Wednesday, December 1, 2010

Serial Killers - II

    మైను గేటు కే ముందరగా ముత్యం తో బాటుగా రౌడీగాళ్ళు అందరూ నించున్నారు, హారతి పళ్ళెం తోటి ఒకర్ని, గుమ్మిడి కాయతో ఇంకొకర్ని పెట్టించాడు ముత్యం అక్కడే, దండ పట్టుకుని ఇంకో అమ్మాయి నించుంది. అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.
    ఒక TVS లూనా మీద ఇద్దరు అయ్యవార్లు (బ్రాహ్మలు) sight అయ్యారు. అస్సలు ఎవ్వరూ లేని వీధి మలుపులోనించి అతి స్లో గా TVS, ఒక భయంకరమైన రొద చేసుకుంటూ వస్తోంది. చూడగానే వెనకాల కూర్చున్న ఒకాయన చెయ్యి ఊపాడు. Tension గా వెయిట్ చేస్తున్న ముత్యం మొహంలో నవ్వు, ముత్యం తిరిగి చెయ్యి ఊపాడు. గేటు తీసుకుని ముందుకు కదిలాడు ముత్యం, వెనకాలే ఈ గణమంతా కదిలింది. ఇందాకా తన గురువు గారు చెయ్యి ఊపినందుకు బాలన్సు తప్పినట్టుంది, బండిని సరి చెయ్యడంలో ఉన్నాడు ముందున్న శిష్యుడు.
అన్నట్టు చెప్పడం మరిచాను, మన ముత్యానికి గురూజీ ఒకాయన ఉన్నాడు. జాతకాల్లోను, వాస్తులోనూ అతన్ని మించిన వాళ్ళు లేరట.
ఆయన చెప్పినట్టు చేసే ఇంత వాడినయ్యానని అంటూ ఉంటాడు ముత్యం ఎప్పుడూను. ఈ వస్తున్నాయన వాస్తు విశారద, శరభేశ్వర శర్మనీ, ఆయనే. ఆయనా ఆయన శిష్యుడూను.

Continuous గా శిష్యుడికి instructions ఇస్తున్న శర్మ గారు, ఎందుకో బండిని ఆపారు. డ్రైవ్ చెయ్యడం ఆపి, బండిని కాళ్ళతో ఆన్చి, తల వంచి శిష్యుడు గురువు గారికి table లాగా వీపుని సెట్ చేసాడు. గురూజీ, సంచీ లోంచి ఒక book బయటకి తీసి, నాలిక తడితో పేజీలు తిప్పుతూ, ఏవో calculate చేస్తున్నాడు. Sudden గా గురూగారు, చేతితో శిష్యుడి వీపుమీద తట్టి, చెయ్యి ఊపారు, వెనక్కి తిప్పమన్నట్టుగా. శిష్యుడు ఏదో అంటూ స్టార్ట్ చేసేసాడు వెనక్కి తిప్పడం. వాళ్ళ ఇద్దరి chatter మళ్ళీ మొదలైంది, watch చూసుకుంటూ గురూగారు, పెదాలు లోపలికి పోనిచ్చి తల ఊపుతున్నాడు. నడుస్తూ ఆయన కేసి వస్తున్న ముత్యం అండ్ కో, పరుగు start చేశారు, కాని అయ్యవార్లు అందలేదు.




గురూజీ తన శిష్యుడితో వెళ్తున్నాడు, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే సింహ ద్వారం నించి ప్రవేశించడం వాస్తు ప్రకారం మంచిది కాదట, అందుటే టైం మించిపోకుండా back gate నించి attack ఇస్తున్నారు శర్మ గారు.

గురూగారు: ఉరేయ్ శు౦ఠా, పోనియ్యవేమిరా? 
శిష్యుడు: ఉండండి గురూగారు, ఎదురుగుండా red light కనిపిస్తోంది కదా, పోనీమంటారే?

గురూజీ: ఉంటె ఉండనీ రా, మనల్ని ఏమి చేసింది, పోనీ!

శిష్యుడు: ఇదేమి మన అమలాపురం కాదు, పోలీసాడు పట్టుకుంటే?

