గురూజీ: కుదరదన్నా నా! (కొంచెం కోపం గా)
తెంబి: యాణ్ (తనూ గట్టిగా)
గురూజీ: (ఏవో లెక్కలు వేస్తూ నోట్లో ఆలోచిస్తూ ఉండి, చెయ్యి అడ్డం గా తిప్పాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు).
తెంబి: (ఏదో ఆలోచించి) ఒణ్ మిణిట్! (తన భుజానికున్న గుడ్డ సంచీ లోంచి, ఇవాల్టి న్యూస్ పేపర్ తీసాడు).
అందులో, ఈ రోజు సుడోకు ఉన్న పేజి తిప్పాడు. మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యడం మొదలు పెట్టాడు. అయిదు నిమిషాల తర్వాత మొత్తం అంతా అయ్యింది. తర్వాత, ఉన్న తొమ్మిది చదరాల్లోను, మధ్య నంబరు circle చేసాడు. వాటిల్తో ఏదో జ్యోతిష్యం లాగ గణించడం మొదలు పెట్టాడు. కొంత సేపటికి,
తెంబి: నోర్త్, ఇంద సాటైన్, డిల్లి ఇంద సాటైన్ (Saturn, శని). (Explain చేసాడు). జూపిటేయ్ (Jupiter, గురుడు) ఇంద ... (పెన్ను ఉన్న కుడి చెయ్యి పేపరు నించి పైకి లేపి, కుడి వైపు రెండు సార్లు ఊపాడు, ఈస్ట్ కి వెళ్లాలన్నట్టు).
గురూజీ, కళ్లార్పి తల ఊపాడు.
ఇది చెప్పి తెంబి, నొసలు చిట్లించాడు, తర్వాత కళ్ళజోడు సవరించి, గురూజీ కళ్ళల్లో చూసిన తన కళ్ళు, కిందకి దించాడు. ఇదంతా చూసిన ముత్యాలకి మాత్రం ఏమి అర్ధం కాలేదు.
- 2 -
మొత్తానికి, హీరో సైకిలు మీద హై-వే మీదుగా హైదరాబాద్ నించి డిల్లీ వెళ్ళడం కాన్సిల్ అయ్యింది. అలా ఉత్తరం వైపు వెళ్తే శని అట. తూర్పుకి వెళ్ళడం, వాస్తు ప్రకారం భేషని, గురూజీ, అండ్ తెంబి ప్రవచించడం జరిగింది. ఆల్రెడీ హీరోయిన్ను కోసమని డిల్లీ కి సైకిలు మీద వెళ్ళడం, ఒక నెల రోజులు లాగించారు, కాబట్టి, ఇప్పుడు కలకత్తా వెళ్ళడానికి మంచి కారణం కావలసి వచ్చింది. హై-వే మీద diversion పెట్టాలని తెంబి చెప్పిన సలహా అందరికీ నచ్చింది. (హై-వే under repair, ప్లీజ్ టర్న్ రైట్) పెట్టిన బోర్డుని, అక్కడ పెట్టారు. పక్కనే ఉన్న మట్టి రోడ్డు, చెట్ల గుబురు మీదకి మంచి diversion ఇచ్చారు.
జరిగిన ఎపిసోడులు already టీవీ లలోకి వెళ్ళిపోయాయి కాబట్టి, రూటు మార్చి, హీరో కలకత్తా వైపు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాల్సి రావడం జరిగింది.
- 3 -
ఇది జరిగిన తర్వాత, గురూజీ తెంబి అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపించడం మొదలెట్టారు. "సుడోకు లో జ్యోతిష్యం" అనే ఒక గొప్ప ప్రక్రియని తనకి పరిచయం చెయ్యడం తో, తన సహోద్యోగి తెలివి తేటలపై, అపారమైన నమ్మకం వచ్చింది గురూజీకి. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఆనంద భాష్పాలు వచ్చేవి గురూజీకి.
- 4 -
ఈ వార్త మొత్తం ఇంట్లో స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. ముత్యాలు, ఇంట్లో అందరికీ, పెద్ద గొంతికతో ఈ స్టోరీ చెప్పడం, అందరూ, (టీవీ unit తో సహా) తెంబి ని అభినందించడం జరిగాయి.
సత్తి రెడ్డి: సుడోకు తో జాతక మెట్ల చెప్తార్ర బై ...?
నాయక్: ఏమో, నాకేం దెల్సు రా బై! (కొంచెం సేపాగి, హాలంతా చూస్తూనే ...) అసలు సుడోకంటే ఏంద్ర? (అసలు డవుటు చెప్పాడు)
సత్తి రెడ్డి: అయినా, పేపర్ల పక్కనే జాతకం ఉంటె, సుడోకు ఎందుకురా పూర్తి చెయ్యుడు?
నాయక్: (చిన్నగా నవ్వుతూ ...) ఏది జాతకమెక్కడ? చూపియ్?
సత్తి రెడ్డి: ఇదిగోరా భై! (సుడోకు పేజీలోనే ఉన్న జాతకం చూపించాడు).
నాయక్: ఇవాళేమి రాసిండో, చెప్పించుకోవాల. లాయరు బాబు ఉన్నడా ఏంది?