Friday, July 30, 2010

Triangle (English సినిమా) (5/5)

నేను మొన్నీమధ్యనే చూసిన ఒక ఇంగ్లీషు సినిమా పేరు Triangle. మనిషికి మరణాన్ని మించిన భయం లేదు, ఎప్పటికీ ఉండబోదు కూడా. అసలు మరణం అంటే ఎందుకు భయం, చచ్చిన తర్వాత మళ్ళీ పుడతారట కదా? ఇలాంటివే నాకు ఉన్న కొన్ని doubts ని ఆ మధ్య ఎవరో పెద్దవారు ఒకాయన తీర్చారు. మనిషికి ఎంతమంది జ్ఞానులు చెప్పినా చావు తరవాత మళ్ళీ పుడతాననే నమ్మకం రాకుండా చేసాడట దేవుడు. ఎందుకంటే, చిత్తశుద్ది తో మోక్షం పొందటానికి ఎక్కడ ప్రయత్నించరోననిట! ఇదే మృత్యు రహస్యం అని చెప్పారాయన. చాలా బావుంది, explanation.

పుట్టిన ప్రతి జీవి తాలూకు మనసులో, పాత జ్ఞాపకాల ఎఫెక్టు ఉంటుందట కాని, ఆ జ్ఞాపకాలు మాత్రం ఉండవట. అందుకే ఒక రకం గా మనం ఇదివరలో ఏది కావాలనుకున్నమో, ఏది పొందలేకపోయమో, అదే మళ్ళీ కావాలని అనుకు౦టామట, ఏమి తెలియకుండానే. అయితే, ఇలాంటిదే విషయాన్ని ఒక ఇంగ్లీషు సినిమాలో చూడటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రకం గా మన ఫిలాసఫీ ఎంత సార్వజనీనమో అనిపించింది.
సినిమాలో triangle అంటే, మూడు భుజాలు. ఆ మూడు భుజాలూ ఏమిటి అంటే, ఒకటి పుట్టుక, రెండు జీవితం,  మూడు చావు. ఈ మూడు లేనిదే triangle పూర్తి కాదని, మళ్ళీ పుట్టుక సాధ్యం కాదని అంతర్లీనం గా చెప్తుంది సినిమా. మనకి తెలిసిందేమిటంటే, పుట్టుక లేనిదే జీవితం గాని, చావు గాని సాధ్యం కాదు. ఒక క్షణమైనా బ్రతకందే, ఒక జీవి పుట్టిందని గాని, చనిపోయిందని గాని మనం అనలేము. అంటే, triangle లో, పుట్టుక మరియు జీవితం మిగిలిన రెండిటితో ముడిపడి ఉన్నాయని మనకి అనుభవం చెప్తుంది. అయితే, మరి చావు మాటేమిటి? చావు ఉంటె గాని పుట్టుక (మళ్ళీ), జీవితం సాధ్యం కాదా?

ఈ ప్రశ్నలకి ఒక beautiful commentary ఈ సినిమా. ఇవే కాకుండా చావుని తప్పించుకుంటే, ఏమి అవుతుంది అనేది కూడా ఈ సినిమాలో ఒక భాగం. Aoelus అనే ఒక గ్రీకు, చావుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతను అమరుడైనప్పటికి, అది ప్రకృతివిరుద్ధం కాబట్టి, అతనికి ఒక విచిత్రమైన శిక్ష విధిస్తారు దేవతలు. అతను, ఒక బండరాయిని, తోసుకుంటూ తోసుకుంటూ ఒక కొండ పైకి తీసుకు వెళ్ళాలి. అది పైకి వెళ్ళాక ఎలాగు దొర్లి పడిపోతుంది. మళ్ళీ అతను, కిందకి దిగి, మళ్ళీ బండరాయిని తోసుకుంటూ పైకి ఎక్కించాలి.

ఇలా బతికినంత కాలం (ఎల్లకాలం) చేయ్యమనేది అతనికి వేసిన శిక్ష. అయితే, అతను చేసిన తప్పు ఏమిటి, ఈ శిక్ష ఏమిటి, రెండిటికి connection ఏమిటి అనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.

