Thursday, June 30, 2011

మన తెలుగు కధలు

నమస్కార౦, Good Morning!

       స్వతహాగా ఒక Writer ఐన నాకు ఒక కొత్త తరహాగా నా కధలు అందరికి చెప్పాలనిపించింది. అందుకే ఈ ప్రయత్నం. కొన్ని కొన్ని కధలు, అంటే నేను చెప్పడం కాదు కానీ, అద్భుతమైనవి, చాల కొత్తవీను. అవి చదివిన తర్వాత మీకు definite గా నచ్చుతాయని నా ప్రగాఢ విశ్వాసం. అసలు కొన్ని కధలయితే మీకు ఒక సినిమా చూసినట్టు ఉంటాయని నా నమ్మకం. ఇక మొదలు పెడదామా! 

     మొదటి కధ పేరు "అర్జునుడు".



Thursday, December 2, 2010

Serial Killers - III

    ఎట్టకేలకి T. V. S. శాస్త్రి (ఉరఫ్ TV శాస్త్రి) అతని శిష్యుడు ముత్యాల రెడ్డి ఇంటిలో ప్రవేశించారు. గురూజీ డ్రాయింగు రూమే తనకి ఉండటానికి కావాలన్నారు. చివరికి, మార్పులు చేసి, దాని పైని గది ఆయనికి, శిష్యుడికి ఇవ్వడం జరిగింది. గురూజీ చాలా గణించి, ముత్యాలకి "ఆల్ ద బెస్ట్, proceed" చెప్పడం జరిగింది.

వచ్చిన అయ్యవార్లని, మొదటి రోజే నాయక్ తగులుకున్నాడు. శిష్య పరమాణువు తోటి,

నాయక్: గురువు గారు?
శిష్యుడు: (తన కేసి చూసి మాట్లాడుతున్న నాయక్ కేసి చూసి, తన వెనకాల చూసుకుంటూ, ఎవరూ లేకపోవడంతో, మళ్ళీ నాయక్ ని ఎగా దిగా చూసి) గురువు గారు ఇక్కడ లేరుగా! (ఇలా అని, ముందుకి వెళ్ళబోయాడు)
నాయక్: నేను అనేది మీ గురించే అయ్యవారూ!
శిష్యుడు: ఇదిగో బాబు, గురూజీ అంటే ఆయన (దూరంగా ముత్యాలతో మాట్లాడుతున్న గురువు గారిని చూపించి), నేను ఆయన శిష్యుడిని.
నాయక్: తప్పయ్యింది లే గాని అయ్యవారూ, ఇంతకీ మీరు ఈ ఊర్లోనే ఉంటారా?
శిష్యుడు: (కొంచెం స్వరం పెంచి) మేము ఇక్కడెందుకు ఉంటాం? మాది అమలాపురం.

-- 2 --
శిష్యుడు ఏదో అవసరం వచ్చి కిందకి వచ్చి వెతుకుతున్న గురువు గారికి, నాయక్ తో మాట్లాడుతున్న శిష్యుడు కనిపించాడు.

శిష్యుడు: అబ్బే, ఇది గురూజీ TVS కాదు, ఆయన వియ్యంకుడిది, ఆయన ఇక్కడేగా ఉంటాడు.
నాయక్: .....
శిష్యుడు: ఆయన్ని ఇప్పుడు TVS శాస్త్రి అని పిలవడం లేదు, ఆయన TVS అమ్మేసారు గా!
నాయక్: ...
శిష్యుడు: అబ్బే, ... (ఇంకా ఏదో చెప్పబోతున్నాడు)
ఇంతలో గట్టి గట్టి గా మాట్లాడుతున్న శిష్యుడి జబ్బ దొరకబుచ్చుకుని,

గురూజీ: ఉరేయ్, ఉరేయ్, ఉరేయ్ శు౦ఠా! ఊరు మారావు కదా అని  ఏమిటీ అపచారం? దరిద్రుడా, దరిద్రుడాని!?
శిష్యుడు: (నాయక్ తో...) కాస్త ఉండు (చెయ్యి చూపించాడు. గురువు గారి కేసి తిరిగి ..., ఉత్తరీయం సవరించుకుంటూ, దీర్ఘం తీస్తూ...) ఏమిటండీ!? (ఈ లోపులో అక్కడినించి నాయక్ ఉడాయించాడు).

TV శాస్త్రి: (లో వాయిస్ లో) ఉరేయ్ తలకి మాసిన వెధవాని, ఇలా ఎవడుబడితే వాడితో మాట్లాడితే నాలిక మీద వాక్సుద్ధి నిలబడద్దు రా? (ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తున్న శిష్యుడి తో ..., ఈ మాటు గట్టిగా) పద, సంధ్య వార్చుదువు గాని.

-- 3 --
వీళ్ళు వచ్చిన రెండు రోజులకి అనుకుంటా, "మొదలు లేని కధ" రచయిత సిఫార్సు చేసిన కుర్ర రచయిత వచ్చాడు. పాపం ఆయనకి ఖాళీ లేదట అందుకే ఇతనైనా బానే ఉంటుందని, ఇతన్ని పంపించారు. ముతక గోధుమ రంగు లాల్చి, తెల్ల  పాంటు వేసుకుని, అవే కార్బను ఫ్రేము కళ్ళద్దాలతో భుజానికి సంచీతో విచ్చేసాడు అతను. ఇంకా ఏమిటంటే, బుగ్గన కిళ్ళీ కూడా ఉంది.

కుర్ర రచయిత: వణక్కం (చేతులు జోడించి కొద్దిగా వంగి నమస్కరించాడు).

ముత్యాలు నమస్కారం పెట్టి కూర్చోమన్నాడు.

కుర్ర రచయిత: నాన్ బయిసిగాల్లీ (basically) ఒండు, కేరళ్ ఇంద. నన్ పేయెరు, మన్నవుజ్ (మనోజ్), తెంబి (తంబి) పెరియబాకరన్ (ప్రభాకరన్). నన్నింద ఫిల్మ్ ఇండస్స్త్రిల్లు తెంబి పేయెరు. (చాలా సార్లు బుర్ర పైకి కిందకీ ఊపుతూ చెప్తున్నాడు).

ఇంతలో ముత్యాల సెగట్రీ,

సెగట్రీ: తనని "తంబీ" అని పిలవమంటున్నాడు. (అయోమయం గా చూస్తున్న ముత్యాలు, గురూజీ తదితరులకి clarify చేసాడు).

తంబి: ఉ.. ఉ.. ఉ.. ఉ.. (నాలుగు సార్లు తల ఊపుతూ చెప్పాడు).

కొంచెం సేపు ఆ సీన్లో అందరూ అలాగే ఉండిపోయారు. ముందుగా తేరుకున్న ముత్యాలు,

ముత్యాలు: సర్లే గాని తంబీ, ఇప్పుడు మనం తీసే సీరియల్లు, (కళ్ళు పైకెత్తి తంబి కళ్ళల్లోకి చూసిన ముత్యాలకి అనుమానం వచ్చింది), మీకు తెలుగు తెలుసు కదా?

తంబి: స్వళ్ళపం ( వేళ్ళతో indicate చేసాడు. తల ఊపుతూ, continue చేయ్యమన్నట్టు చెయ్యి తిప్పాడు).

ముత్యాలు: మనం తీసే సీరియల్లు, పది వేల ఎపిసోడులు ఉండాలప్పా. మొదలు లేని కధకి ఎన్ని అవార్డులు, డబ్బులు వచ్చినయ్యో మనకి ఇంకా ఎక్కువ రావాల, ఏంటి? (తంబి మళ్ళీ తల ఊపాడు).

తంబి: (తలకాయి ఊపడం ఆప్చేసి) బయిసిగాల్లి ఒండు, స్తోయేరిన (స్టొరీ) మేళ్ళు (మలయాళం లోనా), ఊర్ (Or) తెలింగు (తెలుగు లోనా)? (Clarity  కోసమని మొట్ట మొదటి డవుటు అడిగాడు తంబి).

ముత్యం: (గురూగారి కేసి చూసాడు, గురూజీ తల అడ్డం గా ఊపాడు. ముత్యం తంబి కేసి తిరిగి ...) తెలుగు లో (చెప్పాడు).

ఆ ఈవినింగ్ చర్చలు ముగిసాక స్టోరీ ఒక రకం గా ఫైనలైజ్ అయ్యింది. ఇండస్త్రీ లో పేరున్న చక్రవర్తి హీరో గాను, దమయంతి హీరోయిన్ గాను settle అయ్యారు. మిగిలిన వాళ్ళని ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. స్టొరీ sittings లో తనని కూడా involve  చెయ్యాలన్నారు గురూజీ, ముత్యం "ఎంత మాట" అని ఒప్పేసుకోవడం జరిగింది. మొత్తానికి, పూర్వ రంగం సిద్ధం అయ్యింది.
(సశేషం)














Wednesday, December 1, 2010

Serial Killers - II

    మైను గేటు కే ముందరగా ముత్యం తో బాటుగా రౌడీగాళ్ళు అందరూ నించున్నారు, హారతి పళ్ళెం తోటి ఒకర్ని, గుమ్మిడి కాయతో ఇంకొకర్ని పెట్టించాడు ముత్యం అక్కడే, దండ పట్టుకుని ఇంకో అమ్మాయి నించుంది. అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.
    ఒక TVS లూనా మీద ఇద్దరు అయ్యవార్లు (బ్రాహ్మలు) sight అయ్యారు. అస్సలు ఎవ్వరూ లేని వీధి మలుపులోనించి అతి స్లో గా TVS, ఒక భయంకరమైన రొద చేసుకుంటూ వస్తోంది. చూడగానే వెనకాల కూర్చున్న ఒకాయన చెయ్యి ఊపాడు. Tension గా వెయిట్ చేస్తున్న ముత్యం మొహంలో నవ్వు, ముత్యం తిరిగి చెయ్యి ఊపాడు. గేటు తీసుకుని ముందుకు కదిలాడు ముత్యం, వెనకాలే ఈ గణమంతా కదిలింది. ఇందాకా తన గురువు గారు చెయ్యి ఊపినందుకు బాలన్సు తప్పినట్టుంది, బండిని సరి చెయ్యడంలో ఉన్నాడు ముందున్న శిష్యుడు.
అన్నట్టు చెప్పడం మరిచాను, మన ముత్యానికి గురూజీ ఒకాయన ఉన్నాడు. జాతకాల్లోను, వాస్తులోనూ అతన్ని మించిన వాళ్ళు లేరట.
ఆయన చెప్పినట్టు చేసే ఇంత వాడినయ్యానని అంటూ ఉంటాడు ముత్యం ఎప్పుడూను. ఈ వస్తున్నాయన వాస్తు విశారద, శరభేశ్వర శర్మనీ, ఆయనే. ఆయనా ఆయన శిష్యుడూను.

Continuous గా శిష్యుడికి instructions ఇస్తున్న శర్మ గారు, ఎందుకో బండిని ఆపారు. డ్రైవ్ చెయ్యడం ఆపి, బండిని కాళ్ళతో ఆన్చి, తల వంచి శిష్యుడు గురువు గారికి table లాగా వీపుని సెట్ చేసాడు. గురూజీ, సంచీ లోంచి ఒక book బయటకి తీసి, నాలిక తడితో పేజీలు తిప్పుతూ, ఏవో calculate చేస్తున్నాడు. Sudden గా గురూగారు, చేతితో శిష్యుడి వీపుమీద తట్టి, చెయ్యి ఊపారు, వెనక్కి తిప్పమన్నట్టుగా. శిష్యుడు ఏదో అంటూ స్టార్ట్ చేసేసాడు వెనక్కి తిప్పడం. వాళ్ళ ఇద్దరి chatter మళ్ళీ మొదలైంది, watch చూసుకుంటూ గురూగారు, పెదాలు లోపలికి పోనిచ్చి తల ఊపుతున్నాడు. నడుస్తూ ఆయన కేసి వస్తున్న ముత్యం అండ్ కో, పరుగు start చేశారు, కాని అయ్యవార్లు అందలేదు.




గురూజీ తన శిష్యుడితో వెళ్తున్నాడు, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే సింహ ద్వారం నించి ప్రవేశించడం వాస్తు ప్రకారం మంచిది కాదట, అందుటే టైం మించిపోకుండా back gate నించి attack ఇస్తున్నారు శర్మ గారు.

గురూగారు: ఉరేయ్ శు౦ఠా, పోనియ్యవేమిరా? 
శిష్యుడు: ఉండండి గురూగారు, ఎదురుగుండా red light కనిపిస్తోంది కదా, పోనీమంటారే?

గురూజీ: ఉంటె ఉండనీ రా, మనల్ని ఏమి చేసింది, పోనీ!

శిష్యుడు: ఇదేమి మన అమలాపురం కాదు, పోలీసాడు పట్టుకుంటే?

గురూజీ: ఎం పట్టుకోడు లేరా, వాడి ఇదిలో వాడుంటాడు, పోనిచ్చేయ్
(శిష్యుడు ఇంక తప్పదన్నట్టు పోనిచ్చాడు. అసలే ఆ silence లో పెద్ద రొద చేసుకుంటూ బండి, పోలీసు కంట పడనే పడింది. దగ్గరగా వచ్చి లాఠీ అడ్డం పెట్టాడు. శిష్యుడు ఇంక ఆపు చెయ్యబోయాడు కాని, గురూజీ పడనివ్వలేదు. బండి ఒక turn ఇచ్చి దూరం గా వెళ్ళిపోయింది). పోలీసాడు whistle వేసాడు, ఎందుకో వాడూ ఫాలో చెయ్యడానికి పెద్ద బండి వేసుకుని బయల్దేరాడు.
శిష్యుడు: చెప్తే విన్నారు కారు, చూడండి వెనకాలే వస్తున్నాడు, జైల్లో పెడతాడో ఏమో, గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారు! 

గురూగారు ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు. 

గురూగారు: పోనియ్యవేమిరా, వెనకాల ఆ దరిద్రుడు వస్తున్నాడూ! (దీర్ఘం తీసాడు)

శిష్యుడు: (తనలో) కాస్త స్పీడు గా వెళ్ళకపోతే ఎం పుట్టి మునుగుతుంది, చాదస్తం! 

ఇంతలో, చూసుకోకుండా lorry ఒకటి అడ్డం వచ్చింది, అసలే ఆ ప్లేస్ అంతా ఎత్తులు పల్లాలు కాబట్టి, వీళ్ళు పక్కకి తప్పిస్తే, అక్కడే under construction లో ఉన్న ఒక బిల్డింగ్ కోసం తవ్విన గోతుల్లోకి పడిపోయారు. 
శిష్యుడు: ఎక్కడున్నారు గురూగారూ! 
గురూజీ: ఇక్కడే రా, (ఒక చెయ్యి దుమ్ము కొట్టుకుపోయి౦ది పైకి లేచింది)! 

శిష్యుడు ఎలాగో ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. ఇద్దరూ కాస్త స్థిమితపడ్డారు. శిష్యుడు కొంచెం కాళ్ళు చేతులు సాగదీస్తూ ఉండగానే, గురూజీ, TVS repair మొదలెట్టాడు. నాలిక తడి చేసుకుంటూ, ఏదో వైర్లు లాగుతూ పీకుతూ గురూజీ repair చేస్తున్నాడు.

శిష్యుడు: మీ చాదస్తం గాని, అదింక పని చేస్తుందా! 

- 3 - 
కాళ్ళతో తోసుకుంటూ శిష్యుడు, driver సీటు మీద కూర్చుని ఉన్నాడు. వెనకాల గురూజీ మామూలే. Ups downs నించి భారంగా నెట్టుకొస్తున్నాడు శిష్యుడు. 

గురూజీ: ఐతే మాత్రం, ఖరీదైన వస్తువ! పారేస్తామట్రా! (కొంచెం కోపంగా అన్నాడు).
శిష్యుడు: (తనలో) ఖరీదైన వస్తువా? దీన్ని నన్ను, నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి ఎవడూ కొనడు. అయినా ఎన్ని సెకండు హా౦డులు మారితే వచ్చిందిది, అశోకుడి కాలంనాటి బండి. 

డౌన్ లోకి speed గా వెళ్ళిపోతోంది బండి. Break ఎలాగు fail అయ్యింది, కాళ్ళడ్డం పెట్టి ఆపాలంతే. ఎందుకో ఇంత down లోకి శిష్యుడికి కాళ్ళు ఆనడం లేదు. ఇక కిందకి చివరకి వచ్చేసామనగా, ఎక్కడినించో ఒక సాయబు, మేకల మందతో సడన్గా ఊడిపడ్డాడు. 

బండి ఈ సారి ఒక బలిష్టమైన మేకపోతుని target చేసింది.

సాయబు: (హిందీ లో) అరె ఓ, క్యా కర్రా రే...?

గురూజీ, శిష్యుడు తర్జన భర్జన్లు పడుతున్నారు.


గురూజీ: ఉరేయ్, వాడేదో హిందీలో దంచేస్తున్నాడు, తెలీదంటే ఇష్టమొచ్చినట్టు వాగుతాడు. ఇప్పుడెలా?

శిష్యుడు: మై హూ నా! (అభయం ఇచ్చాడు.)

గురూజీ: అలా ఐతే ఒకే! (మనసులో) వీడెప్పుడు నేర్చుకున్నాడు చెప్మా హిందీ?

శిష్యుడు: దేఖియే భై సాబ్! (వాక్ప్రవాహం లా హిందీలో తిడుతున్న సాయిబు ఆగిపోయాడు). ఇస్ మే హమారా కోయి కసూర్ నహీ హై! (Explain చేసాడు). (ఏంటన్నట్టు సాయిబు కళ్లెగరేసాడు). దర్ అసల్ మై ఆప్కో ఏ బతానా చాహూ కి ... (శిష్యుడు ఆగిపోయాడు).

గురూజీ: మన వాడు హిందీ ఆదరగొడుతున్నాడు సుమీ!

సినిమాల్లో చూపించినట్టు మెల్లగా అంగలేసుకుంటూ, మెల్లగా modulation లో చెప్తున్నాడు శిష్యుడు.
నడుస్తూ నడుస్తూ ఇంచుమించు సాయబాడి దగ్గరకంటా వచ్చేసాడు. పొడుగ్గా ఉన్న ఆ సాయబు గాడి గెడ్డం ముక్కుకి తగుల్తోంది. Walking తో బాటుగా ఎం చెప్పాలో కూడా ఐపోయింది శిష్యుడికి.

- 4 -

శిష్యుడు: హమారా గురూజీ అమలాపూర్ మే బహుత్ బడే హై! హమారా గురూజీ శ్రాద్ద్ కర్తే హై, పిండ్ పెడ్తే హై! (ఆవేశం గా ముగించాడు శిష్యుడు. వచ్చిన హిందీ, చెప్పాల్సినది అంతా ఐపోయాయి. రొప్పుతూ ఉండి పోయాడు).

సాయబు: అరె వో సబ్ చోడ్ రే! ఇస్ కా కిత్నా హోతా మాలుం? (అడిగాడు, పక్కనే చలనం లేకుండా ఉన్న మేకకేసి చూబిస్తూ)

శిష్యుడు: నహీ! (చాలా obvious అన్నట్టుగా అన్నాడు. గురూగారి కేసి తిరిగి), గురూజీ మీకేమైనా తెల్సా?
గురూజీ: నాకెలా తెలుస్తుంది రా, అప్రాచ్యపు పీనుగా!

శిష్యుడు: (మళ్ళీ సాయబు కేసి తిరిగి), నహీ! (అంతే obvious అన్నట్టు అన్నాడు).

సాయబు: ఠీక్ హై! మేరేకు దస్సజార్ దే దే, మై మాఫ్ కర్తా! (ఫైనల్ కొటేషన్ ఇచ్చాడు).

గురూజీ: (తనలో) అయ్యో, ఇప్పుడెలా? దరిద్రగొట్టు చచ్చినాడు, వాడి మేక పొతే, బ్రాహ్మణ తర్పణం కింద వదిలిపెట్టకుండా నెత్తి మీద కూర్చుంటాడే? దిక్కుమాలిన గోలరా భగవంతుడా?

శిష్యుడు గురూగారి కేసి చూసాడు, గురూజీ "ఓకే" అన్నట్టు తల ఊపాడు.

శిష్యుడు: ఠీక్ హై! ముత్యాల రెడ్డీ జీ కే ఘర్ ఆకే లేనా! (ఇంకేమి చేస్తామన్నట్టు end చేసాడు).
సాయబు: మీరు, ముత్యాల రెడ్డి గారి తాలూకా?

శిష్యుడు: హా! హం ఉన్కే ఘర్ ఆయే హై!

సాయబు: ఆయనకి మాత్రం చెప్పకండే! ఇమ్లీ, ఉఠో (Whistle వేసాడు. మేకపోతు లేచి కూర్చుంది). మీ కాల్మొక్త, రెడ్డి కి చెప్పకండి సాములు! (పెట్టె బేడా సర్దుకుని, మేకలతో పరుగు లంకించాడు).

శిష్యుడు: హా, హం ఉస్కో బిల్కుల్ నహీ బతాఎంగే! (హిందీ లో కంటిన్యూ చేసాడు శిష్యుడు).

శిష్యుడు: (గురూజీ కేసి తిరిగి), హం చలే!

గురూజీ: (సీరియస్ గా), వాడెళ్లిపోయాడు, తెలుగు లో మాట్లాడు.

శిష్యుడు: ఓహ్ (మర్చిపోయినట్టు పేస్ పెట్టి...) మాఫ్ కర్నా, అంటే, సారీ గురూగారు!

Monday, November 1, 2010

Serial Killers - I (భయంకరమైన కామెడీ)

    అది హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లోని, ఒక పెద్ద farm house. లోపల కంపౌండ్ లో entrance దగ్గర కొంతమంది white & white లో నిలబడి ఉన్నారు. లాయరు శివప్రసాద్, చేతిలో ఒక దండ పుచ్చుకుని నిలబడ్డాడు. అందరూ main gate వైపే చూస్తున్నారు.

లాయరు: (స్వగతం) పూలెండిపోతున్నాయి, ఇంకా రాడేంటి? (చేతిలో పూలదండ కేసి చూసి, మళ్ళీ పైకి ఆకాశం కేసి చూస్తూ), పాపం వీట్లిక్కూడా ఎండదెబ్బ తగుల్తున్నట్టుంది. 

ఇంతలో ఆ పేద్ద గేటు తీసుకుని ఒక కారు లోపలి ప్రవేశించింది. అందులోంచి ఒక నడి వయసు వ్యక్తి కిందకి దిగాడు. ముతక ఖద్దరు లాల్చి, cotton పైజమా లతో ఉన్నాడు. సగం తెల్లనైన జుట్టు, ఏదో రింగు రింగులుగా ఉంది. భుజానికొక వేలాడే గుడ్డ సంచీ. అన్నిటికీ మించి ముఖంలో ఒక కార్బను ఫ్రేము కళ్ళ జోడు, ఒక సీరియస్ లుక్కు, మొత్తం మీద అందరూ జడుసుకుని చచ్చేలా ఉంది అతని వాలకం.

లాయరు: రండి, రండి మీకోసమే చూస్తున్నాం (మెడలో దండ వేసాడు). ప్రయాణం బాగా జరిగిందా? (ఇంతలో white & white లో జబర్దస్తు గా ఉన్న ఒకడు, వీళ్ళ మీద పన్నీరు జల్లాడు. మరీ ఘనంగా పడటంతో విసుగ్గా అతనికేసి చూసాడు కళ్ళజోడు వ్యక్తి). 

అంతా కలసి, లోపల హాల్లోకి వెళ్లారు. అక్కడ ముత్యాల రెడ్డి, ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్నాడు. కనిపించగానే ఎదురెళ్లి, కూర్చోబెట్టాడు. కళ్ళజోడు వ్యక్తి, ఒక్క సారి హాలంతా కలియజూస్తూ, కళ్ళజోడు సరి చేసుకుంటూనే కూర్చున్నాడు. అతని మొహంలో ఏ expression లేదు. 

నిజానికి ముత్యాల రెడ్డి real estate రంగం లో రారాజు. అతను చేసినన్ని దందాలు, సెటిలుమెంట్లు ఎవ్వరూ చేసి ఉండరు. అతని పోటిదారులతో పాటు, అతనికి దందాల్లో ఎదురైన వాళ్ళందరికీ అతనో సింహ స్వప్నం. ఐతే ఇదంతా నిన్నటి మాట. ఇన్ని దందాలు చేసిన ముత్యంకి (తెలిసిన వాళ్ళలాగే పిలుచుకుంటారు), ఒక రోజు సడన్ గా, తానెందుకు class అవ్వకూడదనిపించింది. అంతే, అనుకున్న తడవుగా, ఈ దందాలన్నింటికి స్వస్తి చెప్పేసాడు.

అప్పడినించి కళలవైపు change అయ్యాడు ముత్యం. ప్రతి శనివారం ఎవరో singers నో, dancers నో, లేకపోతే painters నో ఆహ్వానించడం, వాళ్ళచేత ప్రదర్శన తన ఫారం హౌస్ లో ఇప్పించడం అలవాటు చేసుకున్నాడు. ఆ classical డాన్సు, మ్యూజిక్కు అర్ధం కాకపోయినా appreciate చేసినట్టు behave చెయ్యడం అలవాటు చేసుకున్నాడు. ఈ మధ్యన మోడరన్ ఆర్టు గాలరీలకి కూడా షికారెల్తున్నాడు. ఆ మధ్యనే కొన్ని అస్సలు అర్ధం కాని పెయి౦టింగులు కొన్నాడు కూడా. ప్రతీ శనివారం ఏదో బుర్రలో ఎక్కించుకోవడం, తరవాత అది దిగడానికి ఆదివారం అంతా ఫుల్లుగా మందుకొట్టెయ్యడం అతనికి అలవాటయ్యిపోయాయి.

ఆ క్రమం లోనే పిలవబడ్డాడు ఈ కళ్ళజోడు వ్యక్తి. ఇతను, పేరు మోసిన TV writer. ఇతను రాసిన serials అన్నీ హిట్లేనట. ఇతనికి ఈ మధ్యలోనే ఒక TV serial కి గాను అవార్డు కూడా వచ్చింది. దాని గురించే ముచ్చట్లు జరుగుతున్నాయి అక్కడ. 

ముత్యం: మీరు మా కుటీరానికి వచ్చారు, చాలా సంతోషం. మీకు అవార్డు వచ్చింది కదా సామి, దాని గురించి చెప్తారా.

