పుస్తకంలా రెండు పేజీల layout |
ఎట్టకేలకి T. V. S. శాస్త్రి (ఉరఫ్ TV శాస్త్రి) అతని శిష్యుడు ముత్యాల రెడ్డి ఇంటిలో ప్రవేశించారు. గురూజీ డ్రాయింగు రూమే తనకి ఉండటానికి కావాలన్నారు. చివరికి, మార్పులు చేసి, దాని పైని గది ఆయనికి, శిష్యుడికి ఇవ్వడం జరిగింది. గురూజీ చాలా గణించి, ముత్యాలకి "ఆల్ ద బెస్ట్, proceed" చెప్పడం జరిగింది.
వచ్చిన అయ్యవార్లని, మొదటి రోజే నాయక్ తగులుకున్నాడు. శిష్య పరమాణువు తోటి,
నాయక్: గురువు గారు?
శిష్యుడు: (తన కేసి చూసి మాట్లాడుతున్న నాయక్ కేసి చూసి, తన వెనకాల చూసుకుంటూ, ఎవరూ లేకపోవడంతో, మళ్ళీ నాయక్ ని ఎగా దిగా చూసి) గురువు గారు ఇక్కడ లేరుగా! (ఇలా అని, ముందుకి వెళ్ళబోయాడు)
నాయక్: నేను అనేది మీ గురించే అయ్యవారూ!
శిష్యుడు: ఇదిగో బాబు, గురూజీ అంటే ఆయన (దూరంగా ముత్యాలతో మాట్లాడుతున్న గురువు గారిని చూపించి), నేను ఆయన శిష్యుడిని.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment