శైలజ పెద్ద గావు కేక పెట్టింది. అర్జున్ ని కుదుపుతూ, గట్టిగా అరుస్తూ, ఒక చేత్తో చచ్చి పడున్న మృత దేహాలకేసి చూపిస్తూ ఉంది. అర్జున్ ని hysterical గా అదే పనిగా కుదుపుతోంది. లేచిన అర్జున్, తన ఊపుకి కింద పడిన తన కళ్ళజోడు తీసుకుని, ఏంటన్నట్టు చూసాడు. తనే చంపిన మృత దేహాలు కనిపించడం తో, కొద్దిగా ఖంగారు పడ్డాడు అర్జున్. తమాయించుకుని చూస్తున్న అతనితో,
శైలజ: Sorry! (క్షమించమన్నట్టు అనునయం గా అంది).
అతనికేసి మాట్లాడుతున్న శైలజకి అర్జున్ shirt మీద వీపు పైన, ఒక పెద్ద రక్తపు మరక కనిపించింది. అనుమానం, భయంతో అతనికేసి చూస్తూ,
శైలజ: ను... ను... ను... నువ్వే, నువ్వే చంపావు, ను.. ను... ను... నువ్వే!? (భయ౦ తో నోట మాట రావడం లేదు తనకి, పైగా నమ్మ బుద్ది వెయ్యడం లేదు).
ఔనన్నట్టు, తల దించుకున్నాడు అర్జున్. ఈ సారి శైలజ ఇంకా గట్టిగా అరిచింది.
- 2 -
చాలా సేపు అతనికి దూరం గా కూర్చుంది శైలజ. అతను తను చూసిన అర్జున్ అయితే కాదు, ఎందుకో అంతా తెలిసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అనిపిస్తోంది. మోసగాడు, హంతకుడా అంటే, అతని మొహం చూస్తే, అలా అనిపించడం లేదు. ఇందాకటి నించి చూస్తోంది, అర్జున్ మొహంలో ఎందుకో acceptance కనిపించడం లేదు, కొద్దిగా బాధపడుతున్నట్టు ఉంది, ఆ dead bodies కేసి అర్జున్ చూసినప్పుడల్లా. చివరికి అతను అమాయకుడే అని నమ్మింది శైలజ.
శైలజ: (అతని దగ్గరగా వెళ్లి) ఎందుకు చంపావ్, attack చేసారా? (మెల్లగా అడిగింది. అర్జున్ అవునన్నట్టు తల పంకించాడు. అతను ఏదో తప్పు చేసినట్లు తల దించుకునే ఉన్నాడు)
శైలజ: ఎ... ఎలా చంపావ్? (ఈ సారి కొంచెం determined గా గట్టిగా అడిగింది. అర్జున్ కొంచెం సేపు అలాగే ఉండి, తల అడ్డం గా ఊపాడు).
- 3 -
ఇంత సేపూ మాట్లాడుతున్న శైలజకి అర్జున్ harmless అని నమ్మకం కుదిరింది.
శైలజ: జేమ్స్ బాండా, spy కదా, జేమ్స్ బాండ్ కదా? (అడిగింది దించిన అర్జున్ మొహంలో మొహం పెట్టడానికి ప్రయత్నిస్తూ. అర్జున్ అడ్డం గా తల ఊపాడు)
శైలజ: (తనే మళ్ళీ) ఎందుకు చెప్పడం లేదు, చెప్తే చంపేస్తారు కదా, అందుకే చెప్పడం లేదు, (కొంచెం సేపాగి) కదా? (అడిగింది)
అర్జున్: (కళ్ళల్లో నీళ్ళతో, face పైకెత్తి) గుర్తుకు రావడం లేదు (గట్టిగా అరిచాడు. మళ్ళీ తనే తల పట్టుకుని, ఈసారి కాస్త మెల్లగా) గుర్తుకు రావడం లేదు, అంతే.
