు. (రఘునాథ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు).

రఘునాథ్ తో ఇవి చెప్పడానికి ముందు రాజగురువు కేసి ఒక సారి చూసాడు అర్జున్. అతడు అనుమానం గా వద్దన్నట్టు తలాడించడంతో, తన మనసులోమాట బయటికి చెప్పాడు.

రఘునాథ్ ఇంకేమి మాట్లాడలేకపోయాడు. తిరిగి అర్జున్,

అర్జున్: (రఘునాథ్ కేసి తిరిగి) చూడండి, ఇక్కడి ప్రజలు ప్రకృతి ని తల్లి గా భావిస్తారు. ఆ తల్లిని ఏదో లోహాల కోసమో, ఖనిజాల కోసమో తవ్వడం వీళ్ళ దృష్టి లో మాతృ హత్య. వీళ్ళకి రాజు గా నేను చెప్పేది ఒకటే, ఈ విషయం వీళ్ళల్లో ఎవరికీ తెలియక ముందే ... వెళ్ళిపొండి! ఇంకొక్క క్షణం ఉంటె, నేనే ఏమి చేస్తానో తెలియదు. (కోపంగా రఘునాథ్ కేసి చూసాడు అర్జున్).

రఘునాథ్, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫిలిప్పీన్స్ తమ మీదకి యుద్ధానికి వస్తుందని, అందరికీ తెలుసు. ఇవాళో రేపో, ఆ ఆధునిక మారణాయుధాలతో తాము ఎలా పోరాడతామో, అర్జున్ కి తెలియడం లేదు.

-- 2 --
అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. దశాణి  ... నవాణి ... (సంస్కృతం లో అనుకుంటా, countdown జరుగుతోంది) ...  షష్టీహి ... ... శూన్యం 

వెంటనే తెల్లటి వెలుగు కళ్ళముందు కనిపించింది. భయంకరమైన ధ్వని, కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగు కనిపించాయి అతనికి. ఆ తెల్లటి వెలుగు మెల్లగా దుమ్ము తెరగా మారింది. ఆ దుమ్ము లోనించి వస్తున్నాయి రెండు రదాశ్వాలు. రధం పైన నించుని చూస్తున్నాడు, ఒక ఆజానుబాహుడు. చూస్తే అచ్చు అర్జున్ లాగానే ఉన్నాడు. రాజరికపు దుస్తులలో ఉన్న అతని మొహం తేజోవంతం గా ఉంది. స్ఫురద్రూపి ఐన అతని కళ్ళలో మాత్రం ఒక సన్నటి కన్నీటి తెర.

రధం అతి వేగం గా పయనిస్తోంది. రధం వెళ్తున్న ప్రదేశం పేరు గాండీవ క్షేత్రం. అది పాండవుల తాలూకు అమ్ముల పొది, శస్త్రాలను భద్రపరిచే చోటు. మోడరన్ భాషలో చెప్పాలంటే "Missile Silo". పాండవుల తాలూకు అస్త్రాలైన "పాశుపతం", "వారుణాస్త్రం", "బ్రహ్మాస్త్రాదులు" అక్కడ భద్రపరచబడి ఉంటాయి. దారికి ఇరు వైపులా ఉన్న సైనికులు అతనికి వందనం చేస్తున్నారు.

రథం ఒక సువిశాలమైన భవంతి ముందు ఆగింది. ఈ నాటి Military style లో ఎత్తైన గోడలు, ఒక ఇనుము తో చేసిన మందమైన ఎత్తైన ద్వారం ఉన్నాయ్ ఆ భవనం చుట్టూ. రథం దిగి రాకుమారుడు ఒంటరిగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఏదో Identification/Password అడిగింది ఆ ద్వారం సంస్కృతం లో, ఇతను చెప్పాడు. ద్వారం పైకి లేచింది, లోపలికి వెళ్ళాడు, అతని వెంట ఒక నలుగురు సైనికులు మాత్రమే లోపలికి వెళ్ళారు. అతని రాకని, కొన్ని పెద్ద పెద్ద చిలకలు ఆటోమాటిక్ గా చెప్తూ ఆ భవనం లోపలి దారులలోనికి వెళ్ళాయి. చిలుకలు చెప్తున్నవి గాని, ద్వారం వద్ద identification అతడు ఏమి చెప్పాడో, అర్జున్ కి తెలియడం లేదు.