సినిమా గ్రీకు, ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వదు, పూర్తిగా ఈ రోజుల్లో నడుస్తుంది. ఒక single mother, తన పిల్లాడిని బాగా తిడుతూ (వదిలేసిన మొగుడి మీద కోపంతో) ఉండగా సినిమా స్టార్ట్ అవుతుంది. అతడిని స్కూల్లో దింపేసి, ఫ్రెండ్స్ తోటి, సముద్రం మీద షికారు వెళ్ళడానికి వెళ్తుంది. (ఫ్రెండ్స్ అంటే normal ఫ్రెండ్స్యే, boy friend అలా కాదు). సముద్రం లో కొంత దూరం వెళ్ళిన వాళ్లకి, ఒక అనుకోని తుఫాను లాంటిది వచ్చి, బోటు తిరగబడిపోతుంది. వీళ్ళల్లో, ఒక్కరు తప్ప అందరూ ఆ తిరగబడిన బోటు మీదే ఉంటారు, ఒకరి ఆచూకి తెలియదు.

ఆ సాయంకాలం అనుకుంటా, వాళ్లకి ఒక షిప్పు కనిపిస్తుంది. ఆ షిప్పు పేరే Aoelus. అందులో ఎవ్వరూ వీళ్ళకి కనిపించరు. అయితే, ఆ షిప్పులోనే ఒక కిల్లర్ ఉంటుంది. ఆ కిల్లర్ వీళ్ళందరినీ చంపడం (జనన మరణాల సినిమా కదా, కొన్ని చావులు తప్పవు), ఈ single mother చేతిలో ఆ కిల్లర్ చనిపోవడం జరుగుతుంది.

అయితే, ఇప్పుడే ఒక అద్భుతమైన twist జరుగుతుంది. సరిగ్గా ఆ కిల్లర్ చెప్పినట్టే, అదే తిరగబడిన బోటు మీదు, తన ఫ్రెండ్స్, తనతో సహా మళ్ళీ షిప్పు మీదకి రావడం ఆ అమ్మాయి చూస్తుంది. Friends తనని చూడరు కాని.

ఈ సారి ఆ అమ్మాయి, తన friends ని సేవ్ చేద్దామనుకుంటుంది. వాళ్లకి మామూలు గానే కనిపిస్తూ ఉంటుంది. ఒక సారైతే, వాళ్ళు ఇద్దర్నీ చూసి షాక్ అవుతారు కూడా. అయితే, తను ఎంత ప్రయత్నించినా, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. పైగా, ఆ వచ్చిన రెండో అమ్మాయి, కిల్లర్ గా మారి వీళ్ళని చంపడం జరుగుతుంది. కిల్లర్ మళ్ళీ ఈ అమ్మాయి చేతిలోనే చచ్చిపోతుంది. అయితే, అందరూ పోయాక, మళ్ళీ తన ఫ్రెండ్స్ రావడం (తిరగబడిన బోటు మీద) కనిపిస్తుంది. ఈ సారి తన కొడుకుని కలుసుకోవడానికి, తను కిల్లరై ఇది ఫినిష్ చేసేస్తుంది.





తర్వాత కూడా సినిమా continue అవుతుంది, కాని ఇక్కడ ఒక సారి ఆపి నేను, నా analysis చెప్తాను.

ఇక్కడ ఆ అమ్మాయి తనకి తాను కనిపించడం అనేది, ఆ నౌకలో ఉన్న aoelus అఫ్ఫెక్టు. చావుని జయించిన వాడు, దేవుడి దృష్టిలో చనిపోయినట్టే, కాని triangle కోసమని తనని మళ్ళీ పుట్టిస్తాడు దేవుడు. దేవుడు మనిషి కోరికలు తీర్చడానికి, మళ్ళీ అదే పరిస్తితులని కలుగజేస్తాడని ఒక ఊహ. అదే triangle, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుందట. ఆ పరిస్తితులలో, చిన్న చిన్న changes సీన్స్ లో చూస్తాము. ఒకడు (ఫ్రెండ్), ఫస్టు టైం ఆపిలు తినడం, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు, అరటి పండు తినడం లాంటి చిన్న చిన్న changes. ఇవన్నీ ఎందుకంటే, వాళ్ళ మిగిలిపోయిన చిన్న చిన్న కోర్కెలు సైతం తీర్చడం కోసం అన్నమాట. తన ఫ్రెండ్స్ మాత్రం ఇదే మొదటి సారి, ఇదే చివరి సారి అన్నట్టు ఉంటారు. చావుని తప్పించుకున్న ఈ అమ్మాయికి మాత్రం తన జ్ఞాపకం continue అవుతుంది, ఎందుకంటే చావుని తప్పించుకు౦ది కాబట్టి. 

