Monday, November 1, 2010

Serial Killers - I (భయంకరమైన కామెడీ)

    అది హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లోని, ఒక పెద్ద farm house. లోపల కంపౌండ్ లో entrance దగ్గర కొంతమంది white & white లో నిలబడి ఉన్నారు. లాయరు శివప్రసాద్, చేతిలో ఒక దండ పుచ్చుకుని నిలబడ్డాడు. అందరూ main gate వైపే చూస్తున్నారు.

లాయరు: (స్వగతం) పూలెండిపోతున్నాయి, ఇంకా రాడేంటి? (చేతిలో పూలదండ కేసి చూసి, మళ్ళీ పైకి ఆకాశం కేసి చూస్తూ), పాపం వీట్లిక్కూడా ఎండదెబ్బ తగుల్తున్నట్టుంది. 

ఇంతలో ఆ పేద్ద గేటు తీసుకుని ఒక కారు లోపలి ప్రవేశించింది. అందులోంచి ఒక నడి వయసు వ్యక్తి కిందకి దిగాడు. ముతక ఖద్దరు లాల్చి, cotton పైజమా లతో ఉన్నాడు. సగం తెల్లనైన జుట్టు, ఏదో రింగు రింగులుగా ఉంది. భుజానికొక వేలాడే గుడ్డ సంచీ. అన్నిటికీ మించి ముఖంలో ఒక కార్బను ఫ్రేము కళ్ళ జోడు, ఒక సీరియస్ లుక్కు, మొత్తం మీద అందరూ జడుసుకుని చచ్చేలా ఉంది అతని వాలకం.

లాయరు: రండి, రండి మీకోసమే చూస్తున్నాం (మెడలో దండ వేసాడు). ప్రయాణం బాగా జరిగిందా? (ఇంతలో white & white లో జబర్దస్తు గా ఉన్న ఒకడు, వీళ్ళ మీద పన్నీరు జల్లాడు. మరీ ఘనంగా పడటంతో విసుగ్గా అతనికేసి చూసాడు కళ్ళజోడు వ్యక్తి). 

అంతా కలసి, లోపల హాల్లోకి వెళ్లారు. అక్కడ ముత్యాల రెడ్డి, ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్నాడు. కనిపించగానే ఎదురెళ్లి, కూర్చోబెట్టాడు. కళ్ళజోడు వ్యక్తి, ఒక్క సారి హాలంతా కలియజూస్తూ, కళ్ళజోడు సరి చేసుకుంటూనే కూర్చున్నాడు. అతని మొహంలో ఏ expression లేదు. 

నిజానికి ముత్యాల రెడ్డి real estate రంగం లో రారాజు. అతను చేసినన్ని దందాలు, సెటిలుమెంట్లు ఎవ్వరూ చేసి ఉండరు. అతని పోటిదారులతో పాటు, అతనికి దందాల్లో ఎదురైన వాళ్ళందరికీ అతనో సింహ స్వప్నం. ఐతే ఇదంతా నిన్నటి మాట. ఇన్ని దందాలు చేసిన ముత్యంకి (తెలిసిన వాళ్ళలాగే పిలుచుకుంటారు), ఒక రోజు సడన్ గా, తానెందుకు class అవ్వకూడదనిపించింది. అంతే, అనుకున్న తడవుగా, ఈ దందాలన్నింటికి స్వస్తి చెప్పేసాడు.

అప్పడినించి కళలవైపు change అయ్యాడు ముత్యం. ప్రతి శనివారం ఎవరో singers నో, dancers నో, లేకపోతే painters నో ఆహ్వానించడం, వాళ్ళచేత ప్రదర్శన తన ఫారం హౌస్ లో ఇప్పించడం అలవాటు చేసుకున్నాడు. ఆ classical డాన్సు, మ్యూజిక్కు అర్ధం కాకపోయినా appreciate చేసినట్టు behave చెయ్యడం అలవాటు చేసుకున్నాడు. ఈ మధ్యన మోడరన్ ఆర్టు గాలరీలకి కూడా షికారెల్తున్నాడు. ఆ మధ్యనే కొన్ని అస్సలు అర్ధం కాని పెయి౦టింగులు కొన్నాడు కూడా. ప్రతీ శనివారం ఏదో బుర్రలో ఎక్కించుకోవడం, తరవాత అది దిగడానికి ఆదివారం అంతా ఫుల్లుగా మందుకొట్టెయ్యడం అతనికి అలవాటయ్యిపోయాయి.