రాజు వేషంలో ఉన్న అర్జున్ దగ్గరికి రాగానే అన్ని తలుపులూ వాటంతట అవే తెరుచుకోసాగాయి (face recognition అనుకోవచ్చు). సంస్కృతం లో అవి అతనికి సైనిక వందనం చెప్పడం కూడా మొదలు పెట్టాయి. అర్జున్ ఒక A/C chamber లోనికి ప్రవేశించాడు. అతని వెనుక వచ్చిన సైనికులు ద్వారం దగ్గరే ఆగిపోయారు. ఆ A/C chamber లో temperature maintain చేస్తున్నవి పువ్వులు. ఒక గోడ అంటా creepers లాగ పెరిగిన కొన్ని పెద్ద పూల మొక్కలు, వేడి ని control చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఒకొక పువ్వు అందులోంచి రాలి పోతోంది కూడా.

అక్కడ అనేకమైన Computer లు, ఆ chamber కి సంబంధించిన temperature etc... వివరాలు సంస్కృతం లో చెప్తున్నాయి. ఒక పక్కగా ఐదుగురు ఋషులు (తెల్లటి dress ల్లో, పెద్ద గెడ్డాలతో) ఉన్నారు. Chamber మధ్యలో ఉన్న అర్జున్ దగ్గరికి వాళ్ళల్లో ఒక ముని వచ్చాడు. వణుకుతున్న చేతులతో, అతనొక Glass box (గాజు పెట్టి), అర్జున్ కి అందించాడు. అది అందుకొంటూ ఆ ముని కేసి చూసాడు అర్జున్. ఆ ముని కళ్ళు దించుకొన్నాడు. ఆ ముని తిరిగి తన స్థానానికి వెళ్ళాడు.

తర్వాత ఆ రాకుమారుడు ఆ గది లోనే ఉన్న ఒక Glass Chamber లోనికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఆ chamber తలుపులు మూసుకున్నాయి. అతని ఎదురుగా ఉన్న పెద్ద buttons panel లో ఏవో buttons నొక్కాడు. తర్వాత బ్రహ్మ దేవుడు తనకు ఇచ్చిన మంత్రాన్ని password గా enter చేసాడు. ఆ తరువాత గాజు పెట్టె లోని crystal ని తీసి panel లోనికి key లాగ పెట్టాడు. Count down సంస్కృతం లో start అయ్యింది. ఎందుకో తెలీదు అతని కళ్ళల్లో నీళ్ళు, అర్జున్ కి తానె ఏడుస్తున్నట్టు అనిపించింది. ఒక వీరుడికి ఉండవలసిన గర్వం అతని కళ్ళల్లో ఇప్పుడు మాయమయ్యింది.

Countdown start అయ్యింది, శూన్యం (Zero) అంటూనే, అర్జున్ కి మెలకువ వచ్చింది. నిద్ర లేచిన అర్జున్ కళ్ళలో నీళ్ళు, ఎందుకు వచ్చాయో తనకి తెలియడం లేదు.

తెలతెల వారుతున్న ఆ సమయం లో, కోట దిగి కిందకి వచ్చాడు అర్జున్. అక్కడే చలిమంట చుట్టూ, కొంతమంది వీరులతో కూర్చున్నాడు రాజ గురువు. తన వైపే చూస్తున్న రాజ గురువు పక్కగా కూర్చున్నాడు అర్జున్. అర్జున్ కేసి మెరుపు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు రాజ గురువు.

రాజ గురువు: భారతం చెప్పుకుంటున్నాము, వింటావా అర్జునా! (ఎంతో ప్రేమగా అడిగాడు రాజ గురువు. అర్జున్ తల ఊపాడు). మనుషుల బుర్రలపైన యుద్ధమనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చరిత్ర ఎన్ని చెప్పినా, ఎంత వీరత్వాన్ని ప్రబోధించినా యుద్ధం చేసిన ప్రతి వీరునికి అంతః కరణ లో ఏదో ఒక బాధ, తప్పు చేసిన భావన ఇంచుమించు తప్పదు.