వెనకాల నిలబడి ఉన్న సెగట్రీ ని కదిపాడు లాయరు, సెగట్రీ రెస్పాన్స్ గా "అదే! మొదలు లేని కధ!" confirm చేసాడు. కళ్ళజోడు రైటరు చెప్పడం మొదలుపెట్టాడు. 

కళ్ళజోడు: (కళ్ళజోడు సరి చేసుకుంటూ), కధ మొదట్లో.... (కాసేపాగి, గాత్రం సవరించుకున్నాడు, మళ్ళీ), కధ మొదట్లో .... (మళ్ళీ కొంచెం break, మళ్ళీ కొంచెం సేపాగి...), కధ అసలు ఎలా మొదలవుతుందంటే... 

చెప్పుకుపోతున్నాడు. ఇంతలో ఇద్దరు white & white రౌడీ గాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

సత్తి రెడ్డి: అసలు మొదలు లేని కధ౦టే, స్టొరీ ఎట్లా స్టార్ట్ అవ్వుద్దిరా భై?

నాయక్: ఏమో, నాకెందేల్సు? 

సత్తి రెడ్డి: అసలు స్టొరీ కి మొదల్లేకపోవడమేంద్ర? అంతులేని స్టోరీలను చూసినం. 

నాయక్: ఏమో, నాకెందేల్సు రా? 

సత్తి రెడ్డి: అయినా రౌడీ కొడుకులం, మనకేం దెలుస్తది? (ఈ సారి నాయక్ కూడా అతని కేసి తిరిగి, పెదాలు చిట్లిస్తూ అన్నాడు. కళ్ళజోడు కహానీకోరు చెప్పుకు పోతున్నాడు).

రైటరు గారు కధాసాగరం లో వీళ్ళని తీసుకెళ్లడం, అంతా శ్రద్ధగా విన్న ముత్యం, appreciate చెయ్యడం జరిగిపోయాయి యధావిధి గా. ఆ సాయంకాలం అవార్డు ఫంక్షను, మళ్ళీ ఇంకా డీటైల్సు అడిగాడు లాయరు.

లాయరు: (Sofa లో ఉన్న రైటరు కేసి తిరిగి) నమస్కారం సార్!

కళ్ళజోడు: (కళ్ళతోనే స్వీకరించి, సీరియస్ లుక్కు continue చేస్తూ)

లాయరు: సార్, ఇప్పుడు మన సీరియల్లు ఏ టీవీ లో వస్తుందండీ! (కళ్ళజోడు చెప్పాడు). సాయంకాలమా సార్! (మళ్ళీ కళ్ళజోడు clarify చేసాడు).

(చాలా సేపాగి, ఏదో expect చేస్తున్నట్టు తన కేసి చూస్తున్న కళ్ళజోడుతో లాయరే), అంటే చాలా బావుందని మా ఇంట్లో వాళ్ళు అడిగితేను, (కొంచెం గ్యాప్ ఇచ్చి...) Thank you సార్! (ఇంక నిష్క్రమించబోయాడు.)

ఎందుకో కళ్ళజోడుకి ఈ ఎత్తుగడ నచ్చలేదు.

కళ్ళజోడు: అంటే ఆ ఒక్క చానలే కాదు, ఇంకా చాలా వాటిల్లో వస్తుంది (చెప్పాడు).

లాయరు: (డౌట్ గా) ఇంకా అంటే, ఇంకా వేటిల్లో వస్తుంది సార్!

కళ్ళజోడు: (చాలా పేర్లు చెప్పాడు.). అన్నిట్లోనూ వస్తుంది (తల ఊపుతూ...)

లాయరు: ఏ టైం లో అండి! (చిన్న నోటు పుస్తకం తీసాడు)



కళ్ళజోడు: అంటే, నా సీరియల్సు చాలా ఉన్నాయ్ కదా, అవన్నీ మామూలుగా చాలా చానల్సు లో వస్తాయి (తల ఊపుతూ అన్నాడు), కావాలనుకుంటే చూడచ్చు (ముత్యం కేసి తిరిగాడు. ముత్యం ఒక వెర్రి నవ్వు నవ్వాడు). (లాయరు కేసి తిరిగి) నా సీరియల్సు, ఇప్పటి వరకు (ఏమో అనుకుని, మళ్ళీ ముత్యం కేసి తిరిగి), చాలా business చేసాయి ముత్యం! (అలాగే పిలవమని ముత్యం ఈనకి order వేసాడు లెండి పొద్దున్నే). ఇప్పటి వరకు కనీసం కోట్లలో profit వచ్చిఉంటుంది చానళ్ళ వాళ్లందరికీను.
Business అనగానే ముత్యం కొంచం దగ్గాడు, సామాన్యం గా ఇలాంటి శనివారపు భేటీల్లో, business ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతాడు ముత్యం. కాని ఈసారి తను పిలిచిన ఆయనే అనడంతో కొంచం ఖంగారు పడ్డాడు ముత్యం. కానీ చివరికి కోట్లలో లాభం వచ్చిందనగానే, light bulb లాగా వెలిగింది మొహం. ఇంక ఎటువంటి ఫీలింగూ పెట్టుకోవడం అమానుషం అన్నట్టు, భక్తి గా ఆయన కేసి చూసాడు.

కళ్ళజోడు dinner చేసి, సెలవు పుచ్చుకుని పోయాడు.


-2-

ఈ మధ్యల్లో ముత్యం TV సీరియల్సు తెగ చూసేస్తున్నాడు. పొద్దున్న పది గంటలకి మొదలెట్టింది, రాత్రి పదికి కూడా తెమలడం లేదు. అప్పుడప్పుడూ అవన్నీ చూడటమే కాకుండా, తన స్టాఫందరికీ చూపించి అందర్నీ ఏడిపిస్తున్నాడు కూడా. వీళ్ళ ఏడుపులతో ఆ farm house దద్దరిల్లి పోతోంది. కొన్నాళ్ళు చూసాక, ఒక రోజు sudden గా ఒక సీరియల్ ఎపిసోడుని record చేసాడు. రాత్రికి తన రూము లో, మందు కొడుతూ ఆ episode ని ముందుకి వెనక్కి చేస్తూ, ఒక పుస్తకం లో ఏమిటో ఎక్కించాడు. ఆ తర్వాత గాని అతని సీరియల్ watching తగ్గలేదు.

కొంత కాలానికి తెలిసింది, ముత్యం ఒక TV సీరియల్ తీసేద్దామని decide అయ్యిపోయాడని. ముత్యాలకి ఒక గోఫ్ప ambition ఏదో ఉందట కూడాను, ఆ TV సీరియల్ తీసి కుబేరుడై పోవాలని.

(సశేషం) 

Wednesday, September 1, 2010

పంజా (5/5)

ఈ సినిమా బాగానే ఉంది. కధ గాని, పాత్రల తీరు తెన్నులు గాని బాగానే తీర్చి దిద్దారు. మొదట్లో పవన్ కళ్యాన్ గెటప్పు, పోస్టర్లూ అవీ చూసి బాగోలేదని అనుకున్నాను. కాని, పవన్ కళ్యాన్ మరీ అంత బక్కగా లేడు, ఈ సినిమాలో. పైగా అతను ఎక్కువ సినిమా అంతా సూట్స్ వేసుకునే ఉంటాడు, ఈ రెండిటి వల్లా అతని frame (చాతీ) ఎక్కువగానే కనిపించింది. దాన్లో, అతను గెడ్డం పెంచడం వల్ల ఏమి తేడా కనిపించలేదు.

సినిమాలో అందరి characterisation లూ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ (జేయ్), తన చిన్నప్పుడు తనకి జాకీ ష్రాఫ్, చేసిన సాయానికి కృతజ్ఞతగా, అతనికి హెల్ప్ చేస్తుంటాడు. జాకీ ష్రాఫ్, ఒక దాదా, అతనికి నీడలా జేయ్ ఉంటూ ఉంటాడు. అయితే, జాకీ ష్రాఫ్ చివరికి, జేయ్ నించి ఒక రకమైన ఓనరు నవుకరు లాంటి రిలేషను expect చెయ్యడం తో, అతనికి ఎదురు తిరుగుతాడు. జాకీ ష్రాఫ్ మంచి వాడైనప్పటికి అతని కొడుకు, చాలా పొగరు బోతు. తన తండ్రి కింద పని చేసే అందరినీ చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు.

మంచి యూత్ లో ఉన్న అతడి చేష్టలకి తట్టుకోలేక, చాలా మంది దాదా ని వదిలేస్తుంటారు. అతని పాత్ర చిత్రణ కూడా గుడ్. గురు (గురవయ్య) పాత్ర లో తనికెళ్ళ భరణి, పాత్ర చిత్రణ కూడా చాలా బాగుంది. పక్కా అవకాశ వాది గా అతను బాగా నటించాడు. ఇంకా దాదాకి against, ఐన కులకర్ణి పాత్ర, అతని ఫ్రెండ్ పాత్ర చాలా బాగున్నాయి. కరక్ట్ గా సరిపోయాయనిపించింది. ఒక సామాన్య నమ్మకస్తుడైన నవుకరు గా పరుచూరి కూడా బాగా నటించాడు.