ఆ క్రమం లోనే పిలవబడ్డాడు ఈ కళ్ళజోడు వ్యక్తి. ఇతను, పేరు మోసిన TV writer. ఇతను రాసిన serials అన్నీ హిట్లేనట. ఇతనికి ఈ మధ్యలోనే ఒక TV serial కి గాను అవార్డు కూడా వచ్చింది. దాని గురించే ముచ్చట్లు జరుగుతున్నాయి అక్కడ. 

ముత్యం: మీరు మా కుటీరానికి వచ్చారు, చాలా సంతోషం. మీకు అవార్డు వచ్చింది కదా సామి, దాని గురించి చెప్తారా.

వెనకాల నిలబడి ఉన్న సెగట్రీ ని కదిపాడు లాయరు, సెగట్రీ రెస్పాన్స్ గా "అదే! మొదలు లేని కధ!" confirm చేసాడు. కళ్ళజోడు రైటరు చెప్పడం మొదలుపెట్టాడు. 

కళ్ళజోడు: (కళ్ళజోడు సరి చేసుకుంటూ), కధ మొదట్లో.... (కాసేపాగి, గాత్రం సవరించుకున్నాడు, మళ్ళీ), కధ మొదట్లో .... (మళ్ళీ కొంచెం break, మళ్ళీ కొంచెం సేపాగి...), కధ అసలు ఎలా మొదలవుతుందంటే... 

చెప్పుకుపోతున్నాడు. ఇంతలో ఇద్దరు white & white రౌడీ గాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

సత్తి రెడ్డి: అసలు మొదలు లేని కధ౦టే, స్టొరీ ఎట్లా స్టార్ట్ అవ్వుద్దిరా భై?

నాయక్: ఏమో, నాకెందేల్సు? 

సత్తి రెడ్డి: అసలు స్టొరీ కి మొదల్లేకపోవడమేంద్ర? అంతులేని స్టోరీలను చూసినం. 

నాయక్: ఏమో, నాకెందేల్సు రా? 

సత్తి రెడ్డి: అయినా రౌడీ కొడుకులం, మనకేం దెలుస్తది? (ఈ సారి నాయక్ కూడా అతని కేసి తిరిగి, పెదాలు చిట్లిస్తూ అన్నాడు. కళ్ళజోడు కహానీకోరు చెప్పుకు పోతున్నాడు).

రైటరు గారు కధాసాగరం లో వీళ్ళని తీసుకెళ్లడం, అంతా శ్రద్ధగా విన్న ముత్యం, appreciate చెయ్యడం జరిగిపోయాయి యధావిధి గా. ఆ సాయంకాలం అవార్డు ఫంక్షను, మళ్ళీ ఇంకా డీటైల్సు అడిగాడు లాయరు.

లాయరు: (Sofa లో ఉన్న రైటరు కేసి తిరిగి) నమస్కారం సార్!

కళ్ళజోడు: (కళ్ళతోనే స్వీకరించి, సీరియస్ లుక్కు continue చేస్తూ)

లాయరు: సార్, ఇప్పుడు మన సీరియల్లు ఏ టీవీ లో వస్తుందండీ! (కళ్ళజోడు చెప్పాడు). సాయంకాలమా సార్! (మళ్ళీ కళ్ళజోడు clarify చేసాడు).