సాదివూ: (ఈ మధ్యలో తన సందేహాన్ని వెల్లడించాడు సాదివూ) మంచి కి చెడు కి మధ్య జరిగే యుద్ధానికైనా రెండువైపులా నష్టాలు తప్పవు. చెడ్డ వాని వైపు కూడా మంచి వాడు ఉంటాడు, అలాంటప్పుడు యుద్ధం ఎలా చెయ్యడం?

రాజ గురువు: నిజమే, భారతం లో శల్యుడు చావలేదా? ఎం, శల్య సారధ్యం వల్లనే కదా, కర్ణుడి ఆత్మ విశ్వాసం క్షీణించింది? భీష్ముడు, ద్రోణుడు, కొంతవరకు కర్ణుడు చెడ్డవాళ్ళంటే నమ్మడం కష్టం. ఒక మంచి కోసమని ఇంతమందిని చంపడానికి, ఇంత చెడు చెయ్యడానికి మనిషన్న వాడికి బాధే కదా? (రాజ గురువు చెప్పుకు పోతున్నాడు). అయితే శ్రీ కృష్ణుడు ఏమి బోధించాడు? మనుషులం, మనమెవరం? మంచి చెడ్డలు ఎంచడానికి మనమెవరం, అంతా ఆ పరమాత్ముడే చూస్తాడు, మన పని అల్లా దేవుడు మనకిచ్చిన గమ్యాన్ని చేరుకోవడమే! (అర్జున్ కేసి తిరిగి నవ్వుతూ అన్నాడు).

అర్జున్ కళ్ళలో ఎందుకో నీళ్ళు, అతనికి అర్ధం కావడం లేదు, బాధ ఎక్కడినించి వస్తోందో? అలాగని యుద్ధం అంటే భయం లేదు అతనికి, జరగబోయేది తలచుకుంటే, అందరి ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేద్దాం అనిపిస్తోంది, కాని పని జరగదే?

తెల్లవారుతూండగానే, గస్తీ కి కూర్చున్న సాదివూ తదితర వీరులు వెళ్ళిపోయారు. తనకి వచ్చిన కల గురించి చెప్దామనుకున్నాడు అర్జున్. అతని కేసి తిరిగి, నవ్వుతూ తను ఇందాక చెప్తున్నది continue చేస్తున్నట్టుగా అన్నాడు రాజ గురువు.

రాజ గురువు: (అర్జున్ భుజం మీద చెయ్యి వేసి) సత్యానికి ధర్మానికి నిలబడే ధర్మరాజు అంతటి వాడే "అశ్వద్ధామ హతః, (కుంజరః)" అని అబద్ధం చెప్పాడు. ఇంద్రుడు, అర్జునుడి తండ్రి (చిన్నగా నవ్వుతూ...) కర్ణుడి వద్ద, మాయోపాయం తో యాచించవలసి వచ్చింది. మంచి యందు నమ్మకం తో బ్రతికేది మనుషులే, వాళ్ళనే ఈ యుద్ధాలు బాధిస్తాయి. దేవుడైన శ్రీ కృష్ణుడు, తత్వాన్ని చెప్పాడు కాని, మనుషుల బాధను నివారించలేడు గా?!
(కళ్ళు మూసుకుని కృష్ణుడికి నమస్కరించాడు రాజ గురువు).

రాజ గురువు: (కొంత సేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి..., మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న అర్జున్ కేసి క్రీగంట చూసి, గమనించి) నువ్వు ప్రయోగించినది బ్రహ్మశిరో నామకాస్త్రం, నాలుగు బ్రహ్మాస్త్రాల పెట్టు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చోట, అప్పటి జన నష్టం మాత్రమె కాకుండా, ఎన్నో దీర్ఘ కాలిక ప్రభావాలు ఉంటాయని, ముఖ్యంగా అక్కడ కొంత కాలం వరకు పంటలు పండవని, భూమి నిస్సారమౌతుందని, పిల్లలు పుట్టరని, పుట్టిన వాళ్ళు వికారంగా పుడతారని చెబుతారు.