మిగిలిన వాళ్ళు చావంటే భయపడితే, ఈమె భయపడదు. అలాగని సంతోషం ఉంటుందా అంటే, ఈ triangle నించి విముక్తి ఏది, దొరకదే?
Friends కి కూడా విముక్తి త్వరగా రాకపోయినా, మళ్ళీ మళ్ళీ అదే పనులు చెయ్యాలి అనే స్మృతి తనని క్రుంగదీస్తూ ఉంటుంది. పైగా ఎన్నో సార్లు, తను, తన ఫ్రెండ్స్ చనిపోవడం కళ్ళారా చూస్తుంది. పైగా తనని తనే చంపుకోవలసి వస్తూ ఉంటుంది. ఇంతకూ మించిన శిక్ష ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం గ్రీక్ దేవుళ్ళు వేసిన శిక్ష గురించి చెప్పుకోవచ్చు. అతనికి చావు లేకుండా ఉండటం అంటే, వృధా ప్రయాస అని తెలిసి ప్రయత్నించడమే అని చెప్పదలిచారు, వాళ్ళు. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి, తన ఫ్రెండ్స్ ని సేవ్ చెయ్యడానికి, ఇంటికి మరలి వెళ్ళిపోవడానికి వృధాగా ప్రయత్నిస్తుంది.

కొన్ని కొన్ని సీన్స్ లో ఆ అమ్మాయికి ఒక చోట, ఒకే అమ్మాయి (ఫ్రెండ్) చనిపోయిన శరీరాలు ఎన్నో గుట్టలుగా కనిపిస్తాయి. ఒక రూము లో, తన చేతి వ్రాత తో ఉన్న ఎన్నో కాగితాలు కనిపిస్తాయి. ఆ షిప్పు తనకి తెలిసినట్లు ఉంటుంది, కాని గుర్తుకు రాదు. ఒక చోట ఎన్నో sea-gulls (సముద్రం పక్షులు) కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే సెల్ఫు (ఆత్మ), చనిపోయి, ఉన్న జ్ఞాపకం తుడుచుకోకుండా ఉంటె, జరిగేవన్నమాట. మొదటి సారి షిప్పు ఎక్కిన ఆ అమ్మాయికి, తన కీ-బంచ్ కనిపిస్తుంది, తనదే. అది ఆ కిల్లర్ గా ఉన్న అమ్మాయి పారేసుకున్నది.

ఇంకొక విషయ౦ ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఉన్న ఇల్లు, నేల అవన్నీ birth (పుట్టుక) కి సంకేతాలు. బోటు ఎక్కి సముద్రం లో వెళ్ళడం, జీవితమనే ప్రయాణం. బోటు తిరగబడి నౌక చేరడం మరణం. ఆ నౌక, ఇల్లు రెండూ రెండు సమాంతర ప్రపంచాలు (parallel worlds). ఒక చోట పుట్టాలంటే, ఇంకో చోట చావాలి, ఒక చోట చావాలి అంటే, ఇంకో చోట vacancy ఉండాలి. మొత్తం మీద ఆ triangle మటుకూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అందరి కోరికలూ తీరే వరకూ, ఎవరికీ మన అవసరం ఉండనంతవరకూ.

ఇందాక మొదట బోటు తిరగబడినప్పుడు, వీళ్ళకి దొరకని అమ్మాయికి, చావు తర్వాత మళ్ళీ ఈ triangle లో ఉండవలసిన అవసరం లేకపోయింది, అందుకే వీళ్ళకి కనిపించలేదు. ఈమెకి, తన ఫ్రెండ్స్ కీ మాత్రం ఉంది, అందుకే ఆ నౌక లోకి వెళ్ళారు.

తుఫాను లో ఉన్నామని తెలిసి, ఈమె ఫ్రెండ్ ఒకతను, బోటు నించి radio communication చేస్తాడు, అందులో ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. "కిల్లర్ అందర్నీ చంపుతోంది", అంటుంది, కట్టైపోతుంది.

ఆ గొంతు ఈ నౌక లో ఉన్న ఈ అమ్మాయిదే. కిల్లర్ చనిపోయేముందు, ఏమి చెప్పిందో, తను కిల్లర్ గా మారి చనిపోయేముందు కూడా అదే చెప్తుంది. ఫ్రెండ్స్ ని సేవ్ చేద్దామనుకున్నప్పుడు, కిల్లర్ గురించి మళ్ళీ అదే radio communication ఇస్తుంది. వీళ్ళనించి దాక్కున్నప్పుడు, కీ-బంచ్ పడేసుకుంటుంది. మొదట నౌకలో చూసామని వీళ్ళు doubt పడింది కూడా ఈ అమ్మాయిని చూసే. మొదటి సారి చనిపోయిన ఒక ఫ్రెండ్, తనని ఈమె చంపడానికి try చేసి౦దంటాడు, అది అప్పడి వరకు ఉన్న కిల్లర్ అమ్మాయి, ఈమెనే. సినిమా చూస్తె అర్ధం అవుతుంది, స్క్రీన్-ప్లే అద్భుతం, స్క్రిప్టు దుర్భేద్యం.