గురూజీ: ఎం పట్టుకోడు లేరా, వాడి ఇదిలో వాడుంటాడు, పోనిచ్చేయ్
(శిష్యుడు ఇంక తప్పదన్నట్టు పోనిచ్చాడు. అసలే ఆ silence లో పెద్ద రొద చేసుకుంటూ బండి, పోలీసు కంట పడనే పడింది. దగ్గరగా వచ్చి లాఠీ అడ్డం పెట్టాడు. శిష్యుడు ఇంక ఆపు చెయ్యబోయాడు కాని, గురూజీ పడనివ్వలేదు. బండి ఒక turn ఇచ్చి దూరం గా వెళ్ళిపోయింది). పోలీసాడు whistle వేసాడు, ఎందుకో వాడూ ఫాలో చెయ్యడానికి పెద్ద బండి వేసుకుని బయల్దేరాడు.
శిష్యుడు: చెప్తే విన్నారు కారు, చూడండి వెనకాలే వస్తున్నాడు, జైల్లో పెడతాడో ఏమో, గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారు! 

గురూగారు ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు. 

గురూగారు: పోనియ్యవేమిరా, వెనకాల ఆ దరిద్రుడు వస్తున్నాడూ! (దీర్ఘం తీసాడు)

శిష్యుడు: (తనలో) కాస్త స్పీడు గా వెళ్ళకపోతే ఎం పుట్టి మునుగుతుంది, చాదస్తం! 

ఇంతలో, చూసుకోకుండా lorry ఒకటి అడ్డం వచ్చింది, అసలే ఆ ప్లేస్ అంతా ఎత్తులు పల్లాలు కాబట్టి, వీళ్ళు పక్కకి తప్పిస్తే, అక్కడే under construction లో ఉన్న ఒక బిల్డింగ్ కోసం తవ్విన గోతుల్లోకి పడిపోయారు. 
శిష్యుడు: ఎక్కడున్నారు గురూగారూ! 
గురూజీ: ఇక్కడే రా, (ఒక చెయ్యి దుమ్ము కొట్టుకుపోయి౦ది పైకి లేచింది)! 

శిష్యుడు ఎలాగో ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. ఇద్దరూ కాస్త స్థిమితపడ్డారు. శిష్యుడు కొంచెం కాళ్ళు చేతులు సాగదీస్తూ ఉండగానే, గురూజీ, TVS repair మొదలెట్టాడు. నాలిక తడి చేసుకుంటూ, ఏదో వైర్లు లాగుతూ పీకుతూ గురూజీ repair చేస్తున్నాడు.

శిష్యుడు: మీ చాదస్తం గాని, అదింక పని చేస్తుందా! 

- 3 - 
కాళ్ళతో తోసుకుంటూ శిష్యుడు, driver సీటు మీద కూర్చుని ఉన్నాడు. వెనకాల గురూజీ మామూలే. Ups downs నించి భారంగా నెట్టుకొస్తున్నాడు శిష్యుడు. 

గురూజీ: ఐతే మాత్రం, ఖరీదైన వస్తువ! పారేస్తామట్రా! (కొంచెం కోపంగా అన్నాడు).
శిష్యుడు: (తనలో) ఖరీదైన వస్తువా? దీన్ని నన్ను, నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి ఎవడూ కొనడు. అయినా ఎన్ని సెకండు హా౦డులు మారితే వచ్చిందిది, అశోకుడి కాలంనాటి బండి. 

డౌన్ లోకి speed గా వెళ్ళిపోతోంది బండి. Break ఎలాగు fail అయ్యింది, కాళ్ళడ్డం పెట్టి ఆపాలంతే. ఎందుకో ఇంత down లోకి శిష్యుడికి కాళ్ళు ఆనడం లేదు. ఇక కిందకి చివరకి వచ్చేసామనగా, ఎక్కడినించో ఒక సాయబు, మేకల మందతో సడన్గా ఊడిపడ్డాడు. 

బండి ఈ సారి ఒక బలిష్టమైన మేకపోతుని target చేసింది.

సాయబు: (హిందీ లో) అరె ఓ, క్యా కర్రా రే...?

గురూజీ, శిష్యుడు తర్జన భర్జన్లు పడుతున్నారు.


గురూజీ: ఉరేయ్, వాడేదో హిందీలో దంచేస్తున్నాడు, తెలీదంటే ఇష్టమొచ్చినట్టు వాగుతాడు. ఇప్పుడెలా?

శిష్యుడు: మై హూ నా! (అభయం ఇచ్చాడు.)

గురూజీ: అలా ఐతే ఒకే! (మనసులో) వీడెప్పుడు నేర్చుకున్నాడు చెప్మా హిందీ?

