అర్జున్ కళ్ళు తెరిచి చూసాడు. నిద్ర నించి అప్పుడే లేచిన తనకి, పక్కనే పడుకున్న శైలజ కనిపించింది. తన కళ్ళల్లో నీళ్ళని తనకి తెలియకుండానే తుడుచుకున్నాడు అర్జున్. అర్జునా! కేక మళ్ళీ వినిపించింది. సందేహం లేదు, రాజ గురువుది, ఆ కేక. ఈ లోపులో ఒక బాణం రివ్వున ఎగసి, తన వెనుక ఉన్న గోడకి గుచ్చుకుంది. శైలజ దిగ్గున లేచింది.
కత్తి, డాలు తో, యోధుని get-up లో బయటికి వచ్చాడు అర్జున్. కోట గోడల దగ్గర, ద్వారం వద్ద ఉన్న సైనికులు బాణాల కి మరణించారు. ఎదురుగా చెక్క మరియు రాతి weapons తో ఉన్నారు, ఫిలిప్పీన్స్ సైనికులు. పున్నమి చంద్రుని వెలుగులో, ఎత్తైన ఆ కోట నించి బాణాలని తప్పిస్తూ, కిందకి దిగుతూ వస్తున్నాడు అర్జున్.
వస్తూనే, తన కత్తి వేటుకి ఇద్దరిని చంపాడు అర్జున్. ఇంకా సైనికులు చాల మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్ సైనికులని చంపుతూ వస్తున్నాడు అర్జున్. అప్పటికే చాలా మంది దీవి లోని వాళ్ళు చనిపోయారు నిద్ర లో ఉన్న వాళ్ళని అలాగే చంపేశారు వచ్చిన సైనికులు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ ఊచ కోత అయిపోయారు.
మనసు నిండా బాధతో, అందరినీ తన కత్తికి ఎరగా వేస్తున్నాడు అర్జున్. అంతా అయిపొయింది. రాజ గురువు తో సహా అందరూ, ఆ సైనికుల బాణాలకి బలి అయ్యారు. దీనికితోడు, రాజ గురువు తపోశక్తికి ఇంత కాలం ఆగిన, ఆ మాంసం తినే చెట్టు, ఇంకా చనిపోయిన వాళ్ళ bodies ని లోపలకి లాక్కుంటోంది. ఇంకెంతో సమయం ఆ దీవిలో ఉండటం మంచిది కాదు.
అందరినీ చంపిన అర్జున్ కాలిని ఎవరో పట్టుకున్నారు. పడిపోబోయి నిలదొక్కు కున్న, అర్జున్ వెనక్కి తిరిగి చూసాడు. అది రాజ గురువు చెయ్యి. కోన ఊపిరితో ఉన్న అతను, అర్జున్ సహాయంతో కొద్ది గా లేచాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్ళు. ఆ దీవి ప్రజానీకాన్ని తన వారుగా చూసాడు అర్జున్, తను చెయ్యగలి గింది చేసాడు, కాని ఈ రోజు తనంటే ప్రేమ చూపిన ఇక్కడి వాళ్ళు ఒక్కరూ మిగల లేదు. పల్లె జనం అమాయకత్వం, తన మీద వాళ్ళ నమ్మకం అన్నీ వమ్మయి పోయాయి ఈ రోజు.
చూస్తుండ గానే, అర్జున్ నుదుటి మీద, విభూతి, తన చేతిలోనిది పెట్టాడు రాజ గురువు. ఏదో మంత్రాలు చదువుతున్నాడు, పెట్ట గానే అర్జున్ కి ఎదో కరెంటు ఒంట్లో ప్రవహించినట్టు అయ్యింది. వెనక్కి పడిపోయాడు అర్జున్. రాజ గురువు ఆఖరి శ్వాస విడిచాడు.
- 2 -
కొంత సేపటికి అర్జున్ లేచాడు. తీవ్రమైన వాన పడుతోంది. అర్జున్ లేవ గానే ఆగిపోయింది. అర్జున్ పైకి లేచాడు. తల కొంచెం నెప్పి గా ఉంది తల పట్టుకున్నాడు. వాన వెలవడం తోనే, మాంసం తినే చెట్టు కొమ్మలు మళ్ళీ విరుచుకు పడుతున్నాయి. మిగిలిన శవాలని అవి లాక్కుంటున్నాయి . అర్జున్, ఊగుతూ తల పట్టుకుని నడుస్తున్నాడు.
"శైలజ, కరక్టే, శైలజ", ఎలా ఉందొ ఏమిటో. ఎదో trance లో ఉన్నట్టుగా పరిగెడుతూ కోట మెట్లు ఎక్కుతున్నాడు అర్జున్.
- 3 -
కొంత సేపటికి స్పృహ కోల్పోయిన శైలజ ని రెండు చేతులతో పట్టుకుని, కిందకి వచ్చాడు అర్జున్. అర్జున్ పరిగెడుతున్నాడు, తపోశక్తి కా అన్నట్టు, అతని దగ్గరికి వస్తే కాలిపోతున్నాయి ఆ కొమ్మలు. దీవి వదలి పోవాలి, ఇంక తప్పదు. ఈ మొక్కలు రాజ గురువు చావుతోటే బలం పుంజుకుంటున్నాయి. దీవి వదలి శైలజ తో పరిగెడుతున్న అర్జున్ వెనుకగా ఆ దీవి మొత్తం ఆక్రమించు కుంటున్నాయి ఆ మొక్కలు. అన్ని ఇళ్ళల్లోను, దీపాలు ఆరి పోతున్నాయి
ఫిలిప్పీన్స్ సైనికులు వచ్చిన చెక్క బోట్లలో ఒక దానిని తీసుకున్నాడు అర్జున్. శైలజ ని ఆ అర్ధ రాత్రి ఎక్కించుకుని ఆ బోటు నడుపుతూ వెళ్ళాడు అర్జున్. కొంత దూరం వెళ్ళిన అర్జున్ కి కనిపించింది, దీవి లో తన ఎత్తైన కోటలోని దీపం చివరి గా ఆరిపోవడం. దీవి అంతటినీ ఆక్రమించాయి ఆ మాంసం తినే మొక్కలు. వాటి ధాటికి, దీవిలోని బాక్టీరియా సైతం అంతరించింది. మిగతా ప్రపంచం లో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతరించిన ఆ మొక్క ఆ దీవి లోని బాక్టీరియా ని నాశనం చేసింది.
- 4 -
అక్కడికి కాస్త దూరం లో ఉన్న ఒక దీవి మీదకి వెళ్లారు వీళ్ళు.
- 5 -
ఆ బిల్డింగ్ అంతా కోలాహలం గా ఉంది. లోపల మిలిటరీ దుస్తులు ధరించిన చాలా మంది మగ వాళ్ళు, గౌన్లతో ఉన్న ఆడ వాళ్ళు ఉన్నారు. ఏదో పార్టీ లా ఉంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, రఘునాథ్, సొన్వక్ అందరూ ఉన్నారు. అధ్యక్షుడు రఘునాథ్ ని అందరికీ చూపిస్తున్నాడు. రఘునాథ్ జోక్స్ వేస్తూ అందరితో మాట్లాడుతున్నాడు కాసువల్ గా.
మొత్తానికి ఈ టెక్నాలజీ (ఆన్వస్త్రాలని నాశనం చేసే వైరస్) ని చాలా ఎక్కువ మొత్తానికి రష్యా దేశానికి అమ్మడానికి నిశ్చయించారు. అందుకు కొనుక్కునే delegates, రష్యా వాళ్ళు, రష్యన్ ఆర్మీ కి చెందిన, ఉన్నత మిలిటరీ ఆఫీసర్ గోర్ స్కీ. అక్కడే ఉన్నారు. దీనంతటికీ మూలం రఘునాథ్ కాబట్టి అతనికి, "King's gallantry Award", ఫిలిప్పీన్స్ దేశం లోనే గొప్పదైన మెడల్ ఇస్తున్నారు. అందుకే ఈ పార్టీ.
చివరికి ఆ మెడల్ ఇచ్చే టైం వచ్చింది. Announcement, మధ్యలో "Mr. రఘునాథ్" అని వినిపించడంతో, అందరూ చప్పట్లు కొట్టారు. రఘునాథ్ నవ్వుతూ dais మీదకి ఎక్కాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, రఘునాథ్ ని కావలించుకుని, గోల్డ్ మెడల్ వేసాడు.
అధ్యక్షుడు: (మైక్ దగ్గరగా) ఫిలిప్పీన్స్, నెంబర్ 1... (చెయ్యి పైకెత్తాడు, జై కొడుతున్నట్టు. అందరూ స్రుతి కలిపారు. తర్వాత చిన్న నిశ్శబ్దం).
ఆ నిశ్శబ్దం లో అందరూ రఘునాథ్ కేసు చూస్తున్నారు.
రఘునాథ్: To Philippines, (Toast చేస్తున్నట్టు, తన చేతిలోని వైన్ గ్లాస్ పైకెత్తి తాగాడు, అందరూ అదే చేశారు).
రఘునాథ్: (స్పీచ్ కంటిన్యూ చేస్తూ) చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇండియా మీ దేశం కదా అని, కాని నేను పుట్టింది ఇండియా అయినా, నాకు తిండి పెట్టింది ఫిలిప్పీన్స్. ఇండియా నా దేశం కాదు, నిజానికి ఫిలిప్పీన్స్ కూడా నా దేశం కాదు. (అధ్యక్షుడితో సహా అందరికీ కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి ...).
రఘునాథ్: (టోన్ పెంచి), ఎవడు చెప్పాడ్రా ఫిలిప్పీన్స్ నంబర్.1 అని, (అందరికి ఒళ్ళు నీలం గా మారడం మొదలైంది ...) ఇప్పుడు మన దగ్గరే కొంటారు, రేపు మనల్ని బతక నివ్వరు, అదే పెట్టి మననే కొడతారు (చావు బతుకుల మధ్య ఉన్న గోర్స్కి ని చూపిస్తూ అన్నాడు). అయినా ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒక బూటకం, అది ఉండదు, ఉన్నా నేను ఉండనివ్వను.
రఘునాథ్: ఫిలిప్పీన్స్ నెంబర్ 1 యేరా, నెంబర్ 1 యే. కాని ఆ నంబర్ 1 దేశానికి, రాజు ఎవరో తెలుసా, నేను. (తన కేసి చూపిస్తూ, వేలుతో ...). (Dais దిగుతూ, మళ్ళీ తనే, ఇది నంబర్ వన్నె, కాని మిగతా వన్నీ జీరోస్, అంతే.) విష ప్రయోగం తో చాలా మటుకు ఫిలిప్పీన్ జనరల్స్ ని చంపి, గద్దెనెక్కాడు రఘునాథ్.
- 6 -
ఆ దీవిలో ఒకరి సహాయంతో శైలజ ని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు అర్జున్. ఐప్పుడు శైలజకి బాగానే ఉంది, పడుకుని మాట్లాడుతోంది, స్పృహ లోకి వచ్చింది. మళ్ళీ వాన మొదలైంది. డాక్టర్ తో upstairs లో శైలజని ఉంచి, మందుల కోసం కిందకి దిగాడు అర్జున్. అప్పుడే టీవీ లో ఏదో వస్తోంది. టీవీ లో రఘునాథ్...
రఘునాథ్: I am the new dictator of Philippines, నేను ఫిలిప్పీన్స్ దేశానికి కొత్త రాజుని. ఫిలిప్పీన్స్ కే కాదు, ఈ యావత్ ప్రపంచానికి నేనే రాజుని. నా మాట విని, నేను చెప్పిన డబ్బు ఇవ్వడానికి ప్రపంచ దేశాలు అన్నీ రెడీ అవ్వండి. లేదా మీ దేశం లో ఒక్క ప్రాణి కూడా మిగలదు, ఈ రాత్రికి శాంపిల్ గా నాలుగు దేశాలని నాశనం చేస్తున్నాం, అవి ఏమిటి అనేది ఇంకో గంట లో మీకు తెలియబోతోంది. (Communication cut అయ్యింది).
ఇది వింటున్న అర్జున్ తో ఒక ఫిలిప్పీన్స్ దేశస్తుడు, ఆ టీవీ దగ్గరి వాడు,
ఫిలిప్పీన్స్ వాడు: ఇతనే మా కొత్త పాలకుడు, ఇతని పేరు రఘునాథ్. పిచ్చివాడు, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఇతనితో పాటు, మా దేశం నాశనం అవుతుందేమోనని భయం గా ఉంది. (భయం కూడిన కళ్ళతో అన్నాడు)
ఇది విన్న అర్జున్ వెంటనే, పరుగు పెట్టి, సముద్రం వేపు వెళ్ళాడు. ఒక్క ఉదుటన సముద్రం లో దూకి, ఈత కొట్టడం మొదలు పెట్టాడు.
- (సశేషం) -
No comments:
Post a Comment