అయితే, చివరికి షిప్పు లో చనిపోయిన ఈ అమ్మాయి, ఇంటికి చేరుతుంది. ఇంట్లో తనలాగే ఉన్న ఇంకొక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి, తన కొడుకుని తిట్టడంతో, ఆమెని చంపి, కొడుకుతో సహా బయటికి వస్తుంది. (Already ఉన్న తల్లి, షిప్పు లో, తన చేతిలో ఇందాక చనిపోయిన కిల్లర్. మొదట చనిపోయిన కిల్లర్ ఇప్పుడు బహుసా తిరగబడిన బోటు మీద వెయిట్ చేస్తూ ఉండి ఉంటుంది).


అంటే triangle అంటే ఏంటంటే, ఎప్పుడూ ఒక అమ్మాయి నేల మీద, ఒక అమాయి బోటు లోను, ఇంకో అమ్మాయి షిప్పు లోను ఉంటారు. మొదట నేల మీదనించి బయలుదేరిన అమ్మాయి, చివరికి నౌకకి చేరుతుంది. నౌకలో చనిపోయిన అమ్మాయి, నేలమీదకి వచ్చి, మళ్ళీ తల్లి అవుతుంది (పుడుతుంది). పుట్టిన తర్వాత ఎలాగైనా సరే, బోటు ఎక్కి సముద్రం లోకి వెళ్తుంది. సముద్రం లోకి వెళ్ళింది, నౌక మీదకి ఎలాగైనా చేరుతుంది. నౌకలో చనిపోయాక, తిరిగి మళ్ళీ పుడుతుంది. వీళ్ళందరి తో బాటుగా, నౌకలో ఇంకో అమ్మాయి ఉండిపోతుంది, ఎందుకంటే చావుని మోసగించింది కాబట్టి. ఆ అమ్మాయికే ఈ triangle యొక్క repetition గురించి తెలుస్తుంది, మిగిలిన వాళ్లకి తెలియదు. తెలిసాకా, విధి బలీయం కాబట్టి, ఇంకా ఎందుకు ఉన్నాన్రా అనిపిస్తుంది.

చివరికి, తన కొడుకు తో కారు లో వెళ్తున్న ఈ అమ్మాయికి accident అవుతుంది. తను instant గా చనిపోతుంది, పిల్లవాడు చావుబతుకుల్లో ఉంటాడు. అయితే, ఇదంతా ఈమెనే ఇంకొకరిగా చూస్తూ ఉంటుంది. ఈమె ఎవరూ అంటే, ఇందాకా తిరగబడిన బోటు లోనించి నౌక లోకి వెళ్ళిన అమ్మాయి, ఆల్రెడీ ఉన్న కిల్లర్ లలో ఒకరు.

చివరికి విషయాన్ని అర్ధం చేసుకున్న ఈమె (triangle నించి తప్పించుకోవడం అసాధ్యం), తిరిగి harbor కేసి వెళ్తుంది. అక్కడ సముద్రం మీద షికారని ఎంతో excited గా ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి, మళ్ళీ బయలుదేరుతుంది. పిల్లవాడు చనిపోతాడనేది, వీళ్ళ డైలాగుల్లో మనకి తెలుస్తుంది.

Symbolism: ఈ సినిమాలో యూస్ చేసిన సింబాలిజం, చాలా బావుంది. జనన మరణాలకి, జీవితానికి సంకేతాలుగా ఇల్లు, షిప్పు, బోటు వాడటం ఒకటి. Sea-gulls ఒకటి. ఇందులో, మనిషి చనిపోయే ముందుగా, ఒక Sea-gull చనిపోతుంది, ఈమె సముద్రంలోకి ఫ్రెండ్స్ తో వెళ్ళే ముందే ఒక Sea-gull సముద్రం లోకి వెళ్తుంది. ఈమె తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని crabs hatch అవ్వడం (పుట్టడం) చూబిస్తాడు. కొన్ని చోట్ల, "Come back soon", ఇలాంటి బోర్డులు, డైలాగులు ఉంటాయి.

మొత్తం మీద అద్భుతమైన సినిమా. వయోలెన్స్ అంటే మరీ వెగటు లేకపోతె, తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటివి మనకి ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో అనిపిస్తుంది చూస్తె.