ప్రతి సినిమాలోను కూడా, ఎందుకో తెలీదు కాని హీరోయిన్ అంటే, ఏదో special గా పెడుతూనే ఉంటారు. చాలా సందర్భాలలో వాళ్ళ characterisation తిన్నగా ఉండదు కూడా. కాని దీంట్లో, హీరోయిన్ మొక్కలని పెంచే నర్సరీ లో పని చేస్తుంది. హీరో కి అలాంటి నర్సరీ ఉండటం తో, అందులో జాయిన్ అవుతుంది. అక్కడ ఆలీ కామెడీ బాగుంది, చాలా చోట్ల హీరో హీరొయిన్ కామెడీ యే చాలా ఉంది, బాగుంది కూడా. అయితే, ఈ మధ్య సినిమాలలో, కొంచెం convincing హీరోయిన్ characterisation చేసారనిపించింది, ఈ సినిమాలో. మొక్కలని నీళ్ళు, మట్టి తో కాకుండా, ప్రేమతో పెంచాలనేది నాకైతే, కొంత ఓకే అనిపించింది. మరీ అంత వెకిలిగా లేదు, ఓకే. ఈ సినిమాలో అది కొంచెం improvement.
జేయ్, పాత్రలో పవన్ కళ్యాన్, కొంచెం ఓల్డ్ (మరీ యూత్ లా కాదు) గా నటించాడు. అది అతనికి బాగా సరిపోయింది, I am not joking! Fights లో కూడా కొంచెం అతిశయోక్తి ఉంది కాని, చాలా చోట్ల పవన్ కళ్యాన్ నక్కినట్లు (బుల్లెట్లు తగలకుండా), చాలా చోట్ల గన్లూ, గ్రేనేడ్లూ వాడినట్లు చూపించారు. అది కూడా కొంచెం నమ్మేట్లు గానే ఉంది, పరవాలేదు. దాంతో పాటు, gun fighting, stylish గా కూడా ఉంది, పవన్ getup తో కలిపి చూస్తె. మొదటి fight లో surprise బాగా వాడారు, బానే ఉంది అది. 

పాటలు నాకైతే peppy గా ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. మొత్తం మీద సినిమా బాగుంది, గొప్ప విషయం లేకపోవడం దాని తప్పు కాదు. ఈ మధ్య వచ్చిన వాటిలో మంచి సినిమా అనే చెప్పవచ్చు. Entertainment పుష్కలం గా ఉంది. చూడచ్చు. దాంతో పాటుగా, ఎక్కడా logical mistakes చెయ్యలేదు, అంతా సినిమా పరం గా చాలా బాగుంది. It's worth everybody's time! 



ఇక పొతే, negatives కి వద్దాం. ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక డ్రా-బ్యాక్, "బాలు" స్టొరీ ని చాలా పోలి ఉండటమే. స్టొరీ execution, వేరు, చాలా stylish కాబట్టి అలా అనిపించదు కాని, ఇది బాలు స్టొరీయే, మళ్ళీ కొత్తగా తీసారనచ్చు, అంత పోలిక ఉంది, రెండిటికీను. తేడా ఏమిటంటే, దాదాకి ఒక కొడుకు, సెకండు హీరోయిను లేక పోవడం అంతే. హీరోకి దాదా చిన్నప్పుడే హెల్పు చెయ్యడం, దాంతోపాటు హీరో అతని దగ్గరే ఉండిపోవడం, మధ్యలో వదిలేసి వెళ్ళడం, చివరికి తన లవ్/లైఫు కోసమని విలన్ని చంపడం, ఇదంతా ఇంచుమి౦చు సేం. పైగా బాలు, ఇదీ చేసింది ఒక హీరోనే, పవన్ యే. అసలు ఎలా మళ్ళీ చేసేసాడా అనిపించింది నాకు, కాని సినిమా పరం గా ఒకే. పైగా ఆలోచిస్తే బాలూకి దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి లెండి, పర్లేదు. Entertaining కాబట్టి, వెళ్లి చూడచ్చు, నాకైతే ఇంకేమి సినిమాలు లేకపోతే రెండోసారి కూడా ఒకే ఇది, చాలా బావుంది సినిమా.

ఇంకో ఒక చిన్న విషయం ఏమిటి అంటే, Sarah Jane Dias బార్లో డాన్సులు చేస్తుంది, మాట్లాడే ఇంగ్లీషు మాత్రం దంచేస్తుంది. నాకు ఒక సారి వచ్చిన డవుటు ఏమిటి అంటే, అంత ఇంగ్లీషు మాట్లాడగలిగిన అమ్మాయి బార్లో డాన్సులు ఎందుకు చేస్తుంది అని?
కనీసం ఒక్క ఇంగ్లీషు తప్ప ఏమి రాకపోయినా, ఏదో ఒక ఉద్యోగం ఉంటుంది కదా అని నా డవుటు. కాని, దానికి దొరికిన explanation ఏమిటి అంటే, ఆ అమ్మాయి అన్ని బార్లు లోను డాన్సు చెయ్యదట. సినిమాలో చూస్తె ఆ అమ్మాయి డాన్సు చేసినది, ఒక రకం గా తన బార్లోనే, వీళ్ళ గంగు అందరూ కలుసుకునే బారు, పైగా చూస్తే అది దాదా బార్లాగా కూడా ఉంది. మొత్తం బార్ అంతా వాళ్ళదే కాబట్టి, డాన్సు చేసింది అనుకోవచ్చు. పైగా, ఆ అమ్మాయి బ్యాక్-గ్రౌండ్ ఏమిటో తెలీదు కదా, జేయ్ లాగ చదువుకున్నా కూడా, ఇందులో హెల్పు గా ఉండవలసి వచ్చిందేమో మరి. 

ఇందులో "బాలు" పోలిక, ఇంకా ఈ చిన్న Sarah Jane Dias charatcerisation తప్ప, సినిమా పరం గా చాలా బావుంది. ఫుల్ మార్క్స్.





Tuesday, August 31, 2010

శ్రీ రామ రాజ్యం (1/5)


ఈ సినిమా నిజం చెప్పాలంటే అస్సలు బాలేదు. రామాయణం తెలిసిన కధే కాబట్టి, కధ చెప్పడంలో ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి. డైలాగుల్లో కాని, పాత్ర చిత్రణ (Characterisation) లో గాని, ఒకటికి రెండు కాదు పది సార్లు ఆలోచించాలి. కాని ఈ సినిమాలో ఎన్నో ఎన్నో లోపాలు ఉండటం గమనార్హం.

మొట్టమొదట రాముడు, సీతాదేవిని ఒక చాకలి మాటలు విని వదలవలసి వచ్చినప్పుడు, మధనపడినట్టుగా చూపించారు. రాముడు, సింహాసనాన్ని తన తమ్ములకి ఇద్దామనుకుంటాడు, తమ్ముళ్ళతో ఎవరైనా తీసుకోండి అని మొర పెట్టుకుంటాడు. ఆ సీను పండలేదన్న సంగతి పక్కన పెడితే (సింహాసనం వద్దనడానికి, తమ్ముళ్ళు చెప్పే కారణం అంత గొప్పగా ఏమి ఉండదు), రాముడు తాను రాజుగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కి ప్రతిచర్య ఆలోచించకుండా, escape అవ్వడానికి ప్రయత్నించిన మానసిక దౌర్బల్యం మనకి కనిపిస్తుంది.


రాముడూ మనిషే కావచ్చు, అతనికీ కొన్ని సందర్భాలలో బాధ కలగవచ్చు, ఐతే, రాముడు చేసే మంచి పనులన్నీ ఎవరికోసం చేసాడు? తన రాజ్య ప్రజల కోసమా, తన పూర్వీకుల కోసమా, తన కోసమా? నన్నడిగితే, రాముడి కాలంలో, అతను పెట్టుకున్న principles ఏమి అంతకి ముందు లేవు. ఏక పత్నీవ్రతం, సాక్షాత్తు తన తండ్రి గారికే లేదాయే. సత్య వాక్పరిపాలనం, పిత్రు వాక్పరిపాలనం, లాంటివి ఒక వ్రతం లాగ, జీవితాంతం ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి మంచి లక్షణాలతో పాటు, తల్లీ కొడుకూ, తండ్రీ కొడుకు, భార్యా భర్త, స్వామీ బంటు, అన్న తమ్ముడు, పాలకుడు పాలితుడు లాంటి ఎన్నో మానవ సంబంధాలను (human relations) నిర్వచించాడు కాబట్టే, వాటన్నిటినీ balance చేసాడు కాబట్టే, రాముడు యుగ పురుషుడు అయ్యాడు. రాముడు నడిచిన బాట (రామాయణం) ఈ నాటికి చదవదగినది/ఆచరించదగినది గా ఉంది అంటే, దానికి కారణం ఈ రోజు కూడా అతను బాలన్సు చేసినట్టు human relations బాలన్సు చెయ్యవలసిన అవసరం అందరికీ ఉండటమే. దీనిని బట్టి, రాముడు అన్నీ చెయ్యడం లో ఆనందాన్ని పొందాడనేది నిర్వివాదాంశం.