శైలజ: (అర్జున్ దగ్గరికి వచ్చింది, అతని జుట్టులో వేళ్ళని పోనిస్తూ) అయితే గుర్తుకి తెచ్చుకోవడానికి try చెయ్! (అనునయం గా చెప్పింది)
అర్జున్ కళ్ళు మూసుకుని అంతా గుర్తు తెచ్చుకోవడానికి try చేస్తున్నాడు. అంతా గుర్తుకి వస్తున్నట్టే ఉంది, కాని బల్లెం తో తను పొడిచిన scene గుర్తుకి రావడంతోటే, అతనికి చాలా భయం వేస్తోంది. అమాంతం కళ్ళు తెరుచుకుంటున్నాయి. భయం తో heart-beat పెరిగి, ఆందోళనగా లేస్తున్నాడతను. మళ్ళీ శైలజ ని చూసి, కళ్ళు మూసుకుంటున్నాడు అతను.
ఇదంతా సముద్రం కేసి చూస్తున్న శైలజ గమనిస్తూనే ఉంది. ఓహో, అన్నట్టుగా కొంచెం కనీ కనిపించనట్టు తల పైకెత్తి, మళ్ళీ దించింది.
- 4 -
ఆ దీవిలోఅవతలి వైపు ఉన్న ఆటవికులలో కలకలం నెలకొంది. శత్రు వేగులను చంపుతామని వెళ్ళిన యువరాజు, అతని సహాయకులు, ఇద్దరు మెరికల్లాంటి యోధులు ఇంకా రాలేదు. సమయం, రాత్రి కావస్తోంది. ఎంత late అయ్యినా ఈ మధ్యాన్నానికి వచ్చి ఉండాలి మరి.
రాజ గురువు: (ఇతడిని రాజే పిలిపించాడు. Trance లో ఉన్నట్టు ఊగుతున్నాడు అతను). యువరాజు అదుల్య వీర, మరణించాడు. (Announce చేసాడు)
ఈ మాట వింటూనే, ఆత్రుతగా నిలబడి చూస్తున్న, రాజు తన సింహాసనం లో కూలబడ్డాడు.
రాజ గురువు: (మళ్ళీ తనే), అతని వెంట వెళ్ళిన ఇద్దరు వీరులు కూడా మృత్యు వాత పడ్డారు. మహావీరుడైన అతనిని ఎదిరించి, తమ చావు తామే కొని తెచ్చుకున్నారు.
ఇంతలో ఒక వేగుల వాడు, సాదివూ (సహా దేవుడు) వచ్చాడు.
సాదివూ: మహారాజులకి ప్రణామాలు! దుర్వార్త మోసుకు వచ్చినందుకు క్షంతవ్యుడ్ని. (కొద్దిగా రాజు గారి కేసి చూసి, మళ్ళీ కళ్ళు వంచాడు. అతడు మొత్తమంతా తల వంచుకునే ఉన్నాడు.) యువరాజు అదుల్య వీర, అతని సహాయకులు ఉ౦పకతి, ఆర్కేబు వీర స్వర్గాన్ని పొందారు. (ఇంకా చెప్పబోతున్న అతడిని, తన చెయ్యి చాపి, ఆగమని సైగ చేసాడు రాజు. వెళ్ళమని చేతి సౌజ్ఞ తో చెప్పాడు. అతడు వెళ్ళిపోయాడు).
రాజుకి ఈ మాటలేమి రుచించడం లేదు. కళ్ళల్లో నీళ్ళు, ఎలాంటి వాడైనా తన కొడుకు చావుని జీర్ణించుకోలేక పోతున్నాడు.
రాజ గురువు: (Trance లోంచి లేచాడు. రాజు దగ్గరకి వెళ్లి,) రాజా! బాధ పడకు, వీర లక్షణం కాదు. (భుజం తట్టాడు)
మరో వైపు చూస్తూ, హఠాత్తు గా రాజ గురువు కళ్ళు ఎర్రబారాయి.
రాజ గురువు: అయినా, వీరుడై వీర ధర్మాన్ని మరచిన వాడు, మరు క్షణమే చచ్చిన వాడితో సమానం. నీ కొడుకు చావుతో, మన రాజ్యానికి పట్టిన గ్రహణం వీడి పోయింది, అందుకు సంతోషించు! (ఉపదేశించి నిష్క్రమించాడు).