Thursday, July 29, 2010

ఓ ... మై ఫ్రెండ్ (4.5/5)

ఈ సినిమా చాలా బాగుంది. ఒక delicate సబ్జెక్టు ని తీసుకుని, అంతే delicate గా దాన్ని హేండిల్ చేశారు, ఈ సినిమాలో. సబ్జక్టు ఏమిటంటే, ఒక మగ ఆడ, జీవితాంతం just friends గానే ఉండి పోవచ్చా? ఉంటె (లవర్సు కాదు), దాన్ని అందరూ ఎలా అర్ధం చేసుకుంటారు, etc... etc...

కధ విషయానికి వస్తే, ఇందులో హీరో, హీరొయిన్సు సిద్ధార్థ్, శృతి హాసన్, just friends అంతే. చిన్నప్పటి నించి, school days నించి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య just friendship యే ఉందని, మనకి వాళ్ళ behavior, characterisation చూస్తె చాలు అర్ధం అవుతుంది. ఎక్కడా అడ్వాన్సు అవ్వడం గాని, ఒకరి గురించి ఇంకొకరు advantage తీసుకోవడం కాని ఉండదు, చాలా సింపుల్ friendship మాత్రమె ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య.

ఇంకో మెయిన్ పాయింటు ఏమిటంటే, వాళ్ళిద్దరూ, ఆడా మగా అని కూడా అనుకోరు. కలిసినప్పుడు, కాళ్ళతో తన్నుకోవడం, శృతి ని ఒక scene లో సిద్ధార్థ్ పైకి ఎత్తి రౌండ్ గా తిప్పడం లాంటివి ఉంటాయి. వీళ్ళిద్దరూ, భుజాల మీద చేతులు వేసుకుని, వెళ్ళిన scenes ఐతే చాలా ఉన్నాయి సినిమా లో.
ఐతే, ఎక్కడా రియల్ గా వీళ్ళు శృతి మించరు, అది వేరే విషయం.

ఇలాంటి thick friends మధ్యలో, వాళ్ళ లవర్సు వస్తే పరిస్ధితి ఎలా ఉంటుంది, అనేది సినిమాలో మెయిను కధాంశం. రొటీన్ కధ లాగే, వాళ్ళు వీళ్ళని mis-understand చేసుకోవడం, వీళ్ళు జీవితాంతం కలవమని వాళ్లకి ప్రామిస్ చెయ్యడం, చివరికి వీళ్ళ friendship గుర్తించి వాళ్ళే వీళ్ళని కలపడం (కొంత టైం అయ్యాక), ఇవి మిగిలిన స్టొరీ లోని parts.

స్టొరీ పాతదే అయినా, దాన్ని treat చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా సగం-సగం గా లేదు, అందరి characterisation అద్భుతం. పైగా, ఇలాంటి సినిమాలు (ఇలాంటి స్టొరీ ఉన్నవి) రావడం rare కాబట్టి, చూడచ్చు. కధలో వీళ్ళే కాకుండా, నవదీప్ (శృతి హాసన్ fiancee), మళ్ళీ హన్సిక (సిద్ధార్థ్ fiancee) ఉన్నారు. వాళ్ళలో, ఒక rich  and open-minded bachelor గా నవదీప్ కనిపిస్తాడు. ఎంత open-minded అయినా, వీళ్ళుఇద్దరినీ అర్ధం చేసుకోలేకపోతాడు.


ఐతే తన ఫీలింగ్స్ ని ముసుగులా తనలోనే ఉంచుకోకుండా, ఎక్కడికక్కడ అతను frank గా చెప్పిన తీరు చాలా బావుంది. At the same time, తనికెళ్ళ భరణి (సిద్ధార్థ్ తండ్రి), సిద్ధార్థ్ ని support చేసినప్పుడు, అతను అడ్డు చెప్పిన తీరు, "మీరు ఇంత చెప్పాకా కూడా ఇలా అనడం బావోదు", అంటూ start చేసి, చాలా నచ్చింది. ఎందుకంటే అతను చెప్పింది 100% కరెక్ట్. తన కొడుకు మంచి వాడని తండ్రిగా నమ్మినట్టుగా, ఒకడు తన భార్య ఫ్రెండ్ (మగాడు) మంచి వాడని నమ్మలేదు, అది చాలా natural.

హన్సిక కి పెద్దగా characterisation అవసరం లేదు, ఎందుకంటే ఆమెది ఒక మామూలు అమ్మాయి రోల్. అందులో తను బాగానే ఉ౦ది, ఆ పార్టు ఓకే.