ఒక వేళ రాముడు ఆనందాన్ని పొందినా పొందకపోయినా, అదే విధం గా ఆయనని చూపించడం ఒక్కటే, సామాన్య ప్రజానీకానికి శ్రేయస్కరం. అదే ఆయనలోని దైవత్వాన్ని మనుషులకి ఒక message లాగా చేరుస్తుంది. అయితే, ఈ సినిమాలో రాముడు చాలా బాధ పడినట్టు చూపించారు. తన తమ్ములలో ఎవరో ఒకరికి రాజ్యాన్ని ఇచ్చి, తను సీతా  అడవుల్లోకి వెళ్లిపోతామనేది, అతని కోరిక గా తోచింది. చివరికి తన వంశ ప్రతిష్ట కోసమని, పూర్వీకుల కోసమని అతను గుండె రాయి చేసుకుని సీతాదేవిని అడవికి పంపించాడట.

రాముడు ఆ తరువాత, కొంత కాలం తన కర్తవ్యమైన ప్రజా పాలనని విస్మరించాడట. నాకైతే అది సరిగ్గా అనిపించలేదు. రాముడు ఇంకో సీనులో "ప్రజలంతా నా బిడ్డలే" అంటాడు. ఒక వేళ, తెలిసి తెలియని బిడ్డ, తండ్రి వద్దకి వచ్చి, "నాన్నా! అమ్మ మంచిది కాదు, వదిలేయ్" అంటే, మంకుపట్టు పడితే, తండ్రి వదిలేస్తాడు, అనుకుందాం. ఎందుకంటే, వదలందే, పిల్లవాడికి మంచి బుద్ది, ఒక రకం గా "సెక్యూరిటీ" డవలప్ అవ్వవు, కాబట్టి "తాత్కాలికం గా వదిలేస్తాడు", అనుకుందాం.

అయితే మటుకు, తన పిల్ల వాడిని ప్రేమించే తండ్రి, చిరునవ్వు తో అతని ఆలనా పాలనా చూడాలి కాని, విస్మరిస్తే ఎలా?

అశ్వమేధ యాగం ఆ తరువాతి ఘట్టం. ఒక ముని (ఋష్య శృంగుడు) వచ్చి, రాజ్య ప్రజలకి కలిగిన అశాంతి తగ్గాలంటే, అశ్వమేధం చెయ్యడం మంచిది అంటాడు, రాముడు సరే అంటాడు. అసలు అశ్వమేధం అంటే, తన రాజ్య విస్తరణం కోసం చేసే యాగం. దానికి, ఉన్న రాజ్యం లోని ప్రజల మంచి చెడ్డలకి సంబంధం ఏమిటో చెప్పలేదు. ఒక వేళ, మన పురాణాల్లో దీని వివరణ ఉన్నా కూడా, మన సినిమావాళ్ళు జాగ్రత్త చెయ్యలేదని, ఇది చెప్పలేదని నా డౌటు. ఈ రోజుల్లో audience కి సాధారణం గా వచ్చే ఇలాంటి డౌటు ని అశ్రద్ధ చెయ్యడం తగదు. ఇది కొంత వరకు ఓకే, అనుకోవచ్చు కాని.

రాముడి పిల్లలైన లవ కుశలు, రామాయణ౦ గానం చేస్తూ, అయోధ్య రావడం, రాముడు సీతమ్మ ని వదిలేసాడని తెలుసుకుని బాధతో తిరిగి రావడం, వరకూ ఓకే. తన తల్లి మందలించడం తో, తమ హద్దులు మీరమని చెప్పిన వాళ్ళు, తిరిగి చివరిలో రాముడితో యుద్ధం ఎలా చేశారు?

వాళ్ళు కూడా రాముడి కొడుకులే కదా, వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతారా, పైగా అంత సులభం గానా? ఒక వేళ చిన్న పిల్లలు అనుకుంటే, ఈ యుద్ధం యొక్క purpose ఏమిటి, ఊరికే పిల్లలు రాముడితో ఫైటింగు చెయ్యడమా? పైగా అస్త్ర, శస్త్రాలు నేర్పిన వాల్మికి, ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వాలో, ఎప్పుడు కూడదో చెప్పలేదా?

ఇంకో విషయం, యుద్ధం ముందుగా రాముల వారిని చూసి, లవకుశలు, "ఏమి తేజస్సు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం", అని చెప్పి నమస్కార బాణం వేస్తారు. ఇది కూడా నాకు నచ్చలేదు. ముఖ తేజస్సనేది, మనిషి భౌతిక (physical) లక్షణం. ఇది ఎలా ఉందంటే, ప్రత్యర్ధి ఎర్రగా బుర్రగా ఉంటె, యుద్ధం చేసేవాడు నమస్కారం పెట్టాలన్నట్టు ఉంది. ఇలా కాక, రాముడి పరిపాలననో, సత్య సంధతనో తెలిసిన వారై, నమస్కారం చేసారంటే ఒక రకం గా ఉంటుంది. ఇదేదో, ఒక నమస్కార బాణం, ఒక తిరస్కార బాణం కోసమని అతికించినట్టు ఉంది. అసలు మనిషిలో నచ్చవలసిన మంచి గుణాల గురించి వాల్మీకి వాళ్లకి ఏమైనా చెప్పాడా లేదా, అనిపిస్తుంది.


ఇది కాక, "నిండు చూలాలు, గర్భిణి" లాంటి పెద్ద మాటలు, పది/పదమూడు సంవత్సరాల పిల్లలు వాడతారా? అప్పటికి వాళ్లకి వాటి మీనింగు తెలుస్తుందా? ఆ పరిస్థితి లో ఉన్న డెప్తు తెలుస్తుందా అంట? పోనీ తెలుస్తుందనే అనుకుందాం. ఇంకో సీనులో సీతాదేవి "నా బతుక్కి సుఖం లేదు" అంటుంది, అసలు ఎవరా డైలాగు రాసింది? తప్పు  కదా!? ఇంకో చోట, రావణుడి భార్య మండోదరి, రావణుడిని "స్త్రీ లోలుడు" అంటుంది. రావణుడు, రావణ బ్రహ్మ, మహా శివ భక్తుడు. అసలు "ఎంత గొప్ప వారైనా ఒక్క తప్పు తో పతనమౌతారు" అని చెప్పడానికి వాల్మీకి రావణుడిని చూపిస్తే, అతడిని "స్త్రీ లోలుడు" అని ఎలా అంటారు? స్త్రీ వ్యామోహం వేరు, స్త్రీ లోలత్వం (అదే పనిగా ఉండటం) వేరు.

లక్ష్మణుడు ఒకడు, సీతాదేవిని కాళ్ళకి మించి పైకి చూడడు, నాకైతే వదినని తల్లిగా చూసేవాడు, ఆమె మొహం చూసి మాట్లాడితే తప్పేమీ కనిపించలేదు? ఇది కొంత ఓకే. మొదటి పాటలో, "శుభ స్వాగతం" అని ఉంది, అసలు స్వాగతానికి శుభం/అశుభం ఉంటాయా? అలాంటి సమాసం సంస్కృతం లో లేదే, "ఘన స్వాగతం" గాని, "సాదర స్వాగతం" గాని ఉంటాయి గాని, ఈ శుభ స్వాగతం ఏమిటి?

ఇలాంటివే, ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో సినిమా నిండా. అందుకే నేను మిగిలిన పాటలు సాహిత్యం అని గాని, ఇంకోటని గాని గమనించలేదు. మంచి కధ, already వాల్మీకి మనకోసమని రాసి పెట్టినది. అందులో, డైలాగులకే తప్పు చేస్తే ఎలాగ? Characterisation తప్పు చెయ్యడం, అందులోను ఇలాంటి స్టోరీస్ లోఅనేది, నాకైతే నచ్చలేదు. మొత్తం మీద ఇలాంటి కధని సినిమాగా తీసేటప్పుడు బాగా జాగ్రత్త వహించాలి మరి.

బాపు గారి సినిమాలలో అందమైన సంభాషణలు ఉండేవి, దీనిలో లేవు మరి. అది రమణ గారు లేని లోటో ఏమో మరి, తెలియదు. మిగతా అందమైన graphics వర్కూ, అందమైన సంగీతం (ఇళయరాజా) ఉన్నాయి, మన హిందూ మతానికి సంబంధించిన ఒక కధ కాబట్టి, తెరకెక్కించడం మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. అయితే, ఒక కళాత్మక వస్తువ గా భావిస్తే మటుకు, దీనికి గారంటీ గా తక్కువ మార్కులే, తప్పదు.




Friday, July 30, 2010

Triangle (English సినిమా) (5/5)

నేను మొన్నీమధ్యనే చూసిన ఒక ఇంగ్లీషు సినిమా పేరు Triangle. మనిషికి మరణాన్ని మించిన భయం లేదు, ఎప్పటికీ ఉండబోదు కూడా. అసలు మరణం అంటే ఎందుకు భయం, చచ్చిన తర్వాత మళ్ళీ పుడతారట కదా? ఇలాంటివే నాకు ఉన్న కొన్ని doubts ని ఆ మధ్య ఎవరో పెద్దవారు ఒకాయన తీర్చారు. మనిషికి ఎంతమంది జ్ఞానులు చెప్పినా చావు తరవాత మళ్ళీ పుడతాననే నమ్మకం రాకుండా చేసాడట దేవుడు. ఎందుకంటే, చిత్తశుద్ది తో మోక్షం పొందటానికి ఎక్కడ ప్రయత్నించరోననిట! ఇదే మృత్యు రహస్యం అని చెప్పారాయన. చాలా బావుంది, explanation.

పుట్టిన ప్రతి జీవి తాలూకు మనసులో, పాత జ్ఞాపకాల ఎఫెక్టు ఉంటుందట కాని, ఆ జ్ఞాపకాలు మాత్రం ఉండవట. అందుకే ఒక రకం గా మనం ఇదివరలో ఏది కావాలనుకున్నమో, ఏది పొందలేకపోయమో, అదే మళ్ళీ కావాలని అనుకు౦టామట, ఏమి తెలియకుండానే. అయితే, ఇలాంటిదే విషయాన్ని ఒక ఇంగ్లీషు సినిమాలో చూడటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రకం గా మన ఫిలాసఫీ ఎంత సార్వజనీనమో అనిపించింది.
సినిమాలో triangle అంటే, మూడు భుజాలు. ఆ మూడు భుజాలూ ఏమిటి అంటే, ఒకటి పుట్టుక, రెండు జీవితం,  మూడు చావు. ఈ మూడు లేనిదే triangle పూర్తి కాదని, మళ్ళీ పుట్టుక సాధ్యం కాదని అంతర్లీనం గా చెప్తుంది సినిమా. మనకి తెలిసిందేమిటంటే, పుట్టుక లేనిదే జీవితం గాని, చావు గాని సాధ్యం కాదు. ఒక క్షణమైనా బ్రతకందే, ఒక జీవి పుట్టిందని గాని, చనిపోయిందని గాని మనం అనలేము. అంటే, triangle లో, పుట్టుక మరియు జీవితం మిగిలిన రెండిటితో ముడిపడి ఉన్నాయని మనకి అనుభవం చెప్తుంది. అయితే, మరి చావు మాటేమిటి? చావు ఉంటె గాని పుట్టుక (మళ్ళీ), జీవితం సాధ్యం కాదా?

ఈ ప్రశ్నలకి ఒక beautiful commentary ఈ సినిమా. ఇవే కాకుండా చావుని తప్పించుకుంటే, ఏమి అవుతుంది అనేది కూడా ఈ సినిమాలో ఒక భాగం. Aoelus అనే ఒక గ్రీకు, చావుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతను అమరుడైనప్పటికి, అది ప్రకృతివిరుద్ధం కాబట్టి, అతనికి ఒక విచిత్రమైన శిక్ష విధిస్తారు దేవతలు. అతను, ఒక బండరాయిని, తోసుకుంటూ తోసుకుంటూ ఒక కొండ పైకి తీసుకు వెళ్ళాలి. అది పైకి వెళ్ళాక ఎలాగు దొర్లి పడిపోతుంది. మళ్ళీ అతను, కిందకి దిగి, మళ్ళీ బండరాయిని తోసుకుంటూ పైకి ఎక్కించాలి.

ఇలా బతికినంత కాలం (ఎల్లకాలం) చేయ్యమనేది అతనికి వేసిన శిక్ష. అయితే, అతను చేసిన తప్పు ఏమిటి, ఈ శిక్ష ఏమిటి, రెండిటికి connection ఏమిటి అనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.

సినిమా గ్రీకు, ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వదు, పూర్తిగా ఈ రోజుల్లో నడుస్తుంది. ఒక single mother, తన పిల్లాడిని బాగా తిడుతూ (వదిలేసిన మొగుడి మీద కోపంతో) ఉండగా సినిమా స్టార్ట్ అవుతుంది. అతడిని స్కూల్లో దింపేసి, ఫ్రెండ్స్ తోటి, సముద్రం మీద షికారు వెళ్ళడానికి వెళ్తుంది. (ఫ్రెండ్స్ అంటే normal ఫ్రెండ్స్యే, boy friend అలా కాదు). సముద్రం లో కొంత దూరం వెళ్ళిన వాళ్లకి, ఒక అనుకోని తుఫాను లాంటిది వచ్చి, బోటు తిరగబడిపోతుంది. వీళ్ళల్లో, ఒక్కరు తప్ప అందరూ ఆ తిరగబడిన బోటు మీదే ఉంటారు, ఒకరి ఆచూకి తెలియదు.

ఆ సాయంకాలం అనుకుంటా, వాళ్లకి ఒక షిప్పు కనిపిస్తుంది. ఆ షిప్పు పేరే Aoelus. అందులో ఎవ్వరూ వీళ్ళకి కనిపించరు. అయితే, ఆ షిప్పులోనే ఒక కిల్లర్ ఉంటుంది. ఆ కిల్లర్ వీళ్ళందరినీ చంపడం (జనన మరణాల సినిమా కదా, కొన్ని చావులు తప్పవు), ఈ single mother చేతిలో ఆ కిల్లర్ చనిపోవడం జరుగుతుంది.

అయితే, ఇప్పుడే ఒక అద్భుతమైన twist జరుగుతుంది. సరిగ్గా ఆ కిల్లర్ చెప్పినట్టే, అదే తిరగబడిన బోటు మీదు, తన ఫ్రెండ్స్, తనతో సహా మళ్ళీ షిప్పు మీదకి రావడం ఆ అమ్మాయి చూస్తుంది. Friends తనని చూడరు కాని.

ఈ సారి ఆ అమ్మాయి, తన friends ని సేవ్ చేద్దామనుకుంటుంది. వాళ్లకి మామూలు గానే కనిపిస్తూ ఉంటుంది. ఒక సారైతే, వాళ్ళు ఇద్దర్నీ చూసి షాక్ అవుతారు కూడా. అయితే, తను ఎంత ప్రయత్నించినా, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. పైగా, ఆ వచ్చిన రెండో అమ్మాయి, కిల్లర్ గా మారి వీళ్ళని చంపడం జరుగుతుంది. కిల్లర్ మళ్ళీ ఈ అమ్మాయి చేతిలోనే చచ్చిపోతుంది. అయితే, అందరూ పోయాక, మళ్ళీ తన ఫ్రెండ్స్ రావడం (తిరగబడిన బోటు మీద) కనిపిస్తుంది. ఈ సారి తన కొడుకుని కలుసుకోవడానికి, తను కిల్లరై ఇది ఫినిష్ చేసేస్తుంది.





తర్వాత కూడా సినిమా continue అవుతుంది, కాని ఇక్కడ ఒక సారి ఆపి నేను, నా analysis చెప్తాను.

ఇక్కడ ఆ అమ్మాయి తనకి తాను కనిపించడం అనేది, ఆ నౌకలో ఉన్న aoelus అఫ్ఫెక్టు. చావుని జయించిన వాడు, దేవుడి దృష్టిలో చనిపోయినట్టే, కాని triangle కోసమని తనని మళ్ళీ పుట్టిస్తాడు దేవుడు. దేవుడు మనిషి కోరికలు తీర్చడానికి, మళ్ళీ అదే పరిస్తితులని కలుగజేస్తాడని ఒక ఊహ. అదే triangle, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుందట. ఆ పరిస్తితులలో, చిన్న చిన్న changes సీన్స్ లో చూస్తాము. ఒకడు (ఫ్రెండ్), ఫస్టు టైం ఆపిలు తినడం, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు, అరటి పండు తినడం లాంటి చిన్న చిన్న changes. ఇవన్నీ ఎందుకంటే, వాళ్ళ మిగిలిపోయిన చిన్న చిన్న కోర్కెలు సైతం తీర్చడం కోసం అన్నమాట. తన ఫ్రెండ్స్ మాత్రం ఇదే మొదటి సారి, ఇదే చివరి సారి అన్నట్టు ఉంటారు. చావుని తప్పించుకున్న ఈ అమ్మాయికి మాత్రం తన జ్ఞాపకం continue అవుతుంది, ఎందుకంటే చావుని తప్పించుకు౦ది కాబట్టి. 

మిగిలిన వాళ్ళు చావంటే భయపడితే, ఈమె భయపడదు. అలాగని సంతోషం ఉంటుందా అంటే, ఈ triangle నించి విముక్తి ఏది, దొరకదే?
Friends కి కూడా విముక్తి త్వరగా రాకపోయినా, మళ్ళీ మళ్ళీ అదే పనులు చెయ్యాలి అనే స్మృతి తనని క్రుంగదీస్తూ ఉంటుంది. పైగా ఎన్నో సార్లు, తను, తన ఫ్రెండ్స్ చనిపోవడం కళ్ళారా చూస్తుంది. పైగా తనని తనే చంపుకోవలసి వస్తూ ఉంటుంది. ఇంతకూ మించిన శిక్ష ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం గ్రీక్ దేవుళ్ళు వేసిన శిక్ష గురించి చెప్పుకోవచ్చు. అతనికి చావు లేకుండా ఉండటం అంటే, వృధా ప్రయాస అని తెలిసి ప్రయత్నించడమే అని చెప్పదలిచారు, వాళ్ళు. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి, తన ఫ్రెండ్స్ ని సేవ్ చెయ్యడానికి, ఇంటికి మరలి వెళ్ళిపోవడానికి వృధాగా ప్రయత్నిస్తుంది.

కొన్ని కొన్ని సీన్స్ లో ఆ అమ్మాయికి ఒక చోట, ఒకే అమ్మాయి (ఫ్రెండ్) చనిపోయిన శరీరాలు ఎన్నో గుట్టలుగా కనిపిస్తాయి. ఒక రూము లో, తన చేతి వ్రాత తో ఉన్న ఎన్నో కాగితాలు కనిపిస్తాయి. ఆ షిప్పు తనకి తెలిసినట్లు ఉంటుంది, కాని గుర్తుకు రాదు. ఒక చోట ఎన్నో sea-gulls (సముద్రం పక్షులు) కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే సెల్ఫు (ఆత్మ), చనిపోయి, ఉన్న జ్ఞాపకం తుడుచుకోకుండా ఉంటె, జరిగేవన్నమాట. మొదటి సారి షిప్పు ఎక్కిన ఆ అమ్మాయికి, తన కీ-బంచ్ కనిపిస్తుంది, తనదే. అది ఆ కిల్లర్ గా ఉన్న అమ్మాయి పారేసుకున్నది.

ఇంకొక విషయ౦ ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఉన్న ఇల్లు, నేల అవన్నీ birth (పుట్టుక) కి సంకేతాలు. బోటు ఎక్కి సముద్రం లో వెళ్ళడం, జీవితమనే ప్రయాణం. బోటు తిరగబడి నౌక చేరడం మరణం. ఆ నౌక, ఇల్లు రెండూ రెండు సమాంతర ప్రపంచాలు (parallel worlds). ఒక చోట పుట్టాలంటే, ఇంకో చోట చావాలి, ఒక చోట చావాలి అంటే, ఇంకో చోట vacancy ఉండాలి. మొత్తం మీద ఆ triangle మటుకూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అందరి కోరికలూ తీరే వరకూ, ఎవరికీ మన అవసరం ఉండనంతవరకూ.

ఇందాక మొదట బోటు తిరగబడినప్పుడు, వీళ్ళకి దొరకని అమ్మాయికి, చావు తర్వాత మళ్ళీ ఈ triangle లో ఉండవలసిన అవసరం లేకపోయింది, అందుకే వీళ్ళకి కనిపించలేదు. ఈమెకి, తన ఫ్రెండ్స్ కీ మాత్రం ఉంది, అందుకే ఆ నౌక లోకి వెళ్ళారు.

తుఫాను లో ఉన్నామని తెలిసి, ఈమె ఫ్రెండ్ ఒకతను, బోటు నించి radio communication చేస్తాడు, అందులో ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. "కిల్లర్ అందర్నీ చంపుతోంది", అంటుంది, కట్టైపోతుంది.

ఆ గొంతు ఈ నౌక లో ఉన్న ఈ అమ్మాయిదే. కిల్లర్ చనిపోయేముందు, ఏమి చెప్పిందో, తను కిల్లర్ గా మారి చనిపోయేముందు కూడా అదే చెప్తుంది. ఫ్రెండ్స్ ని సేవ్ చేద్దామనుకున్నప్పుడు, కిల్లర్ గురించి మళ్ళీ అదే radio communication ఇస్తుంది. వీళ్ళనించి దాక్కున్నప్పుడు, కీ-బంచ్ పడేసుకుంటుంది. మొదట నౌకలో చూసామని వీళ్ళు doubt పడింది కూడా ఈ అమ్మాయిని చూసే. మొదటి సారి చనిపోయిన ఒక ఫ్రెండ్, తనని ఈమె చంపడానికి try చేసి౦దంటాడు, అది అప్పడి వరకు ఉన్న కిల్లర్ అమ్మాయి, ఈమెనే. సినిమా చూస్తె అర్ధం అవుతుంది, స్క్రీన్-ప్లే అద్భుతం, స్క్రిప్టు దుర్భేద్యం.

అయితే, చివరికి షిప్పు లో చనిపోయిన ఈ అమ్మాయి, ఇంటికి చేరుతుంది. ఇంట్లో తనలాగే ఉన్న ఇంకొక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి, తన కొడుకుని తిట్టడంతో, ఆమెని చంపి, కొడుకుతో సహా బయటికి వస్తుంది. (Already ఉన్న తల్లి, షిప్పు లో, తన చేతిలో ఇందాక చనిపోయిన కిల్లర్. మొదట చనిపోయిన కిల్లర్ ఇప్పుడు బహుసా తిరగబడిన బోటు మీద వెయిట్ చేస్తూ ఉండి ఉంటుంది).


అంటే triangle అంటే ఏంటంటే, ఎప్పుడూ ఒక అమ్మాయి నేల మీద, ఒక అమాయి బోటు లోను, ఇంకో అమ్మాయి షిప్పు లోను ఉంటారు. మొదట నేల మీదనించి బయలుదేరిన అమ్మాయి, చివరికి నౌకకి చేరుతుంది. నౌకలో చనిపోయిన అమ్మాయి, నేలమీదకి వచ్చి, మళ్ళీ తల్లి అవుతుంది (పుడుతుంది). పుట్టిన తర్వాత ఎలాగైనా సరే, బోటు ఎక్కి సముద్రం లోకి వెళ్తుంది. సముద్రం లోకి వెళ్ళింది, నౌక మీదకి ఎలాగైనా చేరుతుంది. నౌకలో చనిపోయాక, తిరిగి మళ్ళీ పుడుతుంది. వీళ్ళందరి తో బాటుగా, నౌకలో ఇంకో అమ్మాయి ఉండిపోతుంది, ఎందుకంటే చావుని మోసగించింది కాబట్టి. ఆ అమ్మాయికే ఈ triangle యొక్క repetition గురించి తెలుస్తుంది, మిగిలిన వాళ్లకి తెలియదు. తెలిసాకా, విధి బలీయం కాబట్టి, ఇంకా ఎందుకు ఉన్నాన్రా అనిపిస్తుంది.

చివరికి, తన కొడుకు తో కారు లో వెళ్తున్న ఈ అమ్మాయికి accident అవుతుంది. తను instant గా చనిపోతుంది, పిల్లవాడు చావుబతుకుల్లో ఉంటాడు. అయితే, ఇదంతా ఈమెనే ఇంకొకరిగా చూస్తూ ఉంటుంది. ఈమె ఎవరూ అంటే, ఇందాకా తిరగబడిన బోటు లోనించి నౌక లోకి వెళ్ళిన అమ్మాయి, ఆల్రెడీ ఉన్న కిల్లర్ లలో ఒకరు.

చివరికి విషయాన్ని అర్ధం చేసుకున్న ఈమె (triangle నించి తప్పించుకోవడం అసాధ్యం), తిరిగి harbor కేసి వెళ్తుంది. అక్కడ సముద్రం మీద షికారని ఎంతో excited గా ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి, మళ్ళీ బయలుదేరుతుంది. పిల్లవాడు చనిపోతాడనేది, వీళ్ళ డైలాగుల్లో మనకి తెలుస్తుంది.

Symbolism: ఈ సినిమాలో యూస్ చేసిన సింబాలిజం, చాలా బావుంది. జనన మరణాలకి, జీవితానికి సంకేతాలుగా ఇల్లు, షిప్పు, బోటు వాడటం ఒకటి. Sea-gulls ఒకటి. ఇందులో, మనిషి చనిపోయే ముందుగా, ఒక Sea-gull చనిపోతుంది, ఈమె సముద్రంలోకి ఫ్రెండ్స్ తో వెళ్ళే ముందే ఒక Sea-gull సముద్రం లోకి వెళ్తుంది. ఈమె తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని crabs hatch అవ్వడం (పుట్టడం) చూబిస్తాడు. కొన్ని చోట్ల, "Come back soon", ఇలాంటి బోర్డులు, డైలాగులు ఉంటాయి.

మొత్తం మీద అద్భుతమైన సినిమా. వయోలెన్స్ అంటే మరీ వెగటు లేకపోతె, తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటివి మనకి ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో అనిపిస్తుంది చూస్తె.