(చాలా సేపాగి, ఏదో expect చేస్తున్నట్టు తన కేసి చూస్తున్న కళ్ళజోడుతో లాయరే), అంటే చాలా బావుందని మా ఇంట్లో వాళ్ళు అడిగితేను, (కొంచెం గ్యాప్ ఇచ్చి...) Thank you సార్! (ఇంక నిష్క్రమించబోయాడు.)

ఎందుకో కళ్ళజోడుకి ఈ ఎత్తుగడ నచ్చలేదు.

కళ్ళజోడు: అంటే ఆ ఒక్క చానలే కాదు, ఇంకా చాలా వాటిల్లో వస్తుంది (చెప్పాడు).

లాయరు: (డౌట్ గా) ఇంకా అంటే, ఇంకా వేటిల్లో వస్తుంది సార్!

కళ్ళజోడు: (చాలా పేర్లు చెప్పాడు.). అన్నిట్లోనూ వస్తుంది (తల ఊపుతూ...)

లాయరు: ఏ టైం లో అండి! (చిన్న నోటు పుస్తకం తీసాడు)



కళ్ళజోడు: అంటే, నా సీరియల్సు చాలా ఉన్నాయ్ కదా, అవన్నీ మామూలుగా చాలా చానల్సు లో వస్తాయి (తల ఊపుతూ అన్నాడు), కావాలనుకుంటే చూడచ్చు (ముత్యం కేసి తిరిగాడు. ముత్యం ఒక వెర్రి నవ్వు నవ్వాడు). (లాయరు కేసి తిరిగి) నా సీరియల్సు, ఇప్పటి వరకు (ఏమో అనుకుని, మళ్ళీ ముత్యం కేసి తిరిగి), చాలా business చేసాయి ముత్యం! (అలాగే పిలవమని ముత్యం ఈనకి order వేసాడు లెండి పొద్దున్నే). ఇప్పటి వరకు కనీసం కోట్లలో profit వచ్చిఉంటుంది చానళ్ళ వాళ్లందరికీను.
Business అనగానే ముత్యం కొంచం దగ్గాడు, సామాన్యం గా ఇలాంటి శనివారపు భేటీల్లో, business ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతాడు ముత్యం. కాని ఈసారి తను పిలిచిన ఆయనే అనడంతో కొంచం ఖంగారు పడ్డాడు ముత్యం. కానీ చివరికి కోట్లలో లాభం వచ్చిందనగానే, light bulb లాగా వెలిగింది మొహం. ఇంక ఎటువంటి ఫీలింగూ పెట్టుకోవడం అమానుషం అన్నట్టు, భక్తి గా ఆయన కేసి చూసాడు.

కళ్ళజోడు dinner చేసి, సెలవు పుచ్చుకుని పోయాడు.


-2-

ఈ మధ్యల్లో ముత్యం TV సీరియల్సు తెగ చూసేస్తున్నాడు. పొద్దున్న పది గంటలకి మొదలెట్టింది, రాత్రి పదికి కూడా తెమలడం లేదు. అప్పుడప్పుడూ అవన్నీ చూడటమే కాకుండా, తన స్టాఫందరికీ చూపించి అందర్నీ ఏడిపిస్తున్నాడు కూడా. వీళ్ళ ఏడుపులతో ఆ farm house దద్దరిల్లి పోతోంది. కొన్నాళ్ళు చూసాక, ఒక రోజు sudden గా ఒక సీరియల్ ఎపిసోడుని record చేసాడు. రాత్రికి తన రూము లో, మందు కొడుతూ ఆ episode ని ముందుకి వెనక్కి చేస్తూ, ఒక పుస్తకం లో ఏమిటో ఎక్కించాడు. ఆ తర్వాత గాని అతని సీరియల్ watching తగ్గలేదు.

కొంత కాలానికి తెలిసింది, ముత్యం ఒక TV సీరియల్ తీసేద్దామని decide అయ్యిపోయాడని. ముత్యాలకి ఒక గోఫ్ప ambition ఏదో ఉందట కూడాను, ఆ TV సీరియల్ తీసి కుబేరుడై పోవాలని.

(సశేషం)