శిష్యుడు: దేఖియే భై సాబ్! (వాక్ప్రవాహం లా హిందీలో తిడుతున్న సాయిబు ఆగిపోయాడు). ఇస్ మే హమారా కోయి కసూర్ నహీ హై! (Explain చేసాడు). (ఏంటన్నట్టు సాయిబు కళ్లెగరేసాడు). దర్ అసల్ మై ఆప్కో ఏ బతానా చాహూ కి ... (శిష్యుడు ఆగిపోయాడు).

గురూజీ: మన వాడు హిందీ ఆదరగొడుతున్నాడు సుమీ!

సినిమాల్లో చూపించినట్టు మెల్లగా అంగలేసుకుంటూ, మెల్లగా modulation లో చెప్తున్నాడు శిష్యుడు.
నడుస్తూ నడుస్తూ ఇంచుమించు సాయబాడి దగ్గరకంటా వచ్చేసాడు. పొడుగ్గా ఉన్న ఆ సాయబు గాడి గెడ్డం ముక్కుకి తగుల్తోంది. Walking తో బాటుగా ఎం చెప్పాలో కూడా ఐపోయింది శిష్యుడికి.

- 4 -

శిష్యుడు: హమారా గురూజీ అమలాపూర్ మే బహుత్ బడే హై! హమారా గురూజీ శ్రాద్ద్ కర్తే హై, పిండ్ పెడ్తే హై! (ఆవేశం గా ముగించాడు శిష్యుడు. వచ్చిన హిందీ, చెప్పాల్సినది అంతా ఐపోయాయి. రొప్పుతూ ఉండి పోయాడు).

సాయబు: అరె వో సబ్ చోడ్ రే! ఇస్ కా కిత్నా హోతా మాలుం? (అడిగాడు, పక్కనే చలనం లేకుండా ఉన్న మేకకేసి చూబిస్తూ)

శిష్యుడు: నహీ! (చాలా obvious అన్నట్టుగా అన్నాడు. గురూగారి కేసి తిరిగి), గురూజీ మీకేమైనా తెల్సా?
గురూజీ: నాకెలా తెలుస్తుంది రా, అప్రాచ్యపు పీనుగా!

శిష్యుడు: (మళ్ళీ సాయబు కేసి తిరిగి), నహీ! (అంతే obvious అన్నట్టు అన్నాడు).

సాయబు: ఠీక్ హై! మేరేకు దస్సజార్ దే దే, మై మాఫ్ కర్తా! (ఫైనల్ కొటేషన్ ఇచ్చాడు).

గురూజీ: (తనలో) అయ్యో, ఇప్పుడెలా? దరిద్రగొట్టు చచ్చినాడు, వాడి మేక పొతే, బ్రాహ్మణ తర్పణం కింద వదిలిపెట్టకుండా నెత్తి మీద కూర్చుంటాడే? దిక్కుమాలిన గోలరా భగవంతుడా?

శిష్యుడు గురూగారి కేసి చూసాడు, గురూజీ "ఓకే" అన్నట్టు తల ఊపాడు.

శిష్యుడు: ఠీక్ హై! ముత్యాల రెడ్డీ జీ కే ఘర్ ఆకే లేనా! (ఇంకేమి చేస్తామన్నట్టు end చేసాడు).
సాయబు: మీరు, ముత్యాల రెడ్డి గారి తాలూకా?

శిష్యుడు: హా! హం ఉన్కే ఘర్ ఆయే హై!

సాయబు: ఆయనకి మాత్రం చెప్పకండే! ఇమ్లీ, ఉఠో (Whistle వేసాడు. మేకపోతు లేచి కూర్చుంది). మీ కాల్మొక్త, రెడ్డి కి చెప్పకండి సాములు! (పెట్టె బేడా సర్దుకుని, మేకలతో పరుగు లంకించాడు).

శిష్యుడు: హా, హం ఉస్కో బిల్కుల్ నహీ బతాఎంగే! (హిందీ లో కంటిన్యూ చేసాడు శిష్యుడు).

శిష్యుడు: (గురూజీ కేసి తిరిగి), హం చలే!

గురూజీ: (సీరియస్ గా), వాడెళ్లిపోయాడు, తెలుగు లో మాట్లాడు.

శిష్యుడు: ఓహ్ (మర్చిపోయినట్టు పేస్ పెట్టి...) మాఫ్ కర్నా, అంటే, సారీ గురూగారు!

No comments:

Post a Comment