Wednesday, July 28, 2010

మొగుడు -- (కృష్ణ వంశీకి ఏమైంది?!) (1/5)

    ఏంటిది? అంతఃపురం, danger లాంటి సినిమాలు తీసిన కృష్ణ వంశీ ఈ మధ్య అన్నీ చెత్తగా ఎందుకు తీస్తున్నాడు? అతనికి ఏమైంది? ఇవే ప్రశ్నలు నా మనసులో మెదిలాయి, ఈ సినిమా చూసిన తర్వాత. అస్సలు క్లారిటీ ఏమి లేకుండా, ఒక అతుకుల బొంత storyline తోటి ఎందుకు తీసాడా అనిపించింది.

కధలోకి వెళ్తే, గోపి చంద్ ఒక happy bachelor లాగ ఫస్టు దర్శనమిస్తాడు. పెళ్లి వద్దనే అతను, playboy అనుకుంటాం, కాని మళ్ళీ తనకి తన ఫ్యామిలీ అంటే ఇష్టమని, అందు కోసమే పెళ్ళైతే ఆ అమ్మాయి ఎలా ఫ్యామిలీ లో కలుస్తుందో అని భయమని చెప్తాడు, పర్లేదు ఓకే.

ఆ తర్వాత తాప్సి ని చూసి love లో పడతాడు, ఆ అమ్మాయి తల్లి (రోజా) పెద్ద politician, తండ్రి నరేష్. గోపి చంద్, తన నాన్న రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ విషయం చెప్పాక, వెళ్లి వాళ్ళని అడుగుతాడు, వాళ్ళు కూడా ok చెయ్యడం, పెళ్లి జరిగిపోతుంది.

ఐతే గౌరీ దేవి విగ్రహం రాజేంద్ర ప్రసాద్ అడగడంతో, ఆడ పెళ్లి వాళ్ళు ఇవ్వమనడం తో, పెళ్లి మధ్యలో ఆగిపోతుంది. చివరకి వాళ్ళిద్దరూ ఎలా కలిసారనేది remaining స్టోరీ.

గౌరీ దేవి విగ్రహం తీసుకోవడమనేది తమ కుటుంబ సాంప్రదాయమని రాజేంద్ర ప్రసాద్ సెలవిస్తాడు. తన తండ్రుల బట్టి ఇలాగే జరిగిందని, దాని వల్ల ఎవరికీ ఎటువంటి problem లేదని అంటాడు. అసలు, ఇంటినించి ఆడ పిల్లని పంపేటప్పుడు, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పోతే, సిరి పోతుందని, అందుకే ఆ అమ్మాయిని గౌరీ దేవిలో పెట్టి, అప్పుడు అమ్మాయిని పంపిస్తామని, ఆడపెళ్ళి వాళ్ళు చాలా strong రీజనే చెప్తారు, నిజమే.

ఇలాంటి గౌరీ దేవి ని పట్టుకెళ్ళే ఆచారాలు, ఎక్కడా లేవన్న సంగతి పక్కన పెడితే, ఇలాంటి వేరే రకం ఆచారాలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ముందే మాట్లాడుకు౦టారనేది, చాలా సింపుల్ పాయింట్. పెద్ద వాళ్లున్నది, ఇలాంటి విషయాలు చెప్పుకోడానికి కూడా కదా.

అది జరగకుండా, గౌరీ దేవి విగ్రహం లాస్ట్ మినిట్ లో రాజేంద్ర ప్రసాద్ అడగడం, అది పెద్ద గొడవకి దారి తియ్యడం, నాకు మటుకు హాస్యాస్పదం గా అనిపించింది.

రోజా characterisation కూడా కొంచం సరిగ్గా లేదు. ఆమె మొదట్లో, తనకి వ్యతిరేకం గా protest చేస్తున్న వాళ్ళని పోలీసు కేసు లో ఇరికిస్తుంది. అంతా ok గాని, ఏమి జరుగుతోంది అంటూ వచ్చిన police inspector ని తిడుతుంది. ఒక hard-core manipulative politician గా అప్పుడు కన్పించిన రోజా, తర్వాత మొగుడు చెప్పిన మాట విని, ఒక మామూలు (డబ్బున్న వాడైనా, మంచి వాడైనా సరే) మనిషైన రాజేంద్ర ప్రసాద్ తో వియ్యానికి ఒప్పుకుంటుంది. ఆ ఒక్క సంఘటన మినహా రోజా ఎందులోనూ manipulative గా కనిపించదు. రోజా characterisation సరిగ్గా చెయ్యలేదేమో అనిపిస్తుంది. మిగతా సినిమా అంటా ఒక కోపిష్టి గానో, మొండిపట్టుదల మనిషి గానో మాత్రమె కనిపిస్తుంది కాని, మనుషుల్ని యూస్ చేసి అవతల పారేసే politician దర్శనమివ్వదు.



మిగతా వాళ్ళు ఓకే, గాని సినిమా మొత్తం మీద ఒక నిర్దిష్టమైన storyline లేకుండా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా, "శశిరేఖా పరిణయం" టైపులో, హీరో చివర్లో తన ఫ్యామిలీ వాళ్ళందరినీ తిట్టడం (బావల్తో సహా) ఒకటి, ఎందుకా అనిపించింది. సెకండ్ హాఫ్ మధ్యలో, తన ఫామిలీ వాళ్ళని, "ఆపండి మీ ఓవర్ యాక్టింగ్" అని గోపిచంద్ అనడం, సినిమా లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. సినిమా మొత్తం మీద ఇలాంటి dialog ఒకటి ఉంటె చాలనిపిస్తుంది.

మొత్తం మీద, ఒక మొగాడు మొగుడు ఎలా అవుతాడో, ఒక స్త్రీ ఎలా మారుస్తుందో, ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ పెట్టి కృష్ణ వంశీ తీస్తాడనుకుని వెళ్ళిన నాకు చాలా bad experience ఎదురయ్యింది. దీనికన్నా "రోజాని manipulative" గానే అట్టేపెట్టి, పెళ్లిని డ్రామా కింద, చివర్లో ఆపు చేసేసినట్టు చూపిస్తే కొంత twist కి న్యాయం జరిగేదేమో. ఇంకా చెప్పాలంటే, గోపిచంద్ playboy కింద, అతనికి ఇష్టం లేకుండా తాప్సి తోటి పెళ్లైనట్టు, అతన్ని దారికి తేవడానికి తాప్సి try చేసినట్టు, మధ్యలో రోజా అహంకారం అన్నీ పెట్టి ఉంటె, రక్తి కట్టేది. ఏదో ఒక story తీసేసి దానికి మొగుడు, అని పేరు పెట్టేసాడు కృష్ణ వంశీ కూడా, అందరు డైరెక్టర్లు లాగే. అంతఃపురం లాంటి సినిమాలు తీసిన ఒక bright తెలుగు డైరెక్టర్ నించి రావాల్సిన సినిమా కాదిది.

మీరు ఖాళీ గా ఉంటె, వెళ్లి చూడచ్చు, కామెడీ ఓకే, సినిమాలో అవసరం లేదు కాని. మేము కూడా ఒక సారి చూసేసాం కదా. నా అభిప్రాయం తప్పని మీకు అనిపించచ్చేమో కూడా.











No comments:

Post a Comment