Wednesday, October 19, 2011

అర్జునుడు III

    అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. భయంకరమైన వాన, ఉరుములు, పిడుగులు. ఆ వానలో దట్టమైన అరణ్యం గుండా వెళ్తున్న ఒక మెరుపు, నేల మీద మెరుపా అనిపించే ఒక రధం అది. అందులో ఒక రాజు లాంటి వ్యక్తి, ఇంకొక నెలలు నిండిన వనిత. అర్జున్ కి తన గుండె తీవ్రం గా కొట్టుకోవడం తెలుస్తోంది. Anxiety చాలా ఎక్కువగా వస్తోంది, తనకి ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది, తీవ్రంగా రొప్పుతున్నాడు ఊపిరి తీసుకున్న ప్రతి సారి, ప్రతి సారికి ఇంకా ఎక్కువగా రోప్పవలసి వస్తోంది అతనికి. ఇంతలో, ఒక భయంకరమైన వెలుగు, ఆ వెలుగు రధం లోని వారిని కమ్మేయడం, చివరికి తెల్లటి వెలుగు తప్ప ఏమి కనిపించకపోవడం, అతనికి అనుభవం అయ్యింది. ఆ వెలుగు చూస్తే కళ్ళు పోతాయేమో అనిపిస్తోంది. అర్జున్ కి శ్వాస తీసుకోవడం ఇంచుమించు కష్టంగా ఉంది.

    అర్జున్ నిద్ర లోంచి లేచాడు. ఆనుకుని శైలజ పడుకుని ఉంది. ఏంటో flight అంతా గందరగోళం గా ఉంది. అప్పుడే మైకు లోంచి announcement వస్తోంది. 
మైకు: Your attention please! మన ఫ్లైటు ప్రస్తుతం rough weather లో ప్రయాణిస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు ఇంకో పది నించి ఇరవై నిముషాలు ఉండవచ్చు, కావున ఎవరి సీట్లలో వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోవలసిందిగా ప్రార్ధన. 

ఈ కోలాహలం లో శైలజ కూడా లేచింది. కొద్దిగా ఒళ్ళు విరుచుకుంటూ announcement వస్తున్న స్పీకర్ కేసి చూసింది. కొంచం సేపటికి కాని ఈ ఫ్లైట్ పరిస్థితి వీళ్ళకి అర్ధం కాలేదు. నిజమే, ఫ్లైట్ చాలా rough weather లోంచి ప్రయాణిస్తోంది. చాలా పెద్ద వాన, బహుసా tropical hurricane అయ్యుంటుంది, బయట కురుస్తోంది. అప్పుడప్పుడు మెరుపులు, భయంకరమైన పిడుగులు కనిపిస్తున్నాయి. విమానం ఎలాగైనా దీన్నించి బయట పడితే చాలని అనుకుంది శైలజ. 

అర్జున్ కి కూడా అలానే ఉంది. ఇంతే మొదటి సారి, అలా అనుకో బుద్ది వెయ్యలేదు అతనికి. ఎందుకో తెలీదు, దేవుడిని ప్రార్ధించడం ఎందుకనిపించింది. ఇంతలోనే అనుకున్నాడు, దేవుడిని ప్రార్ధించకపొతే ఎలా? మెడలోని locket చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. 

Flight వాడు ఇరవై నిమిషాల్లో పోతుందన్నాడు, అర గంట పైనే అయ్యింది. ఇంకా ఆ తుఫాను లోనే ఉన్నారు ఫ్లైట్ తో సహా అందరూ. ఇప్పుడు ఫ్లయ్ టు లో వాళ్లందరికి అలవాటై పోయింది. ఇంచుమించుగా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఊరికే దేవుడికి కళ్ళు మూసుకుని దణ్ణాలు పెట్టుకుంటోంది శైలజ. అర్జున్ మాత్రం మౌనం గా కిటికీ లోంచి బయటకి చూస్తూనే ఉన్నాడు. ఒక సారి తిరిగి watch time చూసుకున్నాడు అర్జున్. 

ఉన్నట్టుండి ఒక మెరుపు మెరిసింది. ఏదో కరంటు లాంటింది ఫ్లైట్ కి తగలడం తో ఫ్లైట్ ఒక్క సారిగా బాగా shake అయ్యింది. కళ్ళుమూసుకుని ప్రార్ధిస్తున్న శైలజ, ఆ కుదుపుకి "ఆహ్!" అంటూ కళ్ళు తెరిచింది. అర్జున్, తల పైకెత్తి ఒక్క సారి బయటకి చూసాడు. చాలా మంది తమ సీట్ల్లల్లోంచి లేచి, కుడి వైపు కూర్చున్న వాళ్ళు, కిటికీ లోంచి బయటకి చూద్దామని వాలారు. కుడి వైపు propeller తిరగడం మానేసింది. మెల్లగా అది flight light ల వెలుగులో slow అయిపోవడం కనిపిస్తోంది. అసలే అందరూ కుడి వైపుకి చేరిపోవడం, ఇంకా propeller ఆగి పోవడంతో ఫ్లైట్ అంతా కుడి వైపుకు వాలిపోయింది.

ఫ్లైట్ లో చాలా మంది హాహాకారాలు, ఏడుపులు మొదలెట్టారు. చాలా మంది ఏడుస్తున్నారు. అర్జున్ కి ఎందుకో ఏడవాలనిపించడం లేదు. మరీ పెద్ద incident ఏమి జరగడం లేదన్నట్టు శైలజ వైపు చూసాడు. తను కళ్ళు గట్టిగా మూసుకుని దేవుడిని ప్రార్ధిస్తోంది. దణ్ణం పెట్టిన రెండు చేతుల్లోంచి ఒక చెయ్యి తీసి తనకి తానే విసినికర్ర విసిరినట్టు విసురుకోవడం మొదలెట్టింది. అర్జున్ మరొక్కసారి కిటికీ లోంచి బయటకి చూసాడు. అతనూ ఏమి చెయ్యాలో తెలీక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. 

అందరికీ తెలుస్తూనే ఉంది, ఈ పరిస్థితుల్లో flight ఎక్కువ సేపు వెళ్ళలేదు అని. అందరూ ప్రాణాలు చిక్కబట్టుకుని silent గా కూర్చున్నారు. Flight లో స్మశాన నిశ్శబ్దం అలముకొని ఉంది. అర్జున్, ఇప్పుడు భయం వెయ్యడం తో శైలజ చెయ్యి పట్టుకున్నాడు. విసురుకుంటున్న చెయ్యి తను పట్టుకోవడం తో, ఏడుపు మొదలెట్టింది శైలజ. అయినా తను ఎక్కువ ఏడిస్తే అర్జున్ ఎక్కడ భయపడతాడోనని ఏడుపు మానేసి౦ది. ఇద్దరూ ఒకళ్ళ చేతిలో ఇంకొకరు చెయ్యి వేసుకున్నారు. ఆమె అలా చెయ్యడం చూసి, అర్జున్ కళ్ళు తెరిచాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూసుకున్నారు.

మైకు లో ఏదో announcement వచ్చింది. 

మైకు: Your attention please! Due to the present circumstances, we have to crash land our flight. Please brace yourselves. Put on the seat belts, and wear your life jackets. Our crew will assist you, we might mostly land somewhere in the Pacific Ocean, (మైకు కట్ అయ్యినట్టుగా బీప్ బీప్ మని సౌండ్స్ వస్తున్నాయి).

అందరూ ఏవేవో reactions చూపిస్తున్నారు. అర్జున్, శైలజ మటుకూ ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూస్తూనే ఉన్నారు. ఏదో జరుగుతున్నట్టు, ఏదో మైకు లో చెప్పినట్టు వాళ్లకి తెలుస్తూనే ఉంది. ఏమవుతుందో వాళ్లకి sixth sense ఎప్పుడో చెప్పినట్టుగా, ఇవేమీ వినకుండా అలానే ఉన్నారు. వాళ్ళ చుట్టూ చాలా గందరగోళం గా ఉంది. పసిఫిక్ మహా సముద్రం లోనికి విమానం descent స్టార్ట్ చేసింది. దాన్ని descent అనడం కన్నా free-fall అనడం బెటర్.