అర్జున్ కి ముందు పూర్తిగా అర్ధం కాలేదు, ఆతర్వాత తన కల గురించే చెప్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాజ గురువు, అదేమీ పట్టించుకోకుండా చెప్తున్నాడు.

రాజ గురువు: ప్రస్తుతం ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అటువంటి నాలుగు బ్రహ్మాస్త్రాలని తీసుకు వెళుతోంది. కౌరవుల ఆధీనం లో ఉన్న నాలుగు చిట్టచివరి నగరాల పైకి ఆ అస్త్రాలని సంధించారు పాండవులు. అవే గనుక ఆ నగరాల మీద పడితే, కౌరవులతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా భయంకరంగా చస్తారు. అన్ని తెలిసి, అన్న గారు యుధిష్ఠిరుని ఆజ్ఞ మీద, ఈ పని చెయ్యక తప్పలేదు నీకు. ఐతే, ఇదే సమయంలో దుర్యోధనుడి ప్రోద్బలం మీద, అశ్వత్థామ అదే అస్త్రాన్ని తమపై సందిస్తున్నాడని తెలియదు పాండవులకి.

రాజ గురువు: నిజానికి కౌరవులు ఈ అస్త్రాన్ని ముందే ప్రయోగించారు. ఈ రెండు అస్త్రాలని ప్రయోగించినట్టు దివ్య దృష్టి (prediction technology అనుకోవచ్చు, మన భాషలో) ద్వారా తెలుసుకొన్న వశిష్టుడు, ఇద్దరికీ ఆ అస్త్రాలని ఆపమని వర్తమానం పంపించాడు.

అది విన్నాక నీవు వెంటనే, ఆ నాలుగు అస్త్రాలని ఉపసంహరింపచేసావు. ఐతే, తన గర్వం కోసం సమస్త ప్రపంచాన్ని నిర్లక్ష్యం చెయ్యగల సుయోధనుడు మాత్రం, అంత త్వరగా ఇది పడనివ్వలేదు. అశ్వత్థామ చేత మూడే ఉపసంహరింప చేయించాడు అతడు. నాలుగో అస్త్రాన్ని మటుకు, బభ్రువాహనుడు ఉన్న కన్యాకుబ్జం వైపు సంధించాడు మానధనుడు, దుర్యోధనుడు. అతనికి తన చావు సమీపించిందని తెలుస్తూనే ఉంది, కాని పాండవుల వంశోద్దారకుని హత్య చెయ్యదలిచాడతడు. అందుకే నీ కుమారుడు అభిమన్యుని విధవ (Widow), ఉత్తర, కడుపులో పెరుగుతున్న భ్రూణాన్ని చంపదలిచాడతడు. అతనే ప్రస్తుత పాండవ వారసుడు కాబట్టి, ఆ పసి కందుని చంపడం ద్వారా పాండవ వంశాన్ని చెయ్యగలిగినంత మట్టు పెట్టాలన్నదే అతని ధ్యేయ౦. ప్రస్తుతం, నెలలు నిండిన ఉత్తర తన బావగారైన బభ్రువాహనుని సంరక్షణలో ఉంది. సరిగ్గా ఆమె ఉన్న కన్యాకుబ్జం వైపు వెళ్తోందా అస్త్రం.

ఏదో తెలిసినట్టు, తెలియనట్టు అనిపిస్తోంది అర్జున్ కి. చూసినట్టుగా అనిపిస్తోంది, కాని పూర్తిగా గుర్తుకిరావడం లేదు. నమ్మాలనే ఉంది, కాని నమ్మబుద్ది వెయ్యడం లేదతనికి. చెప్పింది సగం విని సగం వదిలేసానా అనిపించింది అతనికి, కాని మొత్తం అంతా ఏదో చూసినట్టు, గుర్తుగా ఉంది. ఆ సందిగ్ధం లో ఎలాగో అక్కడినించి కదిలాడు అతను.

-- (సశేషం) --

No comments:

Post a Comment