తల దించుకుని ఉన్న రాజు, రాజ గురువు మాటలకి తల పంకించాడు. అది నిజమని తనకి తెలుస్తూనే ఉంది. కాని ఎందుకో తన కొడుకు చావుని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆలోచిస్తున్న రాజు కళ్ళు ఎర్రబారాయి. బాధ, నిస్సహాయత గా, అది ప్రతీకారేచ్చ గా పరిణమించింది.
తన సైన్యం లోంచి, మెరికల్లాంటి యోధులని తనకు తానే ఎంచాడు రాజు. ఒక్కొకడూ ఆరడుగుల పొడవు తో, విశాలమైన ఛాతి, కండలు తిరిగిన దేహంతో ఉన్నారు. తన సైన్యం లో సగం మందిని, ఎవ్వరికీ తెలియకుండా, చివరికి రాజ గురువు కి కూడా చెప్పకుండా, ఎంచాడు రాజు. అప్పుడు సమయం రాత్రి 8 (మన భాష ప్రకారం) కావస్తోంది. తన కొడుకుని చంపినవాడి చావు తనే దగ్గరుండి చూడాలనుకున్నాడు, అందుకే ఎవ్వరికీ చెప్పకుండా తను కూడా ఆ సైన్యం తో బయలుదేరాడు రాజు.
- 5 -
అప్పుడు సమయం తెలతెల వారుతోంది. అర్జున్ కి సడన్ గా మెలకువ వచ్చింది. అతని తో పాటే లేచిన శైలజ,
శైలజ: ఏ.. ఏమైంది అర్జున్!
అర్జున్: (మాట్లాడద్దు అన్నట్టు గా, నోటి మీద వేలు ఉంచి) ఉష్!
పొదల్లోకి చూస్తున్న అర్జున్ కేసి, మళ్ళీ పొదల్లోకి కొంచెం బెరుగ్గా మార్చి మార్చి చూస్తూ, శైలజ
శైలజ: ఎవరైనా ఉన్నారా... (కొంచెం తలెత్తి చూస్తూ) ... అక్కడ?
అర్జున్ ఏమి మాట్లాడకుండా నే ఉన్నాడు. ఒక్క సారిగా, పైకి లేచి, శైలజ ని అమాంతం ఎత్తి, దూరంగా ఉన్న ఒక రాయి చాటున కూర్చోబెట్టాడు. ఆమె ఎవరికీ కనిపించకుండా కింద పడి ఉన్న కొబ్బరాకులు కొన్ని మీద కప్పాడు. శైలజ అక్కడ ఉన్నట్టు ఎవరికీ కనిపించదు కాని, ఆ ఆకుల సందుల్లోంచి శైలజకి అంతా కనిపిస్తూనే ఉంది. తను ఏదో అనబోయి భయంగా ఆగిపోయింది. అప్రయత్నం గా కొంచెం ఆకుల నించి దూరంగా, లోపలకి జరిగింది శైలజ.
శైలజ ని అక్కడ ఉంచి, ఒక్క ఉదుటన వెనక్కి తిరిగాడు అర్జున్. కొంచెం దూరం పెద్ద అంగలతో వెళ్లి, అక్కడ ఇసుకలో పడిఉన్న ఒక పెద్ద డాలు ని తీసాడు, అది నిన్న చనిపోయిన అదుల్య వీరది.
అర్జున్ ఇది చేస్తుండగానే ఆకాశం లో రివ్వున బాణాలు ఎగిసాయి. అర్జున్ ఆ పెద్ద డాలుని పైకి తీసి, round గా గాలిలో తిప్పుతూ తన తల మీద రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆ శరపరంపర, ఆగడంతోటే ఉ౦పకతి లాంటి కొందరు యోధులు, కత్తి డాలుతో ఇంకొందరు వేగంగా పరిగెత్తుకుంటూ అర్జున్ దిశగా వస్తున్నారు. గాలిలో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ వాళ్ళ కేసి చూస్తూ ఒక సారి, శైలజ ఉన్న వైపుకి తిరిగాడు. ఆకుల సందుల్లోంచి చూస్తున్న శైలజ, భయం భయం గా అర్జున్ కేసి చూసింది. ఎందుకో తల కొద్దిగా ఊపింది తను.
అర్జున్ ఇలా చూస్తుండగానే, ఇంకొందరు విలుకాళ్ళు ముందుకి వచ్చారు. వారి వెనక కాగడాలు పట్టుకుని కొందరు కనిపిస్తున్నారు. వారి దగ్గరే ఉన్న రాజు, అశ్వారూడుడై ఉన్నాడు. వీళ్ళందరి ని చూస్తూ, గట్టిగా అరుస్తూ, అర్జున్ కేసి తన కత్తి చూపిస్తూ ఉన్నాడు అతను.
అర్జున్ ఇంకొంచెం ముందుకి వెళ్లి, నేలలో ఉన్న రెండు బరిసెలని తీసాడు, డాలుని కింద పడేస్తూ.యుద్ధం భయంకరం గా జరుగుతోంది. ఇప్పుడు అర్జున్ పూర్తి స్థాయి aggressive గా fight చేస్తున్నాడు, అవును మరి, ఇంతమంది తో యుద్ధం చేస్తూ, ఎవరినీ చంపకుండా ఉంటే కష్టం కదా. అర్జున్ మాత్రం సర్వ శక్తులూ ఒడ్డి పోరాడుతున్నాడు.
యుద్ధం మెల్లగా అర్జున్ వైపు మొగ్గుతోంది, లెక్కకు మిక్కిలి వీరాగ్రేసరులు మరణించారు. తన వద్ద ఉన్న వీరులు, అర్జున్ కేసి వెళ్ళడానికి తటపటాయించడం చూసి, రాజుకి ఎక్కడలేని రోషం వచ్చింది. గుర్రం దిగి, తనంతట తానె, అక్కడ ఉన్న ఇద్దరు వీరులని చంపాడు. పెద్ద పెట్టున పెడబొబ్బ పెడుతూ, అర్జున్ కేసి పరిగెడుతూ వచ్చాడు. అతడిని చూసి అక్కడ ఉన్న వీరులు దారి ఇచ్చి పక్కకి తప్పుకున్నారు.
రాజుతో యుద్ధం జరుగుతోంది. ఇదివరకటి యుద్దాల లాగ లేదు ఇది. ఇద్దరూ, చాలా technique తో fight చేస్తున్నారు. అర్జున్ కి fight లో ఎంత ease ఉందో, ఆ రాజుకి కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరూ ఇలా ఎంత కాలం యుద్ధం చేస్తూ ఉన్నారో తెలియదు, అప్పటికి చాలా సేపు అయ్యింది. అయితే రాజుతో యుద్ధం మొదలు పెట్టినప్పుడు, ఈదురు గాలితో పెద్ద వాన పట్టుకుంది. ఇంచుమించు (మన భాషలో) 11 కావస్తున్నా, గాలి వానకి మబ్బులకి ఎక్కువ light కనిపించడం లేదు. ఏదో ఇదివరలో జరిగిన ప్రళయం తాలూకు సంకేతం లాగ, తుఫాను. హోరు గాలి వీస్తోంది, మెరుపులు ఉరుములు, పిడుగుల ధ్వనులు.
ఇద్దరూ యుద్ధం చేస్తూ, తీరాన్ని దాటి అడవి ప్రాంతం లోపలకి వెళ్లారు. అర్జున్ కి ఏమవుతుందో అని, భయంతో శైలజ కూడా, అటు వైపుగా వెళ్ళింది, మిగిలిన వీరుల కంట్లో పడకుండా ఎలాగో. అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రాంగణం మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. చుట్టూ అన్ని వైపులా కాగడాలు పెట్టి ఉన్నాయి. వెనకగా, ఆటవికుల గుడి అనుకుంటా, ఉంది.
శైలజ కి చాలా ఆశ్చర్యం గా ఉంది. అసలు "ఇతనేనా తను ఇదివరలో చూసిన అర్జున్" అని తనకి చాలా సార్లు అనిపిస్తోంది. అంత ప్రళయ భీకరమైన వాతావరణం లో అస్సలు అదేమీ లేదన్నట్లుగా అర్జున్ fight చెయ్యడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది తనకి. తనకి ఎవరు ఎవరో సరిగ్గా కనిపించడం లేదు కూడా, కళ్ళు చిట్లించుకుని చూస్తోంది. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో, ప్రశాంతమైన అర్జున్ ముఖం శైలజ కి కనిపించి౦ది. అతని ముఖం లోని రాజసం, దర్పం ఆమెకి అప్పుడు పొడగట్టాయి. ఆ మెరుపుల వెలుగులో వెండిలా తళుక్కున మెరిసిన అతని రూపాన్ని అలా చూస్తూ బొమ్మలా ఉండి పోయింది తను.
చివరకి యుద్ధం లో రాజు ఓడిపోయాడు, అలిసిపోయి రొప్పుతూ ఆ ఎత్తైన పీఠం లో ఒక వైపుగా ఉండిపోయాడు. ఇంతలో, చాలా మంది ప్రజలతో రాజ గురువు అక్కడికి చేరుకున్నాడు. వీళ్ళందరినీ చూసి, శైలజ భయంగా, అర్జున్ పక్కకి వచ్చి నిలబడింది. రాజ గురువు జరిగిన దాన్ని అర్ధం చేసుకున్నాడు. అర్జున్ దగ్గరకి వచ్చి,
రాజ గురువు: (తన భాషలో ఏదో అడిగాడు. అర్జున్ కి అర్ధం కాలేదు. అది గమనించి రాజ గురువు) సాదివూ! (దూరం గా ఉన్న సాదివూ ని పిలిచాడు. సాదివూ దగ్గరికి వచ్చాడు. వాడిని మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు రాజ గురువు).
సాదివూ (సహ దేవుడు): (తల దించుకుని, చేతులు కట్టుకుని) సాదివూ! (చెప్పాడు)
రాజ గురువు, అర్జున్ కేసి తిరిగి, ప్రశ్నార్ధకం గా కళ్ళు ఎగరేసాడు.
శైలజ: (అర్జున్ తో, low voice తో) ఏంటి?
అర్జున్: పేరడుగుతున్నారు, (రాజ గురువు కేసి తిరిగి) అర్జున్! (చెప్పాడు)
రాజ గురువు, పేరు వినడం తోటే, తన ప్రజానీకం కేసి తిరిగి, ఏదో announce చేసాడు. ఒక చెయ్యి మంత్ర దండం మీద పెట్టి, ఇంకో చేతితో అర్జున్ కేసి చూపిస్తూ ఏదో చెప్తున్నాడు అతను.
అయితే, ఇదంతా దూరం నించి చూస్తున్న రాజు, ఉండబట్ట లేక పోయాడు. అర్జున్ ని చంపడానికి, వేగం గా తన కత్తి తోటి దూసుకు వచ్చాడు. అర్జున్ తప్పించుకున్నాడు కాని, శైలజ చెయ్యి చీరుకు పోయింది. ఇది చూసి, అక్కడ ప్రజానీకం లో ఒకడు, తన గొడ్డలి తో రాజు ని చంపేసాడు. వాళ్ళ దీవి ఆచారం ప్రకారం, రాజు ని యుద్ధం లో ఓడించిన వాడికి, రాజు తన రాజ్యాన్ని అప్పగించాలి. ఇది చెయ్యకపోగా, దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన రాజుని, ఆ దీవి ఆటవికులు చంపేశారు.
ఇంతలో ప్రజ తో ఏదో మాట్లాడుతున్న రాజ గురువు,
రాజ గురువు: అర్జున, వీరార్జున! (అర్జున్ కేసి చూపిస్తూ అన్నాడు).
అర్జున్ నివ్వెరపోయాడు.ఆ దీవి ఆచారం ప్రకారం, వాళ్లకి ఇప్పుడు అర్జునే రాజు. ఆ కాగడాల వెలుగులో, అశేషమైన ప్రజానీకం అర్జున్ కి మోకరిల్లింది.
-- (సశేషం) --