సరిగ్గా అప్పుడే ఎడమవైపు propeller load ఎక్కువ అవ్వడంతో, cut అయ్యిపోయింది. స్పీడ్ గా తిరుగుతూ వచ్చిన ఆ propeller విమానాన్ని రెండు ముక్కలు చేసింది. ఆ propeller కట్ చేసిన ప్రాంతాల్లోని వాళ్ళంతా హృదయ విదారకం గా చనిపోయారు. సరిగ్గా అప్పుడే విమానం లో మంటలు మొదలయ్యాయి. రెండు అగ్నిగోళాలు ప్రశాంతత ఆవరించిన ఆ సముద్రం లో ఎక్కడో ఒక చోట, పడిపోవడం మొదలెట్టాయి. మంటలు క్రమం గా రెండు parts లోను, propeller కట్ చేసిన ప్రాంతం నించి వ్యాపించడం మొదలెట్టాయి. చేతిలో చెయ్యేసుకుని, ఒకరి వైపు ఒకరు తిరిగి, closed eyes తో, ఆ యువ జంట పసిఫిక్ మహా సముద్రం లోనికి పడిపోయింది. 

అర్జున్ కళ్ళు తెరిచాడు. తామున్న విమానం పార్టు కొంచెం నీళ్ళలో తేలుతోంది. చుట్టూ ముసిరిన లావుపాటి ఈగలు (tropical). చుట్టూరా మృతదేహాలు, కాలిపోయినవి కొన్ని, నీటిలో నానినవి కొన్ని. చాలా భయంకరం గా ఉంది అక్కడ. ఈ లోపల శైలజ కూడా కళ్ళు తెరిచింది. మగత గా, 

శైలజ: ఎ ... ఎ ... ఎక్కడున్నాం? ఏం జరిగింది? (శైలజ కి మొదట నిన్న రాత్రిది గుర్తుకు రాలేదు. చుట్టూ ఉన్నదంతా చూసి, గుర్తుకు తెచ్చుకుంది. అప్పటికే time మధ్యాన్నం అయ్యినట్టుంది, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు)

ఇదేమి పట్టించుకోనట్టు అర్జున్, ఆమె చెయ్యిని పక్కకి తీసి, తానున్న part లోకి ముందుకి వెళ్ళాడు. ఏదో వెతుకుతున్నట్టు వెళ్ళిన అర్జున్, కొంచెం దూరం వెళ్ళాక వాంతి చేసుకున్నాడు. కొంచెం సేపు తరువాత, ఒక yellow color లోని bags తో వచ్చాడు అతను. ఒక సెట్ శైలజకిచ్చి,

అర్జున్: ఊదు! (చెప్పాడు).

ఇద్దరూ చాలా సేపు ఊది, రెండు లైఫ్ జాకెట్స్, ఒక yellow color life-boat తయారు చేసారు. లైఫ్ జాకెట్స్ వేసుకుని, లైఫ్ బోటు మోసుకుంటూ, నీళ్ళలోకి ఓపెన్ అయ్యిన flight area లోకి వచ్చారు. Boat ని నీళ్ళలో వేసాడు అర్జున్, అది నీటి మీద తేలింది. అర్జున్ మొదట అందులోకి ఎలాగో దిగాడు. తరువాత చెయ్యి పట్టుకొని శైలజ ని దింపాడు. అంతకు ముందే తెచ్చుకున్న తెడ్లసాయంతో, అతను ముందు కూర్చుని rowing చెయ్యడం మొదలు పెట్టాడు. 

శైలజ కూడా రెండు నిముషాలు rowing చేసింది. Flight నించి కొంత దూరం వచ్చాక ఏడుపు మొదలెట్టింది. చేతులతో ముఖం కప్పేసుకొని వెక్కుతూ ఏడుస్తోంది తను. మొదటి సారి అర్జున్ తనేమి చేస్తున్నది స్పృహ లోకి వచ్చిన సమయం అదే. ఒక సారి కళ్ళ లోంచి కారుతున్న నీళ్ళని తుడుచుకున్నాడు అర్జున్. మళ్ళీ తను చూస్తోందేమోనని వెనక్కి తిరిగి చూసాడు. తను ఏడుస్తూనే ఉంది, మొహం చేతులతో కప్పేసుకుని. కొంచెం సేపయ్యాక ఏడుపు ఆపు చేసింది శైలజ, వెక్కడం ఇంకా ఉంది కాని. 

అర్జున్: ఎం పర్లేదు, Flight లోంచి బయటకి వచ్చేసాం కదా, ఇదిగో ఈ watch చూపిస్తున్నట్టు, ఇలా ఉత్తరం వైపు వెళ్ళాం అంటే,  philippines వస్తుంది, మనం అక్కడికి వెళ్తాం, వాళ్లకి మన సంగతి చెప్తాం, India వాళ్ళం కదా, definite గా help చేస్తారు. (కొంచెం సేపాగి...), రేపు సాయంకాలానికల్లా India లో ఉంటాం (ఏదో తెలిసినట్టు చెప్పేసాడు). 

