Saturday, December 28, 2013

అర్జునుడు - XII

చేపలలో చేపలా ఈదుతున్నాడు అర్జున్. అతనికి చెయ్యవలసినది తెలుస్తోంది. తాను అర్జునుడినే అని పూర్తిగా నమ్మాడు ఇప్పుడు.

ఈదుతూ ఒక దీవిని చేరుకున్నాడు. ఆ దీవి నిండా ఆర్మీ ఉంది. అర్జున్ ఇంకా నీళ్ళల్లోనే ఉన్నాడు. అక్కడే దగ్గరలో నేల మీద తిరుగుతున్న ఒక సోల్జర్ ని కాలు పట్టుకుని నీళ్ళల్లో ముంచి చంపివేశాడు అర్జున్. అతని బట్టల్లో పైకి లేచి, లోపలకి భవనం వైపుగా వెళ్తున్నాడు అర్జున్. వెళ్తూ అక్కడి పరిస్థితిని అంతా చూస్తున్నాడు. ఎత్తైన compound wall, పైన వైర్ ఫెన్సు, మొత్తం అంతటికీ ఒకటే ఎత్తైన entrance. మిలిటరీ స్టైలు లో అంతా కాంక్రీట్ తో కట్టి ఉంది ఆ ప్లేస్ అంతా.

ఒక్కొక్కరినీ చంపుతూ లోపలకి వెళ్తున్నాడు అర్జున్. లోపల ఎత్తైన ఫ్లోర్ లోని రూం లో కూర్చుని ఇది చూస్తున్నాడు రఘునాథ్, ఇంటర్కం టీవీ లో వస్తోంది ఇది అంతా. నవ్వుతూ, ఎవరికో ఇంటర్కం ఫోన్ చేసాడు అతను. అర్జున్ ఒక ఎత్తైన ద్వారం వద్దకి రాగానే, ద్వారం దాటి ముందుకి వచ్చారు, రెండు files లో ఉన్న కొన్ని వందల మంది గన్ soldiers, అర్జున్ కి ఎదురుగా. ద్వారం పైన ఉన్న TV లో రఘునాథ్ వచ్చాడు.

రఘునాథ్: (అర్జున్ కేసి చూస్తూ...) ఏరా, వీల్లెవరో తెలుసా, మూడు వందల మంది, ఏదో పెద్ద వీరుడివట గదా? గన్స్ తోనే కాదు, ఫెన్సింగ్ ఇంకా చాలా వాటిల్లో experts వీళ్ళు. ఎరా, చచ్చి పోతావు కదరా... (నవ్వుతూ అన్నాడు). (ఈ సారి సీరియస్ గా...) రేయ్ ..., కాకమ్మ కధలు చెబితే వినడానికి నేనేమయినా కోయాడ్ని అనుకున్నావు రా... ఆర్జునుడివట..., ఏ యుద్ధం లో అయినా గెలుపు తెచ్చే విజయుడివట. (వాయిస్ పెంచుతూ...) దమ్ముంటే వీల్లని దాటి ముందుకి రారా, దమ్ముంటే, రేయ్. (తన సోల్జర్స్ కేసి చూసి ...) బాయ్స్, ఫినిష్ హిం ఆఫ్! (Intercom  కనెక్షన్ కట్ అయ్యింది).

ఈ సారి సోల్జర్స్, గన్నులు వదిలి స్వొర్ద్స్ పట్టుకున్నారు. మూడు వందలమంది ఒకే సారి అర్జున్ మీదకి లంఘించారు. అర్జున్ ఒక్క సారి కళ్ళు మూసుకున్నాడు. అద్వితీయమైన వేగం తో కదులుతూ, వాళ్ళని ఒక్కొక్కరుగా చంపేసాడు అర్జున్. ఇప్పుడు కళ్ళు తెరిచాడు అతను. ఒక్కొక్కరినీ చంపుతూ రఘునాథ్ ఛాంబర్ లోకి ఇంచుమించుగా వచ్చేసాడు. రఘునాథ్ కి ఏమి చెయ్యాలో తెలియడం లేదు, చెమటలు పడుతున్నాయి అతనికి.

ఛాంబర్ లోకి వచ్చే లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ దిగగానే ఒక 20 మంది సైనికులు, లిఫ్ట్ ఓపెన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు గన్స్ తొ. లిఫ్ట్ ఓపెన్ అయ్యిన్ది. గన్స్ తో మొత్తం అంతా జల్లెడ పట్టినట్టు, కాల్చారు. తన శరీరానికి తగిలిన బుల్లెట్లని చేతితో తీసేస్తూ వచ్చాడు అర్జున్ ముందుకి. ఈ లోపులో ఒక రెండు boomerangs ప్రయోగించి అందరినీ చంపాడు అర్జున్. ఒక టేబుల్ వెనకాల నక్కిన రఘునాథ్, ఇప్పుడే అర్జున్ ని ఒక సారి చూసాడు.

వచ్చి రఘునాథ్ కి ముందు కూర్చున్నాడు అర్జున్. రఘునాథ్ టేబుల్ మీద క్యూబన్ చిగార్స్ పెద్దవి ఉన్నాయి. వాటిల్లో ఒకటి తీసుకుని, అర్జున్.

అర్జున్: అలవాటుందా, చాలా బావుంటాయట కదా! (ఒకటి తీసి వెలిగించాడు. పీలుస్తూ, ఏదో చెప్తూండగా ...).

రఘునాథ్: చూడు, నువ్వెవరో నాకు తెలీదు. కాని definite గా ఒక spy network నించి వచ్చి ఉంటావు. నువ్వు నన్ను వదిలేస్తే, నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నీకు ఏమి కావాలి? పోనీ ఇండియా ని నీ కింద ఉంచుకుంటావా? ఆ? నీ దేశం కదా?

ఇది చెప్తున్నంత సేపూ, అర్జున్ రఘునాథ్ కేసి తీక్షణం గా చూస్తున్నాడు. చెప్పడం అయిపోగానే, అతని కేసి ఆపు చేసి, వెనకాల ఉన్న బోర్డు  కేసి చూసాడు అర్జున్.

అర్జున్: Approach కరక్టే, కాని చిన్న తప్పు ఉంది. (బోర్డు  మీద ఉన్న equation కేసి చూస్తూ అన్నాడు అర్జున్).

రఘునాథ్: (ఒక సారి, అర్జున్ కేసి చూసాడు, మళ్ళీ అతను చూపించిన వైపు బోర్డు కేసి చూసాడు, మళ్ళీ అర్జున్ కేసి చూస్తూ ...) ఏ ... ఏంటి? (కొంచెం చిరాగ్గా అన్నాడు  రఘునాథ్).

అర్జున్: (లేచి వెళ్లి బోర్డు దగ్గరి chalk piece తీసాడు అర్జున్. కొంత పార్టు ఎరేస్ చేసి ..., టర్మ్స్ re-group చేసాడు. చివరికి, Schroedinger wave equation తో ముగించాడు. Proof కంప్లీట్ అయ్యింది).

ఇది చూస్తున్న రఘునాథ్ ...

రఘునాథ్: హ ... హహ ... అయ్యిపోయింది .... ప్రూఫ్ అయ్యిపోయింది .... మై గాడ్ .... ఆహా హ్హా హా ... అయ్యిపొయింది.

రఘునాథ్: మై గాడ్, it is unbelievable! (అర్జున్ కేసి తిరిగి ...) ఒరేయ్, ఇరవై అయిదు సంవత్సరాల నించి ఒడ్డున పడ్డ చేప పిల్ల లా కొట్టుకుంటున్నాను రా ... ఎలా చేసావు రా ... (ఇహ లోకం లోకి ఇప్పుడు వచ్చాడు రఘునాథ్. అర్జున్ తో తనే మళ్ళీ ...) నువ్వెవడివి రా... ను .. ను .. నువ్వు ... మనిషివా? దేవుడివా... రాక్షసుడివా (ఈ సారి గొంతు పెంచి ...) ఎవరు  నువ్వు?

అర్జున్: I am a Demi God! పాండవులలో మూడవ వాడిని, ఇంద్ర దేవుని పుత్రుడిని, ప్రపంచానికొక్కడే
వీరుడిని, (ఈ సారి గొంతు పెంచి ...) అర్జునుడ్ని.

రఘునాథ్: (coat లోనించి గన్ను బయటకి తీస్తూ, గట్టిగా...) Nonsense. 

రఘునాథ్ తీసిన గన్ ని ఎడం కాలితో కుడి వైపుకి తన్నాడు ఆర్జున్. ఫైట్ లో ఈజీ గా defeat చేసాడు అతన్ని అర్జున్. తనని గన్ తో చంపబోతున్న అర్జున్ తో, రఘునాథ్...

రఘునాథ్: ప్లీజ్ నన్ను వదిలేయ్ ... (మళ్ళీ గట్టిగా...) ముందు అటు చూడరా రేయ్ ... (కుడి వైపుకి చూపించాడు).
(ఒక స్టీల్ తో చేసిన గది ఒకటి ఉంది అక్కడ). Titanium తో మీటరు మందం తో చేసిన గది రా అది. అందులో ఇవాల్టి target దేశాల కోసం మిస్సైల్ consoles ఉన్నాయి. అందులో నీ దేశం India  కూడా ఉంది. దాని డోర్ లాక్ ఎవరి వల్లా ఇంక తెరుచుకోదు (ఒక బటన్ నొక్కి, వెకిలి నవ్వు నవ్వుతూ ఉన్నాడు).

ఈ మాటలు వింటూనే రఘునాథ్ కాలర్ వదిలాడు అర్జున్.

రఘునాథ్:  ఇంకా రెండు నిమిషాలే ఉంది (వెకిలి నవ్వు ఆపి పరుగు లంకించాడు రఘునాథ్).

అర్జున్ ఆలోచనలో పడ్డాడు.

రఘునాథ్ తో పాటు ఒక డజను మంది philippines మిలిటరీ అధికారులు, ఆ దీవి వదిలి కొంచెం దూరంలో ఉన్న ఇంకో దీవిలోకి బోట్లో బయలుదేరారు.

అర్జున్ ఆలోచన లోనించి బయటికి వచ్చాడు. అర్జున్ analysis ప్రకారం ఈ కింది విషయాలు గమనించాడు.

1. ఈ దీవె రఘునాథ్ పరిశోధనలు చేసిన దీవి. (తను వచ్చే దారిలో, గ్లాస్ డోర్స్ వెనకాల laboratories  ఉండటం చూసాడు).
2. అంటే, తన దీవిలో ఉన్న మెటల్ ఈటింగ్ bacteria ఈ బిల్డింగ్ లోనే ఎక్కడో ఉండాలి.
3. ఆ బాక్టీరియా ని వదిలితే, టైటానియం గదిని తిని, టైం లో మిస్సైల్ consoles చేరుకునేందుకు అవకాశం ఉంది.

ఇక ఆలస్యం చెయ్యకుండా బిల్డింగ్ అంతా గన్స్ తో కాల్చడం మొదలు పెట్టాడు అర్జున్. ఇష్టం వచ్చిన చోటు బిల్డింగ్ అంతా కాలుస్తూనే ఉన్నాడు. తర్వాత, Flame Thrower guns యూజ్ చేసి, మొత్తం అంతా నిప్పు పెట్టాడు. అంత నిప్పు మధ్యలో, titanium రూం పక్కన పద్మాసనం వేసుకుని, ధ్యానం చెయ్యడం మొదలు పెట్టాడు అర్జున్.

రఘునాథ్: (బోటు లో వెళ్తూ...) నిప్పుతో కాలదు రా అది (వెకిలి నవ్వు నవ్వుతూ...)

Cold Storage లో ఉన్న ఆ bacteria ఈ నిప్పు వేడికి, ఐస్ కరిగి బయట పడింది. తీవ్రమైన వేడిలో ఉన్నాడు అర్జున్. బిల్డింగ్ అంతా కొద్ది సేపట్లో కరగడం మొదలు పెట్టింది. తన టైటానియం రూం కరగడం మొదలు పెట్ట గానే లేచాడు అర్జున్.

అగ్ని స్నానాలు చేసిన వాడిలా లేచాడు ఆర్జున్. తనకు పట్టిన చెమట విదిలించి, కరక్ట్ టైములో, ఆల్రెడీ కరిగిపోతున్న console లో access చేసి, బటన్స్ నొక్కి ఆఫ్ చేసాడు అర్జున్.

ఇక్కడ బోటులో వెళ్తున్న రఘునాథ్ తన చేతి వాచ్ చూసుకుని, కరక్ట్ టైం లో ఏమి అవ్వకపోవడం తో disappoint అయ్యాడు.

అవతలి ఒడ్డు కి చేరుకున్నారు రఘునాథ్ అండ్ పార్టి. తీరం లోని ఇసకలో పరిగెట్టడం మొదలు పెట్టారు.

ఇవతల వైపు హెలిపాడ్ (ఎత్తైన ప్రదేశం) లోకి వచ్చాడు అర్జున్. వెనకాల నిప్పుల్లో బిల్డింగ్. అర్జున్ చేతిలో విల్లు బాణాలు.

తనతో పరిగెడుతున్న ఇద్దరు అధికారులు బాణాలకి ఒరగడం చూసాడు రఘునాథ్. తీవ్రం గా పరుగు పెట్టడం మొదలెట్టాడు రఘునాథ్. ఇంకొంచెం సేపట్లో చెట్లున్న ప్లేస్ లోకి వెళ్ళాడు రఘునాథ్. తమని చూడటానికి చెట్లు అడ్డం కాబట్టి, తమని చంపలేడని రఘునాథ్ వెకిలి నవ్వు మొదలెట్టాడు.

అర్జున్ చేతిలోని విల్లు బాణాలు చూసుకున్నాడు. కళ్ళు మూసుకుని, ఒక angle లో పైకి ఎత్తి, ఎడమ వైపు గా ఎక్కు పెట్టి బాణం వదిలాడు అర్జున్. తర్వాత, కళ్ళు తెరిచాడు. అతని మొహంలో చిన్న నవ్వు.

తన తో వచ్చిన వాళ్ళు చెట్ల మధ్యలో బాణాలకు బలి కావడం చూసి నమ్మ లేనట్టు తల ఊపాడు రఘునాథ్, అతని నవ్వు ఒక క్షణం ఏడుపు గా మారింది.

తనతో వచ్చిన వాళ్ళందరూ, చనిపొయారు. కొంచెం దూరం పరిగెత్తిన రఘునాథ్ ఒక ఇసుక ప్రదేశం లోనికి వచ్చాడు. అక్కడ కొంచెం దూరం లో ఒక బంకర్ (భూ గృహం) ఉంది. అటుగా పరిగెత్తాడు రఘునాథ్. కొంచెం దూరం పరిగెత్తి, దాని తలుపు తీసాడు.

మరు క్షణం, మెట్ల మీదుగా వెళ్తున్నాడు రఘునాథ్. మెట్లు దిగి, ఒక చోటికి చేరాడు. తన పరుగు ఆపి, నిశ్చింత గా ఊపిరి తీసుకున్నాడు రఘునాథ్. మరు క్షణం ఏడుపు మొదలెట్టాడు. తన కళ్ళు మూసిన రఘునాథ్ కి ఒక దృశ్యం కనిపించింది. తను బంకర్ డోర్, తీసిన క్షణం ఒక బాణం తన కడుపులోనికి దిగడం చూసాడు రఘునాథ్.

తన పొట్ట లో దిగిన బాణం కేసి చూసుకుని ఏడుపు మొదలు పెట్టాడు రఘునాథ్. కొద్ది సేపటి లో చనిపోయాడు ఆ ప్రపంచ పాలకుడు.

విల్లు బాణాలతో నిలబడిన అర్జున్ ఒక చిన్న ఊపిరి పీల్చాడు. కళ్ళు తెరచిన అతనికి, ఎదురుగా హెలికాప్టర్ లో అతని కేసి చూపిస్తున్న శైలజ కనిపించింది. చెయ్యి ఊపడం మొదలు పెట్టింది శైలజ, అర్జున్ కేసి చూపిస్తూ, రెండో చేతితో. హెలికాప్టర్ పైలట్ తో ఏవో మాట్లాడుతోంది తను. సమయం తెల తెల వారుతోంది.

SWAT టీం కొంత మంది, Ambulance తో కొందరు, హెలికాప్టర్స్, బోట్స్ నించి దిగారు. చెమట తో తడిసిన, అర్జున్ చుట్టూ wet towels కప్పారు, అర్జున్ కూలబడ్డాడు. ఇదంతా టీవిలో ఆశ్చర్యం గా చూస్తున్నారు రాజీవ్ వాళ్ళు.

-- 2--

శంషాబాద్ విమానాశ్రయం లో దిగారు అర్జున్, శైలజ. వాళ్ళని చుట్టూ ముట్టిన మీడియా లోంచి, ఒక వైపు గా వెళ్ళాడు అర్జున్. అక్కడ ఆడ వేషం లో ఉన్నాడు రాజీవ్.

అతని వైపు వెళ్తూంటే, మీడియా ని కవర్ చేసింది శైలజ. మీసం తో ఆడ వేషం లో ఉన్న రాజీవ్ ని పట్టుకున్నాడు అర్జున్.

రాజీవ్: ఏమి లేదు రా, కళ్ళ జోడు నీకు లేదు కదా, కనబడుతుందో లేదో అని చిన్న test.

రాజీవ్: (తనని చిన్న గా కొట్ట బోతున్న అర్జున్ తో...) వద్దు రా మహా వీర! కొట్టద్దురా!

విమానాశ్రయం నించి బయటకి వచ్చిన అర్జున్ ని, తమ భుజాల మీద మొయ్యడం మొదలు పెట్టారు రాజీవ్ తో వచ్చిన అతని friends. పక్కగా శైలజ నడవడం మొదలు పెట్టింది.

-- (సమాప్తం) --

5 comments:

  1. మీ బ్లాగు చాలా బావుంది.


    మీకు వీలున్నప్పుడు ఒకసారి మా బ్లాగ్ చూడండి

    ధన్యవాదాలు,

    http://techwaves4u.blogspot.in/

    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
  2. Very Nice, Every Month I am visiting the website for next part. You have stopped the serial for the last 2 months. Please go ahead.
    gurugopal

    ReplyDelete