ఒక practical తండ్రి లాగ తనికెళ్ళ భరణి, బాగా act చేసాడు. మ్యూజిక్ లో గిటారు ఎక్కువగా ఉంది, అది youthful గా ఉంటుందని పెట్టారో, మ్యూజిక్-డైరెక్టర్ కొత్త అవ్వడం వల్లో, లేదంటే సినిమాలో హీరో గిటార్-ప్లేయర్ అనో తెలీదు, మ్యూజిక్ బావుంది కాని. చాలా చోట్ల హీరో వాయించిన గిటారు బిట్స్ బావున్నాయి.
ఐతే, సినిమా మ్యూజిక్ లో వెరైటీ చాల important కాబట్టి, ఒక 5-6 సినిమాల తర్వాత, ఇది మారితే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాడు, బెస్ట్ అఫ్ లక్ to him.

కెమేరా వర్కు బావుంది, కేరళా లో వీళ్ళ మధ్య clash వచ్చే scenes బాగా తీసారు. కామెడి, need not mention it.

ఇదంతా పాజిటివ్, సినిమా తప్పకుండా చూడచ్చు. ఐతే, ఇలాంటి themes కి వోటు వేసేటప్పుడు, కొంచం జాగ్రత్తగా ఉండాలి. First of all, ఈ సినిమాలో చూపించిన టైపు friendship చాలా తక్కువమందికి ఉంటుంది. ఇలాంటివి ఊహించుకుని, కొంతమంది normal life లో కూడా తాము ఇలాగే అనుకునే problem ఉంది కదా. అదే జరిగితే, వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. పైగా, సినిమాల్లో, ఒకటో రెండో మాంచి సినిమాలు రావడం, వాటిల్తో వచ్చిన ఫీల్తో ఇంకో పది చెత్త సినిమాలు (same అలాంటివి) తీసేయ్యడం, ఒక కొత్త ట్రెండు తెచ్చేయ్యడం మామూలే కదా.


అందుకే, ఈ సినిమా వల్ల వచ్చిన ఫీల్ని అట్టేపెట్టుకోండి, ఎక్కువగా ఇదవ్వద్దు. ఈ సినిమాలో ఇంకో విషయం. చిన్నప్పుట్నించి friends అయినా, teenage వచ్చినాకా కూడా, అలాగే ఉండే వాళ్ళు చాలా తక్కువ. ఇంకో విషయం, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు, friendship అడ్డు రాకూడదు. అది ఏ friendship అయినా సరే, ఎలాంటిదైనా సరే. సినిమాలో ఇది సరిగ్గానే తీసారు, కాని ఇలాంటివి base చేసుకుని, ఇంకో నాలుగు వెకిలి సినిమాలు రావని గారంటీ లేదు, అందుకే చెప్తున్నా. ఇంకోటి, friend ఎప్పుడు friend లాగానే కనిపించాలి, అంతే గాని ఒక అమ్మాయో, అబ్బాయో కనిపించ కూడదు. ఊరికే బిల్డ్-అప్పులిచ్చి, show చేసి, మళ్ళీ ఈ సినిమాలోలాగా friends మాత్రమె అంతే, అదో సుద్ధ అబద్ధం.

మొత్తానికి, చాలా మంచి సినిమా ఇది. చూస్తె చాలా బావుందనిపిస్తుంది. ఇందులో లవ్ పార్టు కూడా, ఏదో teenage లవ్వు కాకుండా, matured పీపుల్ లవ్ చూపించడం, ఇంకోటి చాలా నచ్చింది. ఇద్దరు కపుల్సూ కూడా, చదువు పూర్తి అయ్యాక, జాబ్ లో సెటిల్ అవుతూ ఉండగా, ప్రేమించుకుంటారు.

సినిమాలో ఒక matured friendship చూపించేటప్పుడు, దీని విషయం లో compromise అవ్వకుండా, ఇంకా చెప్పాలంటే, దానికి తగ్గట్టుగా లవ్ పెట్టడం అభినందనీయం.

సినిమా మొత్తంలో ఒకే ఒక్క చోట, కొంచం ఎబ్బెట్టు గా అనిపించింది. కేరళాలో, తన తండ్రి తను తెచ్చిన బైకు accept చేసాడని, శృతి హాసన్ ని ఎత్తుకుని పైకి, రౌండు గా తిప్పుతూ ఉంటాడు హీరో. అది చూసి కోప్పడిన నవదీప్ తోసేయ్యడంతో, శృతి కి దెబ్బ తగులుతుంది. తన friend అంతే చాలా ఇష్టపడే సిద్ధార్థ్, ఇక్కడ నవదీప్ ని కొడతాడు. అది కొంచం extra గా అనిపించింది. తనకి ఎంత ఫ్రెండ్ అయినా, తన ఫ్రెండ్ fiancee ని కొట్టకూడదు కదా. అతను కొట్టినా, శృతి హాసన్, తన వుడ్బీ ని సపోర్ట్ చెయ్యకపోవడం, సిద్ధార్థ్ ని తిట్టకపోవడం కొంచెం ఆశ్చర్యం గా అనిపించింది. కావాలంటే, కింద పడిపోవడం వల్ల దెబ్బ తగిలి మాట్లాడలేక పోయింది అనుకోవచ్చు, ఓకే.



"కేవలం ఒక ఆడా మగా అనే వాళ్ళని విడిపోమన్నారు", అని conclude చేశారు సినిమాలో. కాని, పెళ్ళయ్యాక, తన భర్తని, అతని తల్లి చూసుకుంటూ ఉంటె, ఓర్వలేని భార్యలు ఎందఱో ఉన్నారు. మగాళ్ళూ అంతే, పెళ్ళయ్యాక అమ్మాయి అమ్మో నాన్నో జోక్యం చేసుకుంటే, direct గా చెప్పేస్తారు. Love చెయ్యడంలో posessiveness ఎలాగా ఉంటుంది, దాన్ని మనం ఏమి చెయ్యలేము. దానికి "ఓన్లీ మగా, ఆడా కాబట్టే విడిపోయారు", అనడం అంత కంప్లీటుగా కరక్టు కాదు. ఇందులో కూడా, హన్సిక చెప్పిన రీజన్ అదే, "మన మధ్య space ని ఇంకెవరో ఆక్రమించినట్టు ఉంది", అంటుంది, అందులో తప్పు నాకు కనిపించలేదు. నవదీప్ కొంచెం jealous గా react అయ్యాడు కాని. Anyway, watch it, it is a very very good movie.






Wednesday, July 28, 2010

మొగుడు -- (కృష్ణ వంశీకి ఏమైంది?!) (1/5)

    ఏంటిది? అంతఃపురం, danger లాంటి సినిమాలు తీసిన కృష్ణ వంశీ ఈ మధ్య అన్నీ చెత్తగా ఎందుకు తీస్తున్నాడు? అతనికి ఏమైంది? ఇవే ప్రశ్నలు నా మనసులో మెదిలాయి, ఈ సినిమా చూసిన తర్వాత. అస్సలు క్లారిటీ ఏమి లేకుండా, ఒక అతుకుల బొంత storyline తోటి ఎందుకు తీసాడా అనిపించింది.

కధలోకి వెళ్తే, గోపి చంద్ ఒక happy bachelor లాగ ఫస్టు దర్శనమిస్తాడు. పెళ్లి వద్దనే అతను, playboy అనుకుంటాం, కాని మళ్ళీ తనకి తన ఫ్యామిలీ అంటే ఇష్టమని, అందు కోసమే పెళ్ళైతే ఆ అమ్మాయి ఎలా ఫ్యామిలీ లో కలుస్తుందో అని భయమని చెప్తాడు, పర్లేదు ఓకే.

ఆ తర్వాత తాప్సి ని చూసి love లో పడతాడు, ఆ అమ్మాయి తల్లి (రోజా) పెద్ద politician, తండ్రి నరేష్. గోపి చంద్, తన నాన్న రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ విషయం చెప్పాక, వెళ్లి వాళ్ళని అడుగుతాడు, వాళ్ళు కూడా ok చెయ్యడం, పెళ్లి జరిగిపోతుంది.

ఐతే గౌరీ దేవి విగ్రహం రాజేంద్ర ప్రసాద్ అడగడంతో, ఆడ పెళ్లి వాళ్ళు ఇవ్వమనడం తో, పెళ్లి మధ్యలో ఆగిపోతుంది. చివరకి వాళ్ళిద్దరూ ఎలా కలిసారనేది remaining స్టోరీ.

గౌరీ దేవి విగ్రహం తీసుకోవడమనేది తమ కుటుంబ సాంప్రదాయమని రాజేంద్ర ప్రసాద్ సెలవిస్తాడు. తన తండ్రుల బట్టి ఇలాగే జరిగిందని, దాని వల్ల ఎవరికీ ఎటువంటి problem లేదని అంటాడు. అసలు, ఇంటినించి ఆడ పిల్లని పంపేటప్పుడు, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పోతే, సిరి పోతుందని, అందుకే ఆ అమ్మాయిని గౌరీ దేవిలో పెట్టి, అప్పుడు అమ్మాయిని పంపిస్తామని, ఆడపెళ్ళి వాళ్ళు చాలా strong రీజనే చెప్తారు, నిజమే.

ఇలాంటి గౌరీ దేవి ని పట్టుకెళ్ళే ఆచారాలు, ఎక్కడా లేవన్న సంగతి పక్కన పెడితే, ఇలాంటి వేరే రకం ఆచారాలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ముందే మాట్లాడుకు౦టారనేది, చాలా సింపుల్ పాయింట్. పెద్ద వాళ్లున్నది, ఇలాంటి విషయాలు చెప్పుకోడానికి కూడా కదా.

అది జరగకుండా, గౌరీ దేవి విగ్రహం లాస్ట్ మినిట్ లో రాజేంద్ర ప్రసాద్ అడగడం, అది పెద్ద గొడవకి దారి తియ్యడం, నాకు మటుకు హాస్యాస్పదం గా అనిపించింది.

రోజా characterisation కూడా కొంచం సరిగ్గా లేదు. ఆమె మొదట్లో, తనకి వ్యతిరేకం గా protest చేస్తున్న వాళ్ళని పోలీసు కేసు లో ఇరికిస్తుంది. అంతా ok గాని, ఏమి జరుగుతోంది అంటూ వచ్చిన police inspector ని తిడుతుంది. ఒక hard-core manipulative politician గా అప్పుడు కన్పించిన రోజా, తర్వాత మొగుడు చెప్పిన మాట విని, ఒక మామూలు (డబ్బున్న వాడైనా, మంచి వాడైనా సరే) మనిషైన రాజేంద్ర ప్రసాద్ తో వియ్యానికి ఒప్పుకుంటుంది. ఆ ఒక్క సంఘటన మినహా రోజా ఎందులోనూ manipulative గా కనిపించదు. రోజా characterisation సరిగ్గా చెయ్యలేదేమో అనిపిస్తుంది. మిగతా సినిమా అంటా ఒక కోపిష్టి గానో, మొండిపట్టుదల మనిషి గానో మాత్రమె కనిపిస్తుంది కాని, మనుషుల్ని యూస్ చేసి అవతల పారేసే politician దర్శనమివ్వదు.



మిగతా వాళ్ళు ఓకే, గాని సినిమా మొత్తం మీద ఒక నిర్దిష్టమైన storyline లేకుండా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా, "శశిరేఖా పరిణయం" టైపులో, హీరో చివర్లో తన ఫ్యామిలీ వాళ్ళందరినీ తిట్టడం (బావల్తో సహా) ఒకటి, ఎందుకా అనిపించింది. సెకండ్ హాఫ్ మధ్యలో, తన ఫామిలీ వాళ్ళని, "ఆపండి మీ ఓవర్ యాక్టింగ్" అని గోపిచంద్ అనడం, సినిమా లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. సినిమా మొత్తం మీద ఇలాంటి dialog ఒకటి ఉంటె చాలనిపిస్తుంది.

మొత్తం మీద, ఒక మొగాడు మొగుడు ఎలా అవుతాడో, ఒక స్త్రీ ఎలా మారుస్తుందో, ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ పెట్టి కృష్ణ వంశీ తీస్తాడనుకుని వెళ్ళిన నాకు చాలా bad experience ఎదురయ్యింది. దీనికన్నా "రోజాని manipulative" గానే అట్టేపెట్టి, పెళ్లిని డ్రామా కింద, చివర్లో ఆపు చేసేసినట్టు చూపిస్తే కొంత twist కి న్యాయం జరిగేదేమో. ఇంకా చెప్పాలంటే, గోపిచంద్ playboy కింద, అతనికి ఇష్టం లేకుండా తాప్సి తోటి పెళ్లైనట్టు, అతన్ని దారికి తేవడానికి తాప్సి try చేసినట్టు, మధ్యలో రోజా అహంకారం అన్నీ పెట్టి ఉంటె, రక్తి కట్టేది. ఏదో ఒక story తీసేసి దానికి మొగుడు, అని పేరు పెట్టేసాడు కృష్ణ వంశీ కూడా, అందరు డైరెక్టర్లు లాగే. అంతఃపురం లాంటి సినిమాలు తీసిన ఒక bright తెలుగు డైరెక్టర్ నించి రావాల్సిన సినిమా కాదిది.

మీరు ఖాళీ గా ఉంటె, వెళ్లి చూడచ్చు, కామెడీ ఓకే, సినిమాలో అవసరం లేదు కాని. మేము కూడా ఒక సారి చూసేసాం కదా. నా అభిప్రాయం తప్పని మీకు అనిపించచ్చేమో కూడా.