కొంచెం సేపు ఏడిచి, సొమ్మసిల్లిపోయిందో, లేదంటే అర్జున్ మాటలకి సమాదానపడిందో గాని, శైలజ నిద్రపోయింది. ఆమె నిద్రపోయాక, అర్జున్ ఇహలోకం లోకి వచ్చాడు. ఇంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం అంతా తనంతట తానె బయటకి వచ్చేసింది. తనలో తానూ ఇలా అనుకున్నాడు, 

అర్జున్: (స్వగతం) ఉత్తరం వైపు వెళ్తే philippines వస్తుందా, ఎవడు చెప్పాడు? పైగా సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నాడు, ఇప్పుడు దిక్కులు చెప్పడం కష్టం. తన watch పని చెయ్యడం ఆగిపోయి, ఇప్పటికి దాదాపుగా ఒక రోజు కావస్తోంది. చుట్టూ ఎక్కడ చూసినా అనంతంగా సముద్రం. నిస్సహాయం గా అనిపించింది అతనికి. చేతికున్న watch తీసి, నీళ్ళలోకి విసిరాడు.

అలా ఇంచుమించు గా ఒక అయిదు గంటలు rowing చేసుంటాడు అర్జున్. ఇంక అతనికి కూడా ఓపిక నశిస్తోంది. ఎక్కడా నేల కనిపించడం లేదతనికి, చెమటలు ధారాపాతం గా కారుతున్నాయి. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు, ఇక చీకటి పడితే నేల, నీళ్ళు ఏమి కనిపించదు కూడా. అతనికింక ఒళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది. Rowing ఇంచుమించి ఆపు చేసి, boat లో నడుంవాల్చి పడుకున్నాడు. కళ్ళు మూసుకోబోతున్నంతలో, అతనికి పైన ఎగురుతూ ఏవో పక్షులు కనిపించాయి. ఏదో అనుమానం వచ్చి చూసాడు, yes, తను అనుకున్నది కరక్టే, అవి కాకులు, crows, Yes!

కాకులు నేలని విడిచి నీటిలో ఎక్కువ దూరం ఎగరలేవు, అవి కనిపించాయంటే దగ్గరలో ఎక్కడో నేల ఉన్నట్టే. ఇనుమడించిన ఉత్సాహం తో rowing మొదలెట్టాడు. ఇంకో అరగంట లో, ఒక దీవి దూరం గా కనిపించింది అతనికి. అదే టై౦ కి శైలజ కూడా లేచింది. ఒడ్డుకి ఇంకా బోటు చేరకుండానే, నీళ్ళల్లోకి దిగి నడవడం మొదలెట్టింది శైలజ. ఇతను కూడా, బోటు వదిలేసి ఆమె వెనకాల నడవడం మొదలెట్టాడు.

తీరాన్ని చేరుతూనే, మోకాళ్ళపైన కూలబడ్డాడు అర్జున్. శైలజ మాత్రం ఇంకా ముందుకి వెళ్లి, అక్కడున్న చెట్లకేసి

శైలజ: Help! Somebody please Help! Help! (చేతులు ఊపుతూ గట్టి గట్టి గా అరుస్తూ, పైకి గెంతుతూ అరుస్తోంది. తనకి హెల్ప్ చెయ్యాలని ఎంత ఉన్న, లేచి నిలబడ లేక పోయాడు అర్జున్, అలాగే బోర్లా పడిపోయాడు. ఎన్నో సార్లు కళ్ళు తెరిచిన అతనికి, శైలజ అరుస్తూ ఉండడం కనిపిస్తూనే ఉంది. కొంత సేపు english, తర్వాత మళ్ళీ తెలుగు, చాలా ట్రై చేసింది తను. ఆ దట్టమైన అడవి లాంటి చెట్లలోకి కొంచెం వెళ్లి కూడా చూసింది. తను అరగంట కి పైగా అరుస్తూనే ఉండడం, తిరిగి వెనక్కి వచ్చి, కూలబడి అతని పక్కని పడుకుని పోవడం, అతనికి కళ్ళు తెరిచినప్పుడల్లా కనిపిస్తూనే ఉంది. చివరికి అతనికి కూడా నిద్ర ఆవహించింది. సూర్యుడు అస్తమించాడు).

 (సశేషం)