పుస్తకంలా రెండు పేజీల layout |
అది హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లోని, ఒక పెద్ద farm house. లోపల కంపౌండ్ లో entrance దగ్గర కొంతమంది white & white లో నిలబడి ఉన్నారు. లాయరు శివప్రసాద్, చేతిలో ఒక దండ పుచ్చుకుని నిలబడ్డాడు. అందరూ main gate వైపే చూస్తున్నారు.
లాయరు: (స్వగతం) పూలెండిపోతున్నాయి, ఇంకా రాడేంటి? (చేతిలో పూలదండ కేసి చూసి, మళ్ళీ పైకి ఆకాశం కేసి చూస్తూ), పాపం వీట్లిక్కూడా ఎండదెబ్బ తగుల్తున్నట్టుంది.
ఇంతలో ఆ పేద్ద గేటు తీసుకుని ఒక కారు లోపలి ప్రవేశించింది. అందులోంచి ఒక నడి వయసు వ్యక్తి కిందకి దిగాడు. ముతక ఖద్దరు లాల్చి, cotton పైజమా లతో ఉన్నాడు. సగం తెల్లనైన జుట్టు, ఏదో రింగు రింగులుగా ఉంది. భుజానికొక వేలాడే గుడ్డ సంచీ. అన్నిటికీ మించి ముఖంలో ఒక కార్బను ఫ్రేము కళ్ళ జోడు, ఒక సీరియస్ లుక్కు, మొత్తం మీద అందరూ జడుసుకుని చచ్చేలా ఉంది అతని